8, ఫిబ్రవరి 2023, బుధవారం

కళలు 64, cinima 24 crafts - 1

జపాన్ - మట్టి బంతులు - కళ ; డోరడామో - ఇది ప్రాచీన జపనీస్ కళ ; ;

=====================  ;

japaan - maTTi bamtulu - kaLa ; DOraDAmO - idi praaceena japanees kaLa ; 

సేకరణ - collections 2023  ;  కళలు 64, cinima 24 crafts ; 

link ; Japan - Mud Balls ART  

11, మే 2022, బుధవారం

విడ్డూరమైన వింతలు - 1

 241543903 ;- search this number - for fun ;-  కొన్ని నెంబర్లు మాయ - ఎందువలననో తెలీదు, గానీ - ఈ సంఖ్య - Google search వేసి, గాలిస్తే - మనుషులు కునుకు తీస్తున్నట్లు - ఫొటోలు అనేకం -  screen మీదికి వస్తున్నవి - భాషాభేదం లేకుండా ఇన్ని విధాల విచిత్రంగా - చేసి చూడండి కావాలంటే ;  

============== ; 

konni nembarlu maaya - emduwalananO teleedu, gaanee - ee samkhya - ` - Google search ` 

wEsi, gaalistE - manushulu kunuku teestunnaTlu - phoTOlu anEkam - `screen  `meediki 

wastunnawi - BAshaaBEdam lEkumDA inni widhaala wicitramgaa - cEsi cUDamDi kAwaalamTE ;

&

విడ్డూరమైన వింతలు - 1 ;  శుభకృత్ SuBakRt May 2022 ;  link

26, జులై 2021, సోమవారం

Pellinati Pramanalu Movie Songs | Edo Teliyaka | ANR | Jamuna | Telugu...;
పౌరాణిక, మహాభారత కథలు, సినిమాలు - ANR శ్రీకృష్ణుడు - పాత్రలు ధరించిన సినిమాలు - పెళ్ళినాటి ప్రమాణాలు ; [ జమున - heroine ] ;-
రాజసులోచన - నాట్య అభినయాలు, ఈ scene లో లేతదనంతో చాలా బాగున్నవి. & చొరచొర - తెలుగు పదం - వింత ప్రయోగం - చొరవ - చొరబాటు - మూలం ఐన మాట ఇది.
పాట ;- 
ఏదో భయమేలా, కృష్ణా ;
ఏదో తెలియక పిలిచితినోయీ ; 
మీదికి రాకోయీ ; వాదుకు రాకోయీ ; 2 ; ||
శిరమున పింఛము - నొసటన తిలకము ;
ఉరమున కౌస్తుభము 2 ; 
సుందర రూపము చూడగ నీ మది - తొందరపడెదోయీ ; ; ||
సరస నటనలు - సరస రాగములు ;
సరససాలాపములు ;
మురళీ రవళిని వినగానే హృది 2, 
పరవశించెనోయీ, క్రిష్ణా ;
చొరచొర రాకోయీ, క్రిష్ణా ; || 
 ===========,
`ANR` SreekRshNuDu - pAtralu dharimcina sinimaalu - 
peLLinATi pramANAlu - film ; 
raajasulOcana - nATya abhinayaalu -  ee `scene` lO lEtadanamtO caalaa baagunnawi. & 
coracora - telugu padam - wimta prayOgam - 
corawa - corabATu - - muulam aina mATa idi.
pATa ;- 
EdO BayamElA, kRshNA ;
EdO teliyaka pilicitinOyI ; 
meediki rAkOyee ; waaduku rAkOyI ; 2 ; ||
Siramuna pimCamu - nosaTana tilakamu ;
uramuna kaustubhamu 2 ; 
sumdara ruupamu cUDaga nee madi - 
tomdarapaDedOyI ; ; ||
sarasa naTanalu - sarasa raagamulu ;
sarasasaalaapamulu ;
muraLI rawaLini winagaanE hRdi 2, 
parawaSimcenOyI, krishNA ;
coracora raakOyI, krishNA ; ||
;

10, జూన్ 2020, బుధవారం

ద్వాదశి - 40 - పన్నెండు తెలుగు సామెతలు

1] అంబలి తాగే తాసిల్దారు వెంట, 
              మీసాలు లేపే మాలూకదారు ; 
2] నియోగపు ముష్టికి, బనారసు సంచీ ; :)
3] అందితే జుట్టు పట్టు, అందకుంటె కాళ్ళు పట్టు ;
4] ] అందితే సిగ, అందకపోతే కాళ్ళు ;
5] సిగపట్ల గోత్రాలు ;
           [= తగవులకు కాలు దువ్వే మనుషులు ; 
6] సందట్లో సడేమియా అన్నట్లు ; 
7] ] ఉన్న మాట చెబితే ఊరు అచ్చి రాదు ;
8]  ఊరు మీద అలిగి, 
        చెరువు గట్టు మీద కూర్చున్నాడట ;
9] పాపం అని పచ్చిపులుసు పోస్తే, 
         నేతిబొట్టు లేదని లేసి లేసి ఉరికిండంట ; 
10] ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరుగదు ; 
11] ఆకలిగొన్నవానితో న్యాయం గురించి మాట్లాడకు ; 
12] నోటికి అదుపు, ఇంటికి పొదుపు అవసరం ;
=============,
1] ambali taagE taasildaaru wemTa, 
         meesaalu lEpE maaluukadaaru ; 
2] niyOgapu mushTiki, banaarasu samcee ; 
3]  amditE juTTu paTTu, 
         amdakumTe kALLu paTTu ;
4] amditE siga, amdakapOtE kALLu ; 
5] sigapaTla gOtraalu ;
         [= tagawulaku kaalu duwwE manushulu ] ; 
7] unna mATa cebitE Uru acci rAdu ; 
8] uuru meeda aligi, 
         ceruwu gaTTu meeda kuurcunnADaTa ; 
9] paapam ani paccipulusu pOstE, 
          nEtiboTTu lEdani lEsi lEsi urikimDamTa ; 
10] aakali ruci eragadu, nidra sukham erugadu ; 
11] aakaligonnawAnitO nyaayam gurimci mATlADaku ; 
12] nOTiki adupu, imTiki podupu awasaram ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 39 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ముఖారవిందం భజగోవిందం ; 
2] నీ సరి వేల్పులు లేరు, నా సరి దాసులు లేరు ;

ద్వాదశి - 39 - పన్నెండు తెలుగు సామెతలు ;

1] ముఖారవిందం భజగోవిందం ; = 
2] నీ సరి వేల్పులు లేరు, నా సరి దాసులు లేరు ;
3] తెచ్చుకుంటే భోంచెయ్యి జగన్నాయకా, 
          లేకుంటే ఊరకుండు లోకనాయకా ;
4] నక్క ముదిరితే వఱడు, 
        తొండ ముదిరితే ఊసరవెల్లి ;
5] నక్కా నక్కా నా నామం చూడు, 
       తిరిగి చూస్తే తిరుమణి చూడు ; 
6] తగులమారి తగవులమారి తంపి, పుల్లింగాల పిల్లి
7] A. సంజయ రాయబారం తెచ్చాడు -
7] B. శుష్కప్రియాలు తెచ్చె, శూన్యహస్తాలు మిగిలె ;
8]  కొండంత రాగం తీసి. పిట్టంత పాట పాడాడట ;
9] వగ్గు కోతికి శివం వచ్చినట్లు ; 
10] పరువుకోసం రోకలి మింగితే, 
        పొన్ను కాస్తా ఎక్కడో ఇరుక్కుందట ;
11] అడ్డ జామీనులకు పోతే ; తెడ్డు దెబ్బలు తప్పవు ; 
12] ముహూర్తం చూసి యాత్రకు బయల్దేరితే - 
          మొదటి మొగుడు ఎదురొచ్చాడట ;
================,
1] mukhaarawimdam bhajagOwimdam ; 
2] nee sari wElpulu lEru, naa sari daasulu lEru 
3] teccukumTE BOmceyyi teccukumTE 
      BOmceyyi jagannaayakaa, 
          lEkumTE uurakumDu lOkanAyakaa ; 
4] nakka mudiritE wa~raDu, 
          tomDa mudiritE uusarawelli ; 
5] nakkaa nakkaa naa naamam cUDu, 
               tirigi cUstE tirumaNi cUDu ;
6] tagawulamaari tampi, pullimgaala pilli ; 
7] A.  samjaya raayabaaram teccADu 
7] B. Sushkapriyaalu tecce, SUnyahastaalu migile ;
8] komDamta raagam teesi. 
      piTTamta paaTa pADADaTa ;
9] waggu kOtiki Siwam waccinaTlu ;
10] paruwukOsam rOkali mimgitE, 
             ponnu kaastaa ekkaDO irukkumdaTa ;
11] aDDa jaameenulaku pOtE ; 
          teDDu debbalu tappawu ;
12] muhUrtam cUsi bayaldEritE ,
      modaTi moguDu eduru waccADaTa ;
&
ముందు పోస్టు ;-  ద్వాదశి - 38 - పన్నెండు తెలుగు సామెతలు ;- 
1] *పుట్టినిల్లు ఏకాదశి ; మెట్టినిల్లు గోకులాష్టమి ; 
2] అద్దం అంటే తెలీని పిల్ల, అద్దం చూసుకుంటే, రెండు ముఖాలు కనిపించాయంట ; 
3] కూతురికి బు-ధో-రం, శ-నో-రం, కోడలికి దీరికి దీరికి* [ =*దీపావళి] ; 

ద్వాదశి - 38 - పన్నెండు తెలుగు సామెతలు

1] *పుట్టినిల్లు ఏకాదశి ; మెట్టినిల్లు గోకులాష్టమి ; 
2] అద్దం అంటే తెలీని పిల్ల, అద్దం చూసుకుంటే, 
            రెండు ముఖాలు కనిపించాయంట ; 
3] కూతురికి బు-ధో-రం, శ-నో-రం, 
             కోడలికి దీరికి దీరికి* [ =*దీపావళి]  ;
4] మన్ను మగ్గితే -
             మాలిని చేతికైనా పైరు పంటలు ఔతాయి ;
5]  సేరు దొరకు, మణుగు బంటు ; 
6] పాచిపళ్ళవాడు పేర్చిపెడితే, 
          పసిడి పళ్ళవాడు బరుక్కుని తిన్నాడట ;
7] పేరు లేనమ్మ, పెనం కాజేసిందట ; 
8] మానుపిల్లి ఐనా, మట్టి పిల్లి అయినా, 
                 ఎలుకను పట్టిందే పిల్లి ;
9] పిల్లి అంటే ఏమిటి అని అడిగితే, 
            మార్జాలం అని చెప్పాడట ; 
10] నగరికి ఎంతైనా పెడతాడు గానీ,  
                పెద్దకోడలికి కూడు పెట్టాలంటే ఏడుస్తాడు ;
11] హరిహరులు ఇద్దరూ ఒకటే, 
            అది తెలియనివారి నోట్లో మన్ను [తమిళ సామెత / Tamil Proverb ]
12] బలిజ పుట్టుక పుట్టవలె, బత్తాయి బుడ్డి కొట్టవలె ; 
========================================, 
1] puTTinillu EkaadaSi ; meTTinillu gOkulAshTami ; 
2] addam amTE teleeni pilla, addam cUsukuMTE, 
                   remDu muKAlu kanipimcAyamTa ;  
3] kuuturiki bu-dhO-ram, Sa-nO-ram, kODaliki 
deeriki deeriki* ; [ =*deepAwaLi ] ; 
4] mannu maggitE -
            maalini cEtikainA pairu pamTalu autaayi ; 
5] sEru doraku, maNugu bamTu ;  
6] pAcipALLawADu pErcipeDitE, 
            pasiDi paLLawADu barukkuni tinnADaTa ;
7] pEru lEnamma, penam kaajEsimdaTa ; 
8] maanupilli ainaa, maTTi pilli ayinA, 
            elukanu paTTimdE pilli ;
9] pilli amTE EmiTi ani aDigitE, 
                 maarjaalam ani ceppADaTa ;
10] nagariki emtainaa peDatADu gAnI, 
          peddakODaliki kUDu peTTAlamTE EDustADu ;
11] hariharulu iddaruu okaTE, 
          adi teliyaniwaari nOTlO mannu [tamiLa saameta ] ;
12] balija puTTuka puTTawale, battaayi buDDi koTTawale ; 
&
Notes ;- *1] ఏకాదశి - ఉపవాసాలు చేసే నెల తిథి - గోకులాష్టమి - ఉట్ల పండుగ - 
ఇత్యాది వేడుకల పర్వం - ఆడపిల్లలకు అత్తగారి ఇల్లు భద్రత & శ్రేష్ఠం - అని భావం 
అలనాటి proverb కదా, ఇప్పుడు - నేటి కాలానికి అన్వయిస్తే కుదరదు లెద్దురూ ; :) 
==========, 
1] EkaadaSi - upawaasaalu cEsE nela tithi - gOkulaashTami - uTla pamDuga - 
ityaadi wEDukala parwam - ADapillalaku attagaari illu bhadrata & SrEshTham - 
ani bhaawam ;
&
ముందు పోస్టు ;-  ద్వాదశి - 37 - పన్నెండు తెలుగు సామెతలు ;- 
1] గాడిద కొడకా అంటే, తమరు తండ్రులు, మేము బిడ్డలము అన్నాడట ; 
2] దుడ్డు కర్రా దుడ్డుకఱ్రా ఎవరి మాట వింటావే, 
వింటే ఎవరి చేతిలో ఉంటే వారి మాటని - అన్నదిట ; 

ద్వాదశి - 37 - పన్నెండు తెలుగు సామెతలు

1] గాడిద కొడకా అంటే, 
         తమరు తండ్రులు, మేము బిడ్డలము అన్నాడట ; 
2] దుడ్డు కర్రా దుడ్డుకఱ్రా ఎవరి మాట వింటావే,  
         అంటే ఎవరి చేతిలో ఉంటే వారి మాటని - అన్నదిట ; 
3] అప్పణంగా వస్తే ఆనపకాయ తొక్కను కూడా తింటారు ;
4] ఇసుకతో తాడు పేనుతాడంట - భలే వీడి వాలకం ; 
5] ఆకాశానికి  గాటు పెడ్టాడట, అసాధ్యం మనిషి  ;
6] సుఖం వస్తే, ముఖం కడుక్కోవడానికి కూడా తీరిక లేనట్లు ;
7] దున్నపోతు మీద వాన కురిసినట్లు ; 
8] ఏనుగు మీద దోమ వాలినట్లు ;
9] అద్దంలోని ముడుపు ;
10] అంగడి అమ్మి, గొంగడి కొన్నాడట ; 
11] ఏటిఈతకు, లంక మేతకు సరి ;
12] కళ్ళకు గంతలు కట్టి అడవిలో వదిలేసినట్లు ; 
===============================,
1] gADida koDakA amTE, 
      tamaru tamDrulu, mEmu biDDalamu annADaTa ; 
2] duDDu karraa duDDuka~rraa ewari mATa wiMTAwE,  
          amTE ewari cEtilO uMTE waari mATani - annadiTa ; 
3] appaNamgaa wastE -
           AnapakAya tokkanu kUDA timTAru ;
4] isukatO tADu pEnutA DamTa - 
          bhalE wIDi waalakam ;
5] AkASAniki gATu peDTADaTa, asaadhyam manishi ;
6] sukham wastE, mukham -
                - kaDukkOwaDAniki kUDA teerika lEnaTlu ;
7] dunnapOtu meeda waana kurisinaTlu ; 
8] Enugu mIda dOma wAlinaTlu ;
9] addamlOni muDupu ;
10] amgaDi ammi, gomgaDi konnADaTa ;
11] ETi Itaku, lamka mEtaku sari ;
12] kaLLaku gamtalu kaTTi aDawilO wadilEsinaTlu ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 36 - పన్నెండు తెలుగు సామెతలు ;- 
1] వజ్రం వంటి బిడ్డకు, వైఢూర్యాల అల్లుడు ; 2] లక్క లాంటి తల్లి ; రత్నాల  వంటి పిల్లలు ;