29, జనవరి 2019, మంగళవారం

ద్వాదశి - 7 [ = 12 సామెతల గుత్తి ]

1. అల్లుడి బొట్టు అల్లుడిదే, మామగారి బొట్టు మామగారిదే :)
2. మాటకు మాట బంగారం,  పేటకు కోట బంగారం ;; [or] -
 / మాటకు మాట శృంగారం, పేటకు కోట శృంగారం ;
3. ఊరికొక కోడి ఇస్తే, ఇంటికి ఒక్క ఈక మాత్రమే దొరికేది - 
- తెలంగాణా సామెత ;
4. సముద్రానికి లవణదర్శనమైనట్లు ; 
5. రమ్మన్నారు తిమ్మన్న బంతికి [ = విందు భోజనం ] ;
6. గంగా స్నానానికి కొండుంభట్ల ఆజ్ఞా!? [ అక్కర లేదు - అని భావం] ;
7. అప్పలాచార్యులు ఏమి చేస్తున్నారయ్యా - అంటే చేసిన తప్పులు సరి దిద్దుకుంటూన్నారట.
8. ఆడ లేక మద్దెల ఓడు అన్నాడట ; &  [or] 
ఆడ లేక అంగణం వంకర - అన్నట్లు ; 
नाच न जाने आँगन टेढ़ा - मुहावरा  ;
9. సాకులు చెప్పేవాడికి కాసు, ఇల్లు కప్పిన వాడికి దుగ్గాణీ ;
  = [ కష్టపడిన వానికి తక్కువ ఇచ్చుట =
 శ్రమ విలువను గుర్తించని తత్వం ]
10. వస* పిట్టలా ఒకటే వాగుడు, ఆపకుండా మాట్లాడుట ;
11. పిట్ట కొంచెం, కూత ఘనం ;
12. పిట్టల దొర వచ్చాడు [= అతిశయోక్తులు మాట్లాడే వ్యక్తి ] ;
;
వస* ;- వజా - వచ/  वचा ; sweet flag ;;
sanskrit ; హైమవతి 
============== , ;
wasa* ;- wajaa - waca/  वचा ; 
sweet flag ;;
sanskrit ; haimawati ;
============================ , ;
;
1.  alluDi boTTu alluDidE, 
mAmagaari boTTumaama gaaridE ; :) ,
2. maaTaku maaTa bamgaaram, pETaku kOTa bamgAram / 
 maaTaku maaTa SRmgaaram, pETaku kOTa SRmgAram ;
3. uurikoka kODi istE, imTiki okka eeka maatramE dorikEdi ;
4. samudraaniki lawaNadarSanamainaTlu ; 
5. rammannaaru timmanna bamtiki 
[ = wimdu BOjanam];
6. gamgaa snaanaaniki komDumbhaTla aajnaa!? 
[ akkara lEdu - ani bhaawam] ;
7. appalaacaaryulu Emi cEstunnaarayyaa - amTE cEsina tappulu sari diddukumTUnnaaraTa.
8. ADa lEka maddela ODu annADaTa ; 
ADa lEka amgaNam wamkara - annaTlu ; 
नाच न जाने आँगन टेढ़ा - मुहावरा  ;
9. saakulu ceppEwADiki kaasu, illu kappina wADiki 
duggANI [ kashTapaDina waaniki takkuwa iccuTa = Srama 
wiluwanu gurtimcani paddhati ] ;
10. wasa piTTalaa okaTE waaguDu, aapakumDA maaTlaaDuTa ;
11.  piTTa komcem, kuuta ghanam ;
12. piTTala dora waccADu [= atiSayOktulu mATlaaDE wyakti ] ;
;
colors KSM - 5 









मुहावरे और लोकोक्तियाँ (muhAvarE aur lOkOktiyAn) ; Link ;

4, జనవరి 2019, శుక్రవారం

ద్వాదశి - 6 [ = 12 సామెతల గుత్తి ]

1. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు ;
2. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి ;
3. కర్ణుడు లేని భారతం, శొంఠి లేని కషాయం ;
4. అదిగో ద్వారక, ఆలమంద లవిగో ; 
5. ఆవులను మళ్ళించిన వాడే అర్జునుడు ; 
6. వచ్చిన వాడు ఫల్గుణుడు - అవశ్యము గెలుతు మనంగ రాదు ; 
7. అర్జున ఫల్గుణ కిరీటి - మంత్రం *
8. భీష్మ ప్రతిజ్ఞ ;
9.  ద్రౌపదీ వస్త్రాలు
[= అనేక దుస్తులు ]
10. ఈ వ్యవహారం అంతా పద్మవ్యూహంలాగా ఉన్నది, అర్ధం కాదు ;
11. ఉత్తర కుమారుని ప్రజ్ఞలు/ 
ఉత్తరుని ప్రగల్భాలు ;
12. యక్ష ప్రశ్నలు వేస్తూ విసిగించకు ; 
;
*********************************************, ,

+ *2 రధ కారస్య [ సంస్కృత 2* జాతీయ] ;
&
*పిడుగు మంత్రం - అర్జునుని పది పేర్లు వల్లిస్తారు ;-
1. అర్జున ; 2.ఫల్గుణ ; 3. పార్ధ ; 5. కిరీటి ; 
6. సవ్యసాచి ; 7. శేతవాహన ; 8. బీభత్స ;
9. విజయ ; 10. ధనుంజయ ;
&
శ్లోకం ;-
ఆనుకూల్యేన కార్యాణా మస్తరం సంధీయతే |
భారస్య హి రధకారస్య న వ్యవస్యల్లి పజ్జితాః||
;
తాత్పర్య ;- దేశ, కాలములు కలిసివస్తే 
యుద్ధాది కార్యాలు విజయవంతం ఔతాయి ;
వివేకవంతులు - అనాలోచితంగా పోరుకు సిద్ధపడరు - 
రధములను తయారు చేసే వానిపైన భారం ఉంచి, యుద్ధానికి దిగరు. 
==================,
;
1. kaagala kaaryam gandharwulE teerustaaru ;
2. wimTE BAratam winaali, tinTE gaarelE tinaali ;
3. karNuDu lEni BAratam, SomThi lEni kashAyam ; 
4. adigO dwaaraka, aalamamda lawigO ; 
5. aawulanu maLLimcina wADE arjunuDu ; 
6. waccina wADu phalguNuDu - awaSyamu gelutu manamga raadu ;
8. BIshma pratijna cEsADu ;
8.
9. draupadee wastraalu
[= anEka dustulu ]
10. ee wyawahaaram amtaa padmawyuuhamlaagaa unnadi, 
ardham kaadu ; 
11. uttara kumaaruni prajnalu/ 
uttaruni pragalbhaalu ;
;

pamca paamDawulu emdaru? amTE -
aa maatram naaku telusu, mamcam kOLLalaagaa mugguru - ani
remDu wELLu cuupi, palakapai okka geeta raasaaDu [= moddu, SumTha]
&
*radha kaarasya [ samskRta* jaateeya] ;

1. arjuna ; 2.phalguNa ; 3. paardha ; 5. kireeTi ; 
6. sawyasaaci ; 7. SEtawaahana ; 8. beebhatsa ;
9. wijaya ; 10. dhanumjaya ;
;
*********************************************, 
& SlOkam ;-
aanukuulyEna kaaryANA mastaram samdhIyatE |
BArasya hi radhakArasya na wyawasyalli pajjitA@h||
;
taatparya ;- dESa, kaalamulu kalisiwastE
 
yuddhaadi kaaryaalu wijayawamtam autaayi ;
wiwEkawamtulu - anaalOcitamgaa  pOruku siddhapaDaru,
radhamulanu tayaaru cEsE waanipaina bhaaram umci, 
yuddhaaniki digaru. 

ద్వాదశి - 5 [ = 12 సామెతల గుత్తి ]

1. కాయలో పత్తి[=దూది], కాయలో ఉండగానే -
- సోమన్నకు మూడు మూరలు, నాకు ఆరు మూరలు అన్నట్లు ;
2. చేలో ప్రత్తి చేలో ఉండగానే, పోలికి మూడు పోగులు,
నాకు మూడు పోగులూ అన్నట్లు ;- రైతు సామెత ;
3. కొయ్యరా కొయ్యరా పోలిగా - అంటే - 
టంగుటూరి మిరియాలు - తాటికాయలంత - అన్నట్లు ;
4. చెవిటి చెన్నప్పా అంటే = సెనగల మల్లప్పా అన్నట్లు ;
5. పని మంతుడు పందిరి వేస్తే -
కుక్క తోక తగిలి కూలి పోయిందట 
6. చెల్లని కాసు, ఒల్లని మొగుడు ఒకటే ;
7. ఊగే పంటి కింద - - రాయి పడినట్లు ;
8.  గురువుకే పంగనామాలు పెట్టేవాడు / చెవిలో పువ్వు పెట్టేవాడు ; 
9. *1తా దూర కంత లేదు, మెడకో*2 డోలు - నానుడి ; / 
*1తాను దూర కంత లేదు గానీ,*2 మెడకు ఒక డోలు ; 
10. గడ్డి కుప్పలో - సూది మాదిరి ; - సామెత ;
11. దబ్బనంలో దారం లాగా ;
12. సూది మొన అంత చోటిస్తే, ఇల్లంతా ఆక్రమించె  ;
;
=================================,
;
2. cElO pratti cElO umDagAnE, 
pOliki mUDu pOgulu, naaku mUDu pOguluu annaTlu ;
3. koyyaraa koyyaraa pOligA amTE,
TamguTUri miriyAlu tATi kaayalamta - annaaDaTa ;
4. cewiTi cennappA amTE = senagala mallappA annaTlu ;
 5. panimamtuDu pamdiri wEstE kukka tOka tagili kuulipOyimdaTa ;;
6. cellani kaasu, ollani moguDu okaTE ;
7. uugE pamTi kimda raayi paDDaTTu ;
8. guruwukE pamganaamaalu peTTEwADu ;
cewilO puwwu peTTEwADu ;
9. taa duura kamta lEdu, meDakO DOlu - naanuDi ; / 
taanu duura kamta lEdu gaanee, meDaku oka DOlu ; 
10. gaDDi kuppalO sUdi mAdiri ;
11. dabbanamlO daaram laagaa ;
12. suudi mona amta cOTistE, illamtaa aakramimce  ;
;
- dwaadaSi - 5 [ = 12 saametala gutti ] ;   + 
caption ;- colors KSM - 4+ ; paintings blog ;;

 caption ;- colors KSM - 4 

ద్వాదశి - 4 [ = 12 సామెతల గుత్తి ]

1. కనుమకు కాకర, భోగికి పొట్ల ;
2. సూరీడొచ్చాడు ఏడో రోజు*, 
చిక్కుడాకులు తేరా అభ్యంగన స్నానాలకి ;;
3. కనుమ మీద మొయిలు, కళ్ళెదుట సిరి వాన ;
4. కనుమ రోజున మినుము కొరకాలి ;
5. కాకి నైనా, ఇల్లు కదలనీయొద్దు ;
6. కన్నె నిచ్చిన వారిని కడదాకా మరవొద్దు ;
7. నందనమ్మలు బాగా పూస్తే నారాయణుని చూచినట్లే ;
8.  కుడుము చేతికొస్తే పండుగే ;
9. ఇస్తే హిరణ్య1* దానం, ఇవ్వకుంటే కన్యాదానం ;;
10. నిత్య కళ్యాణం పచ్చ తోరణం ; 
11. మూడు నూర్లు పోయె, మూతి మీసాలు పోయె, 
నంబి సోమయాజులు నామధేయం -- తప్పకపోయె ; - సామెత ;
12. ఆరాటపు పెళ్ళికొడుకు పేరంటాలు వెంట పడ్డాడట ;  
;
- సంక్రాంతి proverbs, పండగ సామెతలు ;
=======================, ; 
1. kanumaku kaakara, BOgiki poTla ; 
2. suureeDoccADu EDO rOju*, 
cikkuDaakulu tEraa abhymgana snaanaalaki ;;
3. kanuma meeda moyilu, kaLLeduTa siri waana ;
4. kanuma rOjuna minumu korakaali ;
5. kaaki nainaa, illu kadalaneeyoddu ;
6. kanne niccina waarini kaDadaakaa marawoddu ;
7. nandanammali baagaa pUstE naarAyaNuni cUsinaTlE ;
8. kuDumu cEtikostE pamDugE ; 
9. istE hiraNya*2 daanam, iwwakumTE kanyaadaanam ;
muuDu nuurlu pOye, muuti meesaalu pOye, nambi 
sOmayaajulu naamadhEyam tappakapOye ; saameta ;
AraaTapu peLLikoDuku pEramTAlu wemTa paDDADaTa ; 
;
= *రధ సప్తమికి ; 1 ;; *2 gold] ;
colors KSM - 3 ; paintings blog 

;

2, జనవరి 2019, బుధవారం

ద్వాదశి - 3 [ = 12 సామెతల గుత్తి ]

1] నా పనికి అడ్డం రాకుండా ఉంటే చాలు, అదే పది వేలు ; 
2] పట్టుకుంటే పది వేలు ;; 
3] ధన మూల మిదం జగత్ ; 
4] పైసాలో పరమాత్మ ;; 
5] కాసులుంటే దేవుడైన దాసుడన్నది ;
6] అప్పు చేసి పప్పు కూడు ;
7]  సొమ్మొకడిది సోకొక్స్డిది ;
8] నడమంత్రపు సిరి, కళ్ళు నెత్తికెక్కాయి ;
9] డబ్బుకు లోకం దాసోహం ;
10] చేతిలో చిల్లి గవ్వ లేదు ;
11] ఎర్ర ఏగాణీ లేదు ;;;
12] తన చేతిలో పచ్చనోట్లు కళకళలాడుతున్నాయి ;
;
ద్వాదశి - 3 [ = 12 సామెతల గుత్తి ] ; 
;
=================================, ;
1] naa paniki aDDam raakumDA umTE caalu, adE padi wElu ; 
2] paTTukumTE padi wElu ;
3] dhana muula midam jagat ; 
4] paisaalO paramaatma ;; 
5] kaasulumTE dEwuDaina daasuDannadi ;
6] appu cEsi pappu kUDu ;
7] sommokaDidi sOkoksDidi ;
8] naDamamtrapu siri, kaLLu nettikekkaayi ;
9] Dabbuku lOkam daasOham ;
10] cEtilO cilli gawwa lEdu ;
11] erra EgaaNI lEdu ;;;
12] tana cEtilO paccanOTlu kaLakaLalADutunnaayi ;
;
dwaadaSi - 3 [ = 12 saametala gutti ] ; 
;
 colors KSM - 2 ; paintings blog 
caption ;- colors KSM - 2 ; paintings blog ;