4, జనవరి 2019, శుక్రవారం

ద్వాదశి - 5 [ = 12 సామెతల గుత్తి ]

1. కాయలో పత్తి[=దూది], కాయలో ఉండగానే -
- సోమన్నకు మూడు మూరలు, నాకు ఆరు మూరలు అన్నట్లు ;
2. చేలో ప్రత్తి చేలో ఉండగానే, పోలికి మూడు పోగులు,
నాకు మూడు పోగులూ అన్నట్లు ;- రైతు సామెత ;
3. కొయ్యరా కొయ్యరా పోలిగా - అంటే - 
టంగుటూరి మిరియాలు - తాటికాయలంత - అన్నట్లు ;
4. చెవిటి చెన్నప్పా అంటే = సెనగల మల్లప్పా అన్నట్లు ;
5. పని మంతుడు పందిరి వేస్తే -
కుక్క తోక తగిలి కూలి పోయిందట 
6. చెల్లని కాసు, ఒల్లని మొగుడు ఒకటే ;
7. ఊగే పంటి కింద - - రాయి పడినట్లు ;
8.  గురువుకే పంగనామాలు పెట్టేవాడు / చెవిలో పువ్వు పెట్టేవాడు ; 
9. *1తా దూర కంత లేదు, మెడకో*2 డోలు - నానుడి ; / 
*1తాను దూర కంత లేదు గానీ,*2 మెడకు ఒక డోలు ; 
10. గడ్డి కుప్పలో - సూది మాదిరి ; - సామెత ;
11. దబ్బనంలో దారం లాగా ;
12. సూది మొన అంత చోటిస్తే, ఇల్లంతా ఆక్రమించె  ;
;
=================================,
;
2. cElO pratti cElO umDagAnE, 
pOliki mUDu pOgulu, naaku mUDu pOguluu annaTlu ;
3. koyyaraa koyyaraa pOligA amTE,
TamguTUri miriyAlu tATi kaayalamta - annaaDaTa ;
4. cewiTi cennappA amTE = senagala mallappA annaTlu ;
 5. panimamtuDu pamdiri wEstE kukka tOka tagili kuulipOyimdaTa ;;
6. cellani kaasu, ollani moguDu okaTE ;
7. uugE pamTi kimda raayi paDDaTTu ;
8. guruwukE pamganaamaalu peTTEwADu ;
cewilO puwwu peTTEwADu ;
9. taa duura kamta lEdu, meDakO DOlu - naanuDi ; / 
taanu duura kamta lEdu gaanee, meDaku oka DOlu ; 
10. gaDDi kuppalO sUdi mAdiri ;
11. dabbanamlO daaram laagaa ;
12. suudi mona amta cOTistE, illamtaa aakramimce  ;
;
- dwaadaSi - 5 [ = 12 saametala gutti ] ;   + 
caption ;- colors KSM - 4+ ; paintings blog ;;

 caption ;- colors KSM - 4 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి