10, జూన్ 2020, బుధవారం

ద్వాదశి - 40 - పన్నెండు తెలుగు సామెతలు

1] అంబలి తాగే తాసిల్దారు వెంట, 
              మీసాలు లేపే మాలూకదారు ; 
2] నియోగపు ముష్టికి, బనారసు సంచీ ; :)
3] అందితే జుట్టు పట్టు, అందకుంటె కాళ్ళు పట్టు ;
4] ] అందితే సిగ, అందకపోతే కాళ్ళు ;
5] సిగపట్ల గోత్రాలు ;
           [= తగవులకు కాలు దువ్వే మనుషులు ; 
6] సందట్లో సడేమియా అన్నట్లు ; 
7] ] ఉన్న మాట చెబితే ఊరు అచ్చి రాదు ;
8]  ఊరు మీద అలిగి, 
        చెరువు గట్టు మీద కూర్చున్నాడట ;
9] పాపం అని పచ్చిపులుసు పోస్తే, 
         నేతిబొట్టు లేదని లేసి లేసి ఉరికిండంట ; 
10] ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరుగదు ; 
11] ఆకలిగొన్నవానితో న్యాయం గురించి మాట్లాడకు ; 
12] నోటికి అదుపు, ఇంటికి పొదుపు అవసరం ;
=============,
1] ambali taagE taasildaaru wemTa, 
         meesaalu lEpE maaluukadaaru ; 
2] niyOgapu mushTiki, banaarasu samcee ; 
3]  amditE juTTu paTTu, 
         amdakumTe kALLu paTTu ;
4] amditE siga, amdakapOtE kALLu ; 
5] sigapaTla gOtraalu ;
         [= tagawulaku kaalu duwwE manushulu ] ; 
7] unna mATa cebitE Uru acci rAdu ; 
8] uuru meeda aligi, 
         ceruwu gaTTu meeda kuurcunnADaTa ; 
9] paapam ani paccipulusu pOstE, 
          nEtiboTTu lEdani lEsi lEsi urikimDamTa ; 
10] aakali ruci eragadu, nidra sukham erugadu ; 
11] aakaligonnawAnitO nyaayam gurimci mATlADaku ; 
12] nOTiki adupu, imTiki podupu awasaram ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 39 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ముఖారవిందం భజగోవిందం ; 
2] నీ సరి వేల్పులు లేరు, నా సరి దాసులు లేరు ;

ద్వాదశి - 39 - పన్నెండు తెలుగు సామెతలు ;

1] ముఖారవిందం భజగోవిందం ; = 
2] నీ సరి వేల్పులు లేరు, నా సరి దాసులు లేరు ;
3] తెచ్చుకుంటే భోంచెయ్యి జగన్నాయకా, 
          లేకుంటే ఊరకుండు లోకనాయకా ;
4] నక్క ముదిరితే వఱడు, 
        తొండ ముదిరితే ఊసరవెల్లి ;
5] నక్కా నక్కా నా నామం చూడు, 
       తిరిగి చూస్తే తిరుమణి చూడు ; 
6] తగులమారి తగవులమారి తంపి, పుల్లింగాల పిల్లి
7] A. సంజయ రాయబారం తెచ్చాడు -
7] B. శుష్కప్రియాలు తెచ్చె, శూన్యహస్తాలు మిగిలె ;
8]  కొండంత రాగం తీసి. పిట్టంత పాట పాడాడట ;
9] వగ్గు కోతికి శివం వచ్చినట్లు ; 
10] పరువుకోసం రోకలి మింగితే, 
        పొన్ను కాస్తా ఎక్కడో ఇరుక్కుందట ;
11] అడ్డ జామీనులకు పోతే ; తెడ్డు దెబ్బలు తప్పవు ; 
12] ముహూర్తం చూసి యాత్రకు బయల్దేరితే - 
          మొదటి మొగుడు ఎదురొచ్చాడట ;
================,
1] mukhaarawimdam bhajagOwimdam ; 
2] nee sari wElpulu lEru, naa sari daasulu lEru 
3] teccukumTE BOmceyyi teccukumTE 
      BOmceyyi jagannaayakaa, 
          lEkumTE uurakumDu lOkanAyakaa ; 
4] nakka mudiritE wa~raDu, 
          tomDa mudiritE uusarawelli ; 
5] nakkaa nakkaa naa naamam cUDu, 
               tirigi cUstE tirumaNi cUDu ;
6] tagawulamaari tampi, pullimgaala pilli ; 
7] A.  samjaya raayabaaram teccADu 
7] B. Sushkapriyaalu tecce, SUnyahastaalu migile ;
8] komDamta raagam teesi. 
      piTTamta paaTa pADADaTa ;
9] waggu kOtiki Siwam waccinaTlu ;
10] paruwukOsam rOkali mimgitE, 
             ponnu kaastaa ekkaDO irukkumdaTa ;
11] aDDa jaameenulaku pOtE ; 
          teDDu debbalu tappawu ;
12] muhUrtam cUsi bayaldEritE ,
      modaTi moguDu eduru waccADaTa ;
&
ముందు పోస్టు ;-  ద్వాదశి - 38 - పన్నెండు తెలుగు సామెతలు ;- 
1] *పుట్టినిల్లు ఏకాదశి ; మెట్టినిల్లు గోకులాష్టమి ; 
2] అద్దం అంటే తెలీని పిల్ల, అద్దం చూసుకుంటే, రెండు ముఖాలు కనిపించాయంట ; 
3] కూతురికి బు-ధో-రం, శ-నో-రం, కోడలికి దీరికి దీరికి* [ =*దీపావళి] ; 

ద్వాదశి - 38 - పన్నెండు తెలుగు సామెతలు

1] *పుట్టినిల్లు ఏకాదశి ; మెట్టినిల్లు గోకులాష్టమి ; 
2] అద్దం అంటే తెలీని పిల్ల, అద్దం చూసుకుంటే, 
            రెండు ముఖాలు కనిపించాయంట ; 
3] కూతురికి బు-ధో-రం, శ-నో-రం, 
             కోడలికి దీరికి దీరికి* [ =*దీపావళి]  ;
4] మన్ను మగ్గితే -
             మాలిని చేతికైనా పైరు పంటలు ఔతాయి ;
5]  సేరు దొరకు, మణుగు బంటు ; 
6] పాచిపళ్ళవాడు పేర్చిపెడితే, 
          పసిడి పళ్ళవాడు బరుక్కుని తిన్నాడట ;
7] పేరు లేనమ్మ, పెనం కాజేసిందట ; 
8] మానుపిల్లి ఐనా, మట్టి పిల్లి అయినా, 
                 ఎలుకను పట్టిందే పిల్లి ;
9] పిల్లి అంటే ఏమిటి అని అడిగితే, 
            మార్జాలం అని చెప్పాడట ; 
10] నగరికి ఎంతైనా పెడతాడు గానీ,  
                పెద్దకోడలికి కూడు పెట్టాలంటే ఏడుస్తాడు ;
11] హరిహరులు ఇద్దరూ ఒకటే, 
            అది తెలియనివారి నోట్లో మన్ను [తమిళ సామెత / Tamil Proverb ]
12] బలిజ పుట్టుక పుట్టవలె, బత్తాయి బుడ్డి కొట్టవలె ; 
========================================, 
1] puTTinillu EkaadaSi ; meTTinillu gOkulAshTami ; 
2] addam amTE teleeni pilla, addam cUsukuMTE, 
                   remDu muKAlu kanipimcAyamTa ;  
3] kuuturiki bu-dhO-ram, Sa-nO-ram, kODaliki 
deeriki deeriki* ; [ =*deepAwaLi ] ; 
4] mannu maggitE -
            maalini cEtikainA pairu pamTalu autaayi ; 
5] sEru doraku, maNugu bamTu ;  
6] pAcipALLawADu pErcipeDitE, 
            pasiDi paLLawADu barukkuni tinnADaTa ;
7] pEru lEnamma, penam kaajEsimdaTa ; 
8] maanupilli ainaa, maTTi pilli ayinA, 
            elukanu paTTimdE pilli ;
9] pilli amTE EmiTi ani aDigitE, 
                 maarjaalam ani ceppADaTa ;
10] nagariki emtainaa peDatADu gAnI, 
          peddakODaliki kUDu peTTAlamTE EDustADu ;
11] hariharulu iddaruu okaTE, 
          adi teliyaniwaari nOTlO mannu [tamiLa saameta ] ;
12] balija puTTuka puTTawale, battaayi buDDi koTTawale ; 
&
Notes ;- *1] ఏకాదశి - ఉపవాసాలు చేసే నెల తిథి - గోకులాష్టమి - ఉట్ల పండుగ - 
ఇత్యాది వేడుకల పర్వం - ఆడపిల్లలకు అత్తగారి ఇల్లు భద్రత & శ్రేష్ఠం - అని భావం 
అలనాటి proverb కదా, ఇప్పుడు - నేటి కాలానికి అన్వయిస్తే కుదరదు లెద్దురూ ; :) 
==========, 
1] EkaadaSi - upawaasaalu cEsE nela tithi - gOkulaashTami - uTla pamDuga - 
ityaadi wEDukala parwam - ADapillalaku attagaari illu bhadrata & SrEshTham - 
ani bhaawam ;
&
ముందు పోస్టు ;-  ద్వాదశి - 37 - పన్నెండు తెలుగు సామెతలు ;- 
1] గాడిద కొడకా అంటే, తమరు తండ్రులు, మేము బిడ్డలము అన్నాడట ; 
2] దుడ్డు కర్రా దుడ్డుకఱ్రా ఎవరి మాట వింటావే, 
వింటే ఎవరి చేతిలో ఉంటే వారి మాటని - అన్నదిట ; 

ద్వాదశి - 37 - పన్నెండు తెలుగు సామెతలు

1] గాడిద కొడకా అంటే, 
         తమరు తండ్రులు, మేము బిడ్డలము అన్నాడట ; 
2] దుడ్డు కర్రా దుడ్డుకఱ్రా ఎవరి మాట వింటావే,  
         అంటే ఎవరి చేతిలో ఉంటే వారి మాటని - అన్నదిట ; 
3] అప్పణంగా వస్తే ఆనపకాయ తొక్కను కూడా తింటారు ;
4] ఇసుకతో తాడు పేనుతాడంట - భలే వీడి వాలకం ; 
5] ఆకాశానికి  గాటు పెడ్టాడట, అసాధ్యం మనిషి  ;
6] సుఖం వస్తే, ముఖం కడుక్కోవడానికి కూడా తీరిక లేనట్లు ;
7] దున్నపోతు మీద వాన కురిసినట్లు ; 
8] ఏనుగు మీద దోమ వాలినట్లు ;
9] అద్దంలోని ముడుపు ;
10] అంగడి అమ్మి, గొంగడి కొన్నాడట ; 
11] ఏటిఈతకు, లంక మేతకు సరి ;
12] కళ్ళకు గంతలు కట్టి అడవిలో వదిలేసినట్లు ; 
===============================,
1] gADida koDakA amTE, 
      tamaru tamDrulu, mEmu biDDalamu annADaTa ; 
2] duDDu karraa duDDuka~rraa ewari mATa wiMTAwE,  
          amTE ewari cEtilO uMTE waari mATani - annadiTa ; 
3] appaNamgaa wastE -
           AnapakAya tokkanu kUDA timTAru ;
4] isukatO tADu pEnutA DamTa - 
          bhalE wIDi waalakam ;
5] AkASAniki gATu peDTADaTa, asaadhyam manishi ;
6] sukham wastE, mukham -
                - kaDukkOwaDAniki kUDA teerika lEnaTlu ;
7] dunnapOtu meeda waana kurisinaTlu ; 
8] Enugu mIda dOma wAlinaTlu ;
9] addamlOni muDupu ;
10] amgaDi ammi, gomgaDi konnADaTa ;
11] ETi Itaku, lamka mEtaku sari ;
12] kaLLaku gamtalu kaTTi aDawilO wadilEsinaTlu ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 36 - పన్నెండు తెలుగు సామెతలు ;- 
1] వజ్రం వంటి బిడ్డకు, వైఢూర్యాల అల్లుడు ; 2] లక్క లాంటి తల్లి ; రత్నాల  వంటి పిల్లలు ; 

7, జూన్ 2020, ఆదివారం

ద్వాదశి - 36 - పన్నెండు తెలుగు సామెతలు

1] వజ్రం వంటి బిడ్డకు, వైఢూర్యాల అల్లుడు ;
2] లక్క లాంటి తల్లి ; రత్నాల  వంటి పిల్లలు ;
3] ఇంట్లో కందిరీగలు తుట్టెలు పెడితే, 
        ఇంటి ఇల్లాళ్ళు గర్భవతులు ఔతారట ; 
4] పైసా మే పరమాత్మ అని కదా ఆర్యోక్తి ;
5] ఓర్చినమ్మకు తేట నీరు ;
6]  యాత్రకు వెళితే పాత్రను కొనాలి ; 
7] చిల్లర శ్రీమహాలక్ష్మి ;
8] చిటికెన వ్రేలు శ్రీపతి ;
9] నూరు* వరకూ నన్ను కాపాడితే - 
ఆ తర్వాత నిన్ను కాపాడుతా అంటున్నది రూపాయి -
[ notes ;- *నూరు = వంద = 100 /  rs100/- ] ;
10] చెప్పు చేపాయి, రుబాబు రూపాయి ; 
11] తల్లి బిడ్డల అరుగుదల చూస్తుంది ; 
       తండ్రి పిల్లల పెరుగుదల చూస్తాడు ;
12] కలిసొచ్చే కాలం వస్తే , నడిచి వచ్చే కొడుకు పుడతాడు ;
 ==================== , ; 
1] wajram wamTi biDDaku, waiDhUryaala alluDu ; 
2]  paisaa mE paramaatma  - ani kadaa aaryOkti 
3] imTlO kamdireegalu tuTTelu peDitE, 
         imTi illALLu garbhawatulu autaaraTa ;
4] lakka lAMTi talli, ratnAla wamTi pillalu ;
5] Orcinammaku tETa neeru ; 
6] yaatraku weLitE paatranu konaali ;
7] cillara Sreemahaalakshmi ;
8] ciTikena wrElu SrIpati ;
9] nuuru warakuu nannu kApADitE - 
          aa tarwAta ninnu kApADutAni,
             anTunnadi rUpAyi ;
notes ;- [ nuuru* = rs100/- = wamda ; 
10] ceppu cEpaayi, rubaabu ruupaayi ; 
11] talli biDDala arugudala cuustumdi ; 
            tamDri pillala perugudala cuustADu ;
12] kalisoccE kAlam wastE naDici waccE koDuku puDatADu ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 35 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] అబద్ధం వా, సుబద్ధం వా - కుంతీపుత్రో వినాయకః ||
2] నందో రాజా భవిష్యతి ; లోకోక్తి ;
Extra Link - vedio
REF ;- రుబాబు రూపాయి చెప్పు చేపాయి -
 Telugu Samethalu - Telangana - Part three ;

6, జూన్ 2020, శనివారం

ద్వాదశి - 35 - పన్నెండు తెలుగు సామెతలు

1] అబద్ధం వా, సుబద్ధం వా - కుంతీపుత్రో వినాయకః ||
2] నందో రాజా భవిష్యతి ; - సామెత / లోకోక్తి ; 
3] తిక్కలోనికి ఎక్కాల బుక్కు ఇస్తే, 
ఎండాకాలంలో లెక్క తేలుస్తానన్నాడట ;   
4] ఇచ్చినమ్మ ఈగ, 
          పుచ్చుకున్నామె కాస్తా పులి ఆయెనే ; 
5]  తింటే ఆయాసం, తినకపోతే నీరసం ;
 6] ఉల్లి ఉంటే మల్లి కాడా వంటలక్కే  ;
 7] మునగానాం తేలానాం మూసి వాయనం అన్నట్లు ;
8] చెప్పేది చెప్పి, చెప్పులా కొట్టి, 
      చిప్పలో బెల్లం పెడతాడు ముసలాడు ; 
9]  తినేది కుడిచేది తిమ్మక్క ఇంట్లో
        పోసుకునేది లేచేది పాపక్క ఇంట్లోనా!? ;
10] బంతి భోజనానికి ముందు, 
         ఎదురు వ్యాజ్యానికి వెనక ఉండాలి ;
11] గుర్రం పేరు గోడా ఐతే, 
గోడ* పేరు గుర్రమే కదా, నాకు ఉర్దూ వచ్చింది   ;
or - గోడ* పేరు గుర్రమే కదా, నాకు ఉర్దూ అంతా తెలిసిపోయింది/ 
వచ్చేసింది / పో ; & notes ;- [ Telugu word - *గోడ = wall ] ;
12] భలే వంటగత్తె అని బండి ఎక్కించుకుంటే - 
చక్రాంకితం కూరలో ఎంత పప్పు వెయ్యాలని అడిగిందట ; 
==============================, ;
1] abaddham waa, subaddham waa - 
                    kumteeputrO winaayaka@h ; 
2] namdO rAja Bawishyati ;
3] tikkalOniki ekkaala bukku istE -
emDA kAlamlO lekka tElustAnannADaTa ;
4] iccinamma eega, puccukunnaame kaastaa puli aayenE ; 
5] timTE Ayaasam, tinakapOtE neerasam ; 
6] ulli umTE malli kuuDA wamTalakkE ;  
7] munagAnaam tElaanAm -
        muusi waayanam annaTlu ;
8] ceppEdi ceppi, ceppulaa koTTi, 
cippalO bellam peDatADu musalADu ; 
9] tinEdi kuDicEdi timmakka imTlO ,
        pOsukunEdi lEcEdi paapakka imTlOnA!!? ; 
10] bamti BOjanAniki mumdu, 
eduru wyAjyAniki wenaka umDAli ;
11] gurram pEru gODA aitE gODa pEru gurramE kadaa, 
           nAku urduu amtaa  waccEsimdi / telisipOyimdi pO ;
notes ;- [ Telugu word - *gODa = wall ] ;
12] BalE wamTagatte ani bamDi ekkimcukumTE - 
cakraamkitam kuuralO emta pappu weyyaalani aDigimdaTa ; 

ముందు పోస్టు ; ద్వాదశి - 34 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ఎక్కినోడిది గుర్రం, ఏలినోడిది రాజ్యం ; 
2] సంక్రాంతి వచ్చేది సాలుకు ఒక్కసారే ; 

ద్వాదశి - 34 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఎక్కినోడిది గుర్రం, ఏలినోడిది రాజ్యం ; 
2] సంక్రాంతి వచ్చేది సాలుకు ఒక్కసారే ; 
3]  దేవుడు గుడిలో ఉంటే పదిలం, బైటికి వస్తే పదలం రాయి* ;
-  notes ;- [ *తూనిక కొలతల రాయి ; Eg.  పదలం ; వీశ, ఏబలం, తులం] ;
4] అండ ఉన్న వాడిదే కదా అందలం ;
5] చుట్టాలకు పెట్టినిల్లు చూరపోయింది, 
          వేల్పులకు పెట్టినిల్లు హెచ్చు అయ్యింది ; 
6]  చీరపోతుకు సిరి వస్తే, 
       గోల్కొండ కాడికి గొడుగును తెచ్చి, పట్టమన్నదట ;
7] ఏమండీ కరణం గారూ, గోతిలో పడ్డారే అంటే, 
         కాదు, కసరత్తు చేస్తున్నాను అన్నాడట ; 
8] చదువుకున్న వాడికీ సేద్యగాడే అన్నం పెట్టాలి ;
9] బడికి బెత్తం, మడికి గెత్తం* ;- [*ఎరువు ];
10] లోకువెవరురా అంటే లొట్టాయ్ పెళ్ళాం అని ;  
11] చక్కిలాలు తింటావా, చల్ది తింటాను తింటాను, 
           చల్ది చక్కిలాలు తింటాను, 
              అయ్యతో కూర్చుని అన్నమూ తింటాను అన్నదిట ; 
12] పాచి ముఖాన ఎప్పుడైతేనేమి ..... ,
భూపాళాలు చదివేందుకు, పాడేందుకు ;
==================================== ;
1] ekkinODidi gurram, ElinODidi raajyam ; 
2] samkraamti waccEdi saaluku okkasaarE ; 
3] dEwuDu guDilO umTE padilam, 
           baiTiki wastE padalam raayi* ;
- notes ;- [*tuunika kolatala raayi ; 
       `Eg` padalam ; weeSa, Ebalam, tulam ] ;
4] amDa unna waaDidE kadA amdalam ; 
5] cuTTaalaku peTTinillu cuurapOyimdi, 
           wElpulaku peTTinillu heccu ayyimdi / pOyimdi ;
6] ceerapOtuku siri wastE, 
          gOlkomDa kADiki goDugunu tecci, paTTamannadaTa ;  
7] mamDI karaNam gArU, gOtilO paDDArE aMTE - 
          kaadu, kasarattu cEstunnaanu annADaTa ; 
8] caduwukunna waaDikI sEdyagaaDE annam peTTAli ; 
9] baDikibettam, maDiki gettam* ;- [*eruwu ] ;
10] lOkuwewaruraa amTE loTTAy peKLLAM ani ; 
11] cakkilaalu timTAwaa, caldi timTAwaa amTE - 
            cakkilaalu timTAnu, caldi timTAnu, 
         ayyatO kuurcuni annamuu timTAnu annadiTa ; 
12] paaci muKAna eppuDaitEnEmi .......... ,
           BUpALAlu cadiwEmduku, pADEmduku ; 
;
& ముందు పోస్టు ; ద్వాదశి - 33 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] పని లేని పాపరాజు ఏమి చేస్తున్నాడురా అంటే, 
        కుందేటి కొమ్ముకు రేఖలు తీస్తున్నాడు అన్నట్లు ; 
2] అవ్వ వడికిన నూలు, తాత ... ;  

ద్వాదశి - 33 - పన్నెండు తెలుగు సామెతలు

1] పని లేని పాపరాజు ఏమి చేస్తున్నాడురా అంటే, 
        కుందేటి కొమ్ముకు రేఖలు తీస్తున్నాడు అన్నట్లు ; 
2] అవ్వ వడికిన నూలు, తాత మొలతాటికే సరిపోయె ; 
3] అవ్వ తీసిన గంధం అంతా తాత తలనొప్పికే సరి ;
4] గడప లోపల సుఖం, కాశీకి వెళ్ళినా దొరికేనా !? 
 -   [ఇంట్లో ఉన్న స్వేచ్ఛ ] ;
5] చెట్టు ఎక్కనిచ్చి, నిచ్చెన తీసినట్లు ; 
6] కలిమిలేములు కావడి కుండలు ;
 & [need notes - కావడి యాత్ర ] ; 
7] కొత్త ఒక వింత, పాత ఒక రోత ;
8] చంక దుడ్డు శరణార్ధి ; 
9] వేటగాడు వల వేస్తే, సగం పిట్టలు అటూ, 
         సగం పిట్టలు ఇటూ ఎగిరిపోయాయిట ; 
10] ఆనందవృష్టి కోసం పెళ్ళి చేసుకుంటే ; 
       అవస్థల సృష్టి వోలె బండెడు సంసారం ;
11] ఏమోయి శెట్టీ, ఏట్లో కొట్టుకుపోతున్నావు, 
అంటే గడ్డి మోపు అమ్మడానికి అన్నాడట ; 
12] అమావాస్య రోజున కయ్యానికి ఎందుకెళ్ళావంటే - 
             ఎదిరి వాడికి అచ్చి రాకుండా - అన్నాడట ;
==============================,
1] pani lEni paaparaaju Emi cEstunnADurA amTE 
       kumdETi kommuku rEKalu teestunnaaDu annaTlu ; 
2] awwa waDikina nuulu, taata molatATikE saripOye ; 
3] awwa teesina gamdham amtA taata talanoppikE sari ;
4] gaDapa* lOpala sukham, 
       kASeeki weLLinaa dorikEnaa !? ;
 [=* imTlO unna swEcCa ] ; 
5] ceTTu ekkanicci, niccena teesinaTlu ; 
6] kalimilEmulu kaawaDi kumDalu ;
[need notes - [ kaawaDi yaatra ]
7] kotta oka wimta, paata oka rOta ; 
8] camka duDDu SaraNArdhi ;
9] wETagADu wala wEstE, 
sagam piTTalu aTuu, sagam piTTalu iTuu egiripOyaayiTa ;
10] AnamdawRshTi kOsam peLLi cEsukumTE ; 
          awasthala sRshTi wOle bamDeDu samsaaram ; 
11] EmOyi SeTTI, ETlO koTTukupOtunnAwu, amTE 
       gaDDi mOpu ammaDAniki annADaTa ; 
12] amaawaasya rOjuna kayyaaniki emdukeLLAwamTE - 
           ediri wADiki acci raakumDA - annaaDaTa 
;
& ముందు పోస్టు ; ద్వాదశి - 32 - పన్నెండు తెలుగు సామెతలు
1] ఓమ్ కారము లేని మంత్రము - అధికారము లేని ప్రజ్ఞ ; 
2] దండమయ్యా బాపనయ్యా అంటే, .............. ;

ద్వాదశి - 32 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఓమ్ కారము లేని మంత్రము - అధికారము లేని ప్రజ్ఞ ; 
2] దండమయ్యా బాపనయ్యా అంటే, 
         మీ తండ్రి నాటి పాత బాకీ ఇచ్చి పొమ్మన్నాడట ;
3] పొట్టకైనా, బట్టకైనా భూదేవే దిక్కు కదా! ;
4] బొమ్మకు మొక్కినా నమ్మకం ఉండాలి 
5] రొట్టె లేదు గాని, ఉంటే నెయ్యి అద్దుకు తిందును  ;
6] ఊరు ఉసిరికాయంత, తగువు తాటికాయంత ;
7] నాడులు ఎంచే వారే గాని, గోడు చూచే వారే లేరు ; 
8]  ఎండిన ఊళ్ళ గోడు ఎవడికి కావాలి, 
         పండిన ఊళ్ళకు అందరూ ప్రభువులే ; 
9]  నాధుడు లేని రాజ్యం నానా విధాలు అయ్యింది 
10] కొండ* మీద మా గుండోణ్ణి* చూసారా!? -
      అని అడిగినట్లైంది ; [ = *తిరుపతి hill ] ;; 
11] తిన్న రేవును తలవాలి ;
12] లంకలో హరి శబ్దం ;
Notes ;- 11] * [= గ్రామీణుల దృష్టిలో చెరువు అంటే =
ఆకలి తీర్చే బువ్వ కుండ ] ;
;
================,
1] Omm kaaramu lEni mamtramu - 
adhikaaramu lEni prajna ; 
2] damDamayyA bApana yyaa amTE, 
mI tamDri nATi pAta bAkI icci pommannADaTa ; 
3] poTTakainaa, baTTakainA BUdEwE dikku kadA! 
4] bommaku mokkinaa nammakam unDAli ;
5] roTTe lEdu gaani, umTE neyyi adduku timdunu ;
6] uuru usirikaayamta, taguwu tATikaayamta ;
7] nADulu emcE waarE gAni, gODu cUcE AE lEru ;
8] emDina ULLa gODu ewaDiki kaawaali, 
        pamDina ULLaku amdarU praBuwulE ; 
9] naadhuDu lEni raajyam naanaa widhaaluu ;
10] komDa* mIda mA gumDONNi cUsArA!? 
          ani aDiginaTlaimdi ; [ =*tirupati Hill ] ;
11] tinna rEwunu talawaali ;
- [= graameeNulu/la dRshTilO  - 
pallejanam - ceruwu amTE =
aakali teercE buwwa kumDa ] ;
12] lamkalO hari Sabdam ; 
&
ముందు పోస్టు ; - ద్వాదశి - 31 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] విదూషకుణ్ణి కోతి ఉరిమినట్లు, హాస్యగాణ్ణి తేలు కుట్టినట్లు ;
2] చెరువులోని నీళ్ళు వాలు గుమ్మిన పోయె ; 

ద్వాదశి - 31 - పన్నెండు తెలుగు సామెతలు

1] విదూషకుణ్ణి కోతి ఉరిమినట్లు, 
           హాస్యగాణ్ణి తేలు కుట్టినట్లు ;
2] చెరువులోని నీళ్ళు వాలు గుమ్మిన పోయె ; 
          నోటిలో మాటలు గాలికి పాయె ;
3] రొట్టె తగవు కోతి తీర్చిందట  ;
4] దుడ్డే దొడ్డప్ప ;
 కన్నడ పదం - దుడ్డు = * డబ్బు ];
5] పెద్దల మాట పెరుగన్నం మూట ;  
6] పెన్నలో మాన్యాన్ని కాశీలో దానం చేసినట్లు  ;
7]  ఇరుసున కందెన వేయక, 
          పరమేశుని బండియైన సాగదు సుమతీ ;
8] బలిమి లేని వేళల పంతములు వలదోయీ ;
9] తొడపాశం పెట్టి, నైవేద్యం పెట్టాడట ;
10] పుర్రెకొక బుద్ది, జిహ్వకొక రుచి ;
11] లోకాయికి మాట నష్టం, లోభికి మూట నష్టం ; 
12] ధరించేదే శాటి*, వరించేదే బోటి** ;
[ =  *శాలువా/ అంగీ ; & ** వధువు/ స్త్రీ ] ;
========================= ,
1] widuushakuNNi kOti uriminaTlu, 
          haasyagANNi tElu kuTTinaTlu ;  
2] ceruwulOni nILLu waalu gummina pOye ; 
          nOTilO mATalu gaaliki pAye ;
3] roTTe tagawu kOti teercimdaTa ;
4] duDDE doDDappa ;
     [ Kannada word - duDDu = * Dabbu ] ;
5] peddala mATa perugannam mUTa ;
6] pennalO maanyaanni kASIlO dAnam cEsinaTlu ; 
7] irusuna kamdena wEyaka, 
paramESuni bamDi yaina sAgadu sumatee ;
8] balimi lEni wELala pamtamulu waladOyee ;
9] toDapASam peTTi, naiwEdyam peTTADaTa ;
10] purrekoka buddi, jihwakoka ruci ;
11] lOkaayiki mATa nashTam, 
          lOBiki muuTa nashTam ;
12] dharimcEdE SATi*,  warimcEdE bOTi** - 
[ =* SAluwaa/ amgee ; & ** wadhuwu/ stree ] ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 30 - పన్నెండు తెలుగు సామెతలు ;-
1] విడిపోయి విడివడితే - గుర్రం కాస్తా గాడిదతో సమానం ; 
2]  రాముని వంటి రాజు ఉంటే, హనుమాండ్లు లాంటి బంటు అప్పుడే ఉంటాడు  ;

ద్వాదశి - 30 - పన్నెండు తెలుగు సామెతలు

1] విడిపోయి విడివడితే - గుర్రం కాస్తా గాడిదతో సమానం ;
2]  రాముని వంటి రాజు ఉంటే, 
         హనుమాండ్లు లాంటి బంటు అప్పుడే ఉంటాడు  ;
3] తిమ్మన్నా నీకు నమస్కారం - అంటే నా పేరెట్లాగ తెలిసె - 
      నీ ముఖం చూడగానే ఎరుకాయె  ;
4] తిన్న ఇంటిని మోసం చేస్తి వేమిరా, అంటే ; 
           తినని ఇంట్లోకి రానిస్తారా, ఏంటి అన్నాడట ; 
5]  ఇల్లు ఇచ్చినవాడికి, పోసిన వాడికీ మంచి లేదు ; 
6] ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకున్నమ్మ పులి -
7] పరిగెత్తే వాణ్ణి చూస్తే, తరిమే వాడికి లోకువ  ; 
8]  లగ్నంలో తుమ్మినట్లు ;
9] తమలం వేయని నోరు, కమలం లేని కోనేరు ;
10] చదువ నేర్తువా, వ్రాయనేర్తువా, అంటే -
        చదువ నేర్వను, వ్రాయనేరను చించ నేర్తును అన్నాడట ;
11] ఈకలు లేవు గానీ, వింజమూరి పుంజు కదండీ ; 
12] గుమ్మడికాయంత తెలివికి, గురిగింజంత అదృష్టం గొడుగు ; 
;
=====================, ;
;
1] wiDiwaDitE - gurram kaastaa gADidatO samAnam ; 
2] raamuni wamTi raaju umTE, hanumAmDlu laamTi bamTu appuDE umTADu ; 
3] timmannA neeku namaskAram - amTE nA pEreTlaaga telise - 
         nI mukham cUDagAnE erukAye ; 
4] tinna imTini mOsam cEstiwEmirA amTE ; 
tinani imTlOki raanistaaraa EmTi? annADaTa ;
5] illu iccinawADiki, 
       majjiga pOsina waaDikI mamci lEdu ; 
6] iccinamma eega, puccukunnamma puli ;;
7] parigettE wANNi cUstE, 
           tarimE wADiki lOkuwa ;
8] lagnamlO tumminaTlu ;
9] tamalam wEyani nOru, kamalam lEni kOnEru ;
10] caduwa nErtuwaa, wraaya nErtuwaa amTE,
          caduwa nErwanu, 
           wraaya nEranu cimca nErtunu annaaDaTa ; 
11] eekalu lEwu gaanee, wimjamuuri pumju kadamDI  ; 
12] gummaDikAyamta teliwiki, gurigimjamta  ;
;
ముందు పోస్టు ;- ద్వాదశి - 29 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] గాడిద తంతే ఎవరికీ చెప్పకు  = When an ass kicks you, never tell  :)
2] స్వాతి కొంగల` మీదికి .... సాళువం వెళ్ళినట్లు ;

ద్వాదశి - 29 - పన్నెండు తెలుగు సామెతలు

1] గాడిద తంతే ఎవరికీ చెప్పకు  ;
= When an ass kicks you, never tell  :)
2] స్వాతి కొంగల` మీదికి .... సాళువం వెళ్ళినట్లు ;
3] ఇంటి నిండా కోళ్ళు ఉన్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది ;
4] పెద్ద మగాణ్ణని వరి నాట్లు వెయ్యడానికి వెళ్ళి ,
ఎలుక అలికిడికే వెల్లకిలా పడ్డాడు ;
5] కథకు కాళ్ళు లేవు ,ముంతకు చెవులు లేవు 
6] ఆత్రగాడికి బుద్ధి మట్టు ;
7] కత్తిని తీసి కంపలో వేసి ఏకును తీసి ఝళిపించాడట  ;
8] మోసపోయే వాడు ఉన్నంత కాలం, 
       మోసపోయే వాడు ఉంటాడు ;
9] ఉచితానికి ఊళ్ళు, ఖచ్చితానికి కాసులు ; 
10]  బంగారము వంటి కోమటి ; 
         సంగీతము చేత బేరసారము లుడిగెన్ ;  
11] అర కాసు పనికి - ముప్పాతిక బాడుగ  ; 
12] కనుమునాడు మినుము తినాలి  ; 
=============,
1] gADida tamtE ewarikI ceppaku ; 
2] swaati komgala meediki sALuwam weLLinaTlu ;
3] imTi nimDA kOLLu unnA, pakkimTi kODE kUyAlsi waccimdi ; 
4] pedda magaaNNani ; wari nATlu weyyaDaaniki weLLi ; 
eluka alikiDikE wellakilA paDDADu ;
5] kathaku kALLu lEwu mumtaku cewulu lEwu ; 
6] aatragADiki buddhi maTTu ; 
7] kattini tIsi kampalO wEsi ; Ekunu tIsi jhaLipimcADaTa  ;
8] mOsapOyE wADu unnamta kAlam, 
mOsapOyE wADu umTADu ;
9] ucitaaniki ULLu, khaccitaaniki kaasulu ; 
10] bamgAramu wamTi kOmaTi ; 
samgeetamu cEta bEra sAramu luDigen ;
11] ara kaasu paniki - muppaatika bADuga ;
12] kanumu nADu minumu tinaali ;
;
ముందు పోస్టు ;- ద్వాదశి - 28 - పన్నెండు తెలుగు సామెతలు ; 
1] జొన్న పెరిగితే జాడు, వరి పెరిగితే వడ్లు ; [జాడు = చీపురు] - కర్షక సామెత ; 
2] ఆకాశంలో గొర్రె తొక్కుడు, అతి సమీపంలో వానధారలు ; రైతు సామెత ;

5, జూన్ 2020, శుక్రవారం

ద్వాదశి - 28 - పన్నెండు తెలుగు సామెతలు

1] జొన్న పెరిగితే జాడు, వరి పెరిగితే వడ్లు ; [జాడు = చీపురు] - కర్షక సామెత ; 
2] ఆకాశంలో గొర్రె తొక్కుడు, అతి సమీపంలో వానధారలు ; రైతు సామెత
3] నిజం నిద్ర లేచి నడక మొదలెట్టేటప్పటికి - 
        అబద్ధం అంతరిక్షం దాకా చుట్టబెడుతుంది 
4] అగ్రహారాలు పోతేపోయాయి గానీ, 
       ఆక్ట్* బాగా తెలిసింది ; [*చట్టం ] ; 
5] గిద్దెడు నూనెకైనా, గానుగ కట్టాల్సిందే కదా ;
6] జముకులోడు వచ్చాక జాతర ఆగుతుందా!? 
7] పళ్ళు లేని పులి నోట్లో ఇరుక్కున్నట్లు ; 
8] అర కాసు పనికి - ముప్పాతిక బాడుగ  ; 
9] శేరు దొరగారికి, మణుగు బంటు ;
10] గుడ్డు వచ్చి, పెట్టను గోరడాలాడిందట ;
11] తిమ్మిని బ్రహ్మి, బ్రమ్మిని తిమ్మిగా చేసే రకం వీడు ;
12] నా కూతురికి మొగుడు ఈ అల్లుడు, 
          నాకు మొగుడు ఈ తోడిపెళ్ళికొడుకు,  
            ఆరు నెలల నుండీ ఇక్కడే తిష్ఠ వేసాడు, అన్నాట్ట ;
====================, ;
1] jonna perigitE jADu, wari perigitE waDlu ;
[jADu = ceepuru ;; karshaka sAmeta ] ; 
2] aakaaSamlO gorre tokkuDu ; ati sameepamlO waanadhaaralu ;
 - raitu saameta ; [= cumulonimbus clouds ] ;
3] nijam nidra lEci naDaka modaleTTETappaTiki ;   abaddham amtariksham dAkA cuTTabeDutumdi ;
4]  agrahArAlu pOtEpOyAyi gAnI, 
       *ACT bAgA telisindi ; 
[= *caTTam ] ; [haasya saameta] ;
5] giddeDu nUnekainaa, 
      gAnuga kaTTAlsimdE kadA ; 
6] jamukulODu waccaaka jAtara aagutumdaa!? 
7] paLLu lEni puli nOTlO irukkunnaTlu ;
 - cinema proverb [brahmanamdam :) ] ; 
8] ara kaasu paniki - muppaatika bADuga ; 
9] SEru doragAriki, maNugu bamTu ; 
10] guDDu wacci, peTTanu gOraDAlaaDimdaTa ;  
11] timmini brahmi, 
    brammini timmigaa cEsE rakam wIDu ; 
12] alluNNi cUpistuu "nA kUturiki moguDu, 
ee tODi peLLi koDuku nAku moguDu, 
Aru nelala numDI ikkaDE tishTha wEsADu" annATTa ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 27 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ఇగురం* ఉంటే ఇరవైమందినైనా సాకవచ్చు ; [ =* వివరం ] ; 
2] అబ్బి అంత పొడుగు, దాక్షారామం భీమన్నలాగా ;  [*Notes] ;

26, మే 2020, మంగళవారం

ద్వాదశి - 27 - పన్నెండు తెలుగు సామెతలు ;

1] ఇగురం* ఉంటే ఇరవైమందినైనా సాకవచ్చు ;
          [ =* వివరం ] ; 
2] అబ్బి అంత పొడుగు, దాక్షారామం భీమన్నలాగా ;  [*Notes] ;
3] తెలియనంత వరకూ బ్రహ్మ విద్య, 
        తెలిసిన తర్వాత కూసు విద్య ;
4] చిన్న నీటి చుక్క కదిలి చేయును కదా - 
                  పెను నీలి సంద్రాన్ని ;
5] దాయ* కట్టని ఆవు తన్నక మానదు ; 
         [దాయ* = బంధం, word - దాయాది ]  ;
6] దాసరివా? జంగానివా? అంటే, 
        ముందున్న ఊరును బట్టి అన్నాడట ;
7] పోరాటం లేని ఆరాటం పనికి రాదు ;
8] లేడిని చూసిన వాళ్ళంతా వేటగాళ్ళే ;
9] కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ;
10] తినే ముందు రుచి అడగకు ; 
          వినే ముందు కథ అడగకు  ;
& ref ;- Notes ;- 2] దాక్షారామం భీమేశ్వర కోవెల ఎత్తు - రెండు అంతస్థులు - 
దాక్షారామం గుడిలోని భీమేశ్వర లింగం - చాలా పొడుగు/ ఎత్తు ఐనది ; 
===========================,
1] iguram* umTE irawai mamdinainaa saakawaccu ;
    [ = *wiwaram] ;
2] abbi amta poDugu, 
          dAkshArAmam BImannalAgA ;  [*Notes]
3] teliyanamta warakuu brahma widya, 
        telisina tarwaata kuusu widya ;
4] cinna nITi cukka kadili cEyunu kadaa - 
                     penu neeli samdraanni ; 
5] daaya kaTTani aawu tannaka mAnadu ; 
         [dAya = bamdham, & so word -> daayAdi ] ;
6] daasariwaa jamgaaniwaa amTE, 
          mumdunna uurunu baTTi annADaTa ; 
7] pOrATam lEni aarATam paniki raadu ;
8] lEDini cuusina wALLamtaa wETagALLE ;
9] komDanu tawwi elukanu paTTinaTlu ; 
10] tinE mumdu ruci aDagaku ; winE mumdu katha aDagaku ; 
;
& ref ;- Notes ;- daakshaaraamam BImESwara kOwela ettu - 
remDu amtasthulu - daakshaaraamam guDilOni BImESwara limgam - 
caalaa poDugu/ ettu ainadi ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 26 - పన్నెండు తెలుగు సామెతలు ; 
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డలు ;
కుంచం వడ్లు ఉంటే కుడికొప్పు ; అడ్డెడు ఉంటే ఎడమ కొప్పు ;

ద్వాదశి - 26 - పన్నెండు తెలుగు సామెతలు

1]  కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డలు ;  
 2] కలిసి వచ్చే కాలానికి నట్టింటికే కుందేలు వస్తుంది ;
3] పగలంతా బారెడు నేసాను, దీపం తేరా - 
         దిగనేస్తాను అన్నాడట ;
4] కళ్ళం దగ్గర కరణీకం, 
          కంచం దగ్గిర రెడ్డిరికం ;
5] కరువుకు దాసరులు ఐతే ; 
         పదాలు ఎక్కణ్ణుండి వస్తాయి!?
6] కుంచం వడ్లు ఉంటే కుడికొప్పు ; 
               అడ్డెడు ఉంటే ఎడమ కొప్పు ; 
7] వరుగులతో పాటు దాగర కుండ కూడా ఎండాల్సిందే కదా  ;
 8] సన్యాసికి బెత్తెడు గోచీ ; సంసారికి దుస్తుల పేచీ  ;
9] దున్నపోతు ఈనిందంటే, చెంబు తేరా - 
పాలు పితుకుదాం అన్నాడట  ;
10] దున్నే వాడు లెక్క చూస్తే - నాగలి కూడా మిగలదు  ;
11] తాడు సరిపోకపోతే, నుయ్యిని పూడ్చినట్లు ; 
12] తనువులు నిత్యం కాదు గానీ, 
*ఓలి పైకం మూట కట్టు - అన్నాడట ; [ = *కన్యాశుల్కం] ;
==================, ;
1] kalisi waccE kaalaaniki naDci waccE biDDalu ;
2] kalisi waccE kaalaaniki naTTimTikE kumdElu wastumdi 
3] pagalamtaa baareDu nEsAnu, deepam 
          tEraa - diganEstaanu annaaDaTa ; 
4] kaLLam daggara karaNIkam, 
           kamcam daggira reDDirikam ;
5] karuwuku daasarulu aitE ;  
          padaalu ekkaNNumDi wastaayi!? 
6] kumcam waDlu umTE kuDikoppu ; 
          aDDeDu uMTE eDama koppu ;  
7] warugalatO pATu daagara kumDa emDAlsimE ; 
8] sanyaasiki betteDu gOcI, samsaariki dustula pEcI ; 
9] dunnapOtu InimdamTE, cembu tErA, 
         pAlu pitukudaam annADaTa ;
10] dunnE wADu lekka cuustE naagali kUDA migaladu ;
11] tADu saripOkapOtE, nuyyini pUDcinaTlu ; 
12] tanuwulu nityam kaadu gaanee, 
*Oli paikam mUTa kaTTu - annADaTa; 
[ = *kanyASulkam] ; 
;
& ముందు పోస్టు ;- ద్వాదశి - 25 - పన్నెండు తెలుగు సామెతలు ; 
ఆవగింజంత అబద్ధం ముందర - ఐరావతం అంత నిజం కూడా నిలబడదు ; 
ఆచారం - ఆచారం అన్నంభొట్లా అంటే, పెద్ద చెరువులో కుక్క ఈదింది అన్నాడట ;

ద్వాదశి - 25 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఘంటాకర్ణునికి అష్టాక్షరీ మంత్రం 
ఉపదేశం చేయబోయినట్లు ;  
2] యాదవ భారతం ఎద్దు మోత బరువు ;
3] తత్సమయానికి తడి ఇసకే సరి - 
అని పళ్ళు తోమినట్లు ;
4] తడిసి ముప్పందుం ఐంది ; 
[= * పందుం - ముప్పందుం - ధాన్యం కొలతలు ] ;
5] బలిమిని లింగం కడితే భక్తుడు ఔతాడా!? 
6] తణుకు పోయి మాచారం వెళ్ళినట్లు [= చుట్టు దారి ] ;
7] ఆచారం ఆచారం అన్నంభొట్లా అంటే, 
పెద్ద చెరువులో కుక్క ఈదింది అన్నాడట ;
8] నేతి కుండను నేల మీద పెట్టి, 
ఉత్తి కుండను ఉట్టి మీద పెట్టినట్లు 
9] పోకల కుండను - చట్రాతి మీద పగల కొట్టినట్లు ;
10] గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిందంట   ;
11] ఆవగింజంత అబద్ధం ముందర - 
ఐరావతం అంత నిజం కూడా నిలబడదు ; 
12] ఎద్దు ఉన్నోనికి బుద్ధి ఉండదు ; 
బుద్ధి ఉన్నోనికి ఎద్దు ఉండదు ;
==============================, ;
1] GamTAkarNuniki ashTAksharee mamtram 
upadESam cEyabOyinaTlu ; 
2] yaadawa bhaaratam eddu mOta baruwu ; 
3] tatsamayaaniki taDi isakE sari - 
ani paLLu tOminaTlu ;  
4] taDisi muppamdum aimdi ; 
[* pamdum - muppamdum - dhaanyam kolatalu] ; 
5] balimini limgam kaDitE bhaktuDu autADA!!?
6] taNuku pOyi maacaaram weLLinaTlu;  [= cuTTudaari ] ;
7] aacaaram aacaaram annamBoTlA amTE, 
pedda ceruwulO kukka eedimdi annaaDaTa ; 
8] nEti kumDanu nEla meeda peTTi, 
utti kumDanu uTTi meeda peTTinaTlu ;
9] pOkala kumDanu caTrAti mIda pagala koTTinaTlu ; 
10] guDDu  wacci pillanu wekkirimcimdamTa ;  
11] aawagimjamta abaddham mumdara - 
airaawatam amta nijam kUDA nilabaDadu ;
12] eddu unnOniki buddhi umDadu ; 
buddhi unnOniki eddu umDadu ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 24 - పన్నెండు తెలుగు సామెతలు ; 
ఆడేది అడ్డ నామాలలు తీసుకుంటే - పాడేది పంగనామాలు తీసుకుందంట ; [కర్నూలు సామెతలు ] ; 
కొండ అద్దమందు కొంచెమై ఉండదా ; - ಸಾಮೆತಲು ;

ద్వాదశి - 24 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఆడేది అడ్డ నామాలు తీసుకుంటే -
పాడేది పంగనామాలు తీసుకుందంట ; 
[కర్నూలు సామెతలు-  Karnool -  कर्नूल Proverbs ] ;
2] కొండ అద్దమందు కొంచెమై ఉండదా ;  
3] ముందు వాళ్ళకు మూకుళ్ళు, 
వెనుక వాళ్ళకు ఆకుళ్ళు నాకుళ్ళు ;
3] కందెన వేయని బండికి కావలసినంత సంగీతం ;   
4] చలివేంద్రం కుండలకు తూట్లు పొడిచినట్లు ;
5] చదువ నేరుస్తావా, వ్రాయ నేరుస్తావా అంటే చదవా నేరను, -
వ్రాయ నేరను - చింప నేరుస్తా నన్నాడట ; 
6] కూడలి కాపురం కుతకుతలు ; వేరడి కాపురం వెతవెతలు ;
7] రోషాల పాటగాడికి వేషాలు మెండు ;
8] పొద్దంతా పోగు నేసి -
దీపం పెట్టాక దిగనేసాడంట ;
9] పిడతలో నూనె పిడతలోనే ఉండాలి -  బిడ్డలు బీరగింజల్లా ఉండాలి ;
10] పిలిచి పిల్లను ఇస్తామంటే - కుడికన్నులో మెల్ల ఉందన్నాడట 
11] పిల్లి తోకను ఎద్దు తొక్కితే, ఎలుక కేసి ఎర్రగా చూసిందట
12] కొత్త భక్తురాలు ఉడుకు వీబూది పూసుకుని 
నొసలు కాలెనే పేరమ్మా అన్నదట ;
==============================, ;
1] ADEdi aDDa nAmaalu teesukumTE -
pADEdi pamganaamaalu teesukumdamTa ;
- [ Karnool -  कर्नूल  Proverbs ] ;
2] komDa addamamdu komcemai umDadaa ;
mumdu wALLaku muukuLLu, 
wenuka wALLaku AkuLLu nAkuLLu  ; 
3] kamdena wEyani bamDiki kaawalasinamta samgeetam ; 
4] caliwEmdram kumDalaku tUTlu poDicinaTlu ;
5] caduwa nErustaawaa, wraaya nErustaawaa amTE, 
cadawaa nEranu, wraaya nEranu - 
cimpa nErustaa nannaaDaTa ;
6] kUDali kaapuram kutakutalu ; 
wEraDi kaapuram wetawetalu ;
7] rOshaala pATagADiki wEshaalu memDu ;
8] poddamtaa pOgu nEsi -
deepam peTTAka diganEsADamTa ; 
9] piDatalO nuune piDatalOnE uMDAli - 
biDDalu beeragimjallA umDAli ; 
10] pilici pillanu istAmaMTE - 
kuDikannulO mella umdannADaTa ; 
11] pilli tOkanu eddu tokkitE, 
eluka kEsi erragaa cUsimdaTa ; 
12] kotta bhakturaalu uDuku weebuudi puusukuni - 
nosalu kaalenE pErammA annadaTa ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 23 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] తన కడుపున పుట్టిన బిడ్డ,
తన కొంగున కట్టిన రూక ఆదుకుంటాయి ; 

ద్వాదశి - 23 - పన్నెండు తెలుగు సామెతలు

1] తన కడుపున పుట్టిన బిడ్డ,
తన కొంగున కట్టిన రూక ఆదుకుంటాయి ; 
2] అయ్య కదురు వలె, అమ్మ కుదురు వలె ;
 [కవ్వం - mortar ; రోకలి  = pestle]  ;
3] కదురు, కవ్వం ఆడుతుంటే కరువే ఉండదు ; 
4] తుమ్మ దుడ్డు వలె, కాపు కదురు వలె ;
5] కంకణాల చెయ్యి ఆడితే -
కడియాల చెయ్యీ ఆడుతుంది ; 
 6] గురి కుదిరితే గుణం కుదురుతుంది ;
7] మెరుగుగా ఆరంభిస్తే, సగం పని పూర్తి అయినట్లే ;  
8] ఇంటికి ఇత్తడి, పురుగుకు పుత్తడి ;
9]  తుమ్మ ఉన్న చోట కమ్మ ఉంటారు  ;
10] ఎవరి వీపు వాళ్ళకు కనబడదు ;
11]  తుమ్మ ఉన్న చోట కమ్మ ఉంటారు  ;
12] తెగితే *లింగడు రాయి సమానం ;
& + ;- 
[see Ref ] ;- 12] తెగితే లింగడు రాయి సమానం ; లింగధారులు -  శివలింగాన్ని - మెడలో కట్టుకుంటారు ; హారంగా ఉన్నంతసేపు ఆరాధ్యనీయ - కానీ, ఆ దారం పెరిగితే [=break ఐతే ], అదే లింగం - రాయికి ఇచ్చేంత విలువ - అని భావం ;
========================;
1] tana kaDupuna puTTina biDDa,
tana komguna kaTTina rUka  aadukumTAyi ;
2] ayya kaduru wale, 
amma kuduru wale ; 
3] kaduru kawwam ADumTE 
             karuwE umDadu ;
4] tumma duDDu wale, 
kaapu kaduru wale ;
5] kamkaNAla ceyyi ADE
         kaDiyaala ceyyee ADutumdi ;
6] guri kudiritE  - guNam kudurutumdi ;
7] merugugA ArambhistE, 
sagam pani pUrti ayinaTlE ; 
8] imTiki ittaDi, puruguku puttaDi ; 
9] tumma unna cOTa 
kamma umTAru  ; 
10] ewari weepu - waariki kanabaDadu ; 
11] tumma unna cOTa kamma umTAru  ; 
12] tegitE limgaDu raayi samaanam ;
& ;- REF ;- ] tegitE limgaDu raayi samaanam ; limgadhaarulu -  
Siwalimgaanni - meDalO kaTTukumTAru ; haaramgaa unnamtasEpu aaraadhyaneeya - kaanee, 
aa daaram perigitE [= aitE ] adE limgam - raayiki iccEmta wiluwa - ani bhaawam ; 
&
REF ;- [kaduru = kawwam - 
kuduru = mortar ; rOkali - pestle] ;
4] ewari weepu - wALLaku kanabaDadu ;
5] kamkaNAla ceyyi ADitE -
kaDiyaala ceyyee ADutumdi ;

ముందు పోస్టు ;-  ద్వాదశి - 22 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ఏమి అప్పాజీ అంటే,  కాలం కొద్దీ రాయాజీ అన్నాడంట ; 
[శ్రీకృష్ణదేవరాయలు - 16వ శతాబ్దం]  ;
2] లోకం ఎలా ఉందిరా సిద్ధా అంటే, 
ఎవరి లోకం వారిదే గురూ అనేసె *; 
*[పోతులూరి వీరబ్రహ్మం నాటి సామెత ] 

25, మే 2020, సోమవారం

ద్వాదశి - 22 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఏమి అప్పాజీ అంటే,  కాలం కొద్దీ రాయాజీ అన్నాడంట ; 
[శ్రీకృష్ణదేవరాయలు - 16వ శతాబ్దం]  ;
2] లోకం ఎలా ఉందిరా సిద్ధా అంటే, 
ఎవరి లోకం వారిదే గురూ అనేసె *; 
*[పోతులూరి వీరబ్రహ్మం నాటి సామెత ]
3] కుబేరుడు, ధనపతి - అలకాపురికి రాజైతే మాత్రం, 
అమితంగా ఖర్చు చేస్తాడా!? 
4] న్యాయం చెప్పు నాగిరెడ్డీ అంటే - 
నాక్కూడా ఇద్దరు పెళ్ళాలే అన్నాడట ;
5] గడప లోపల ఉన్న సుఖం, 
కాశీకి పోయినా దొరకదు ;
6] ఇల్లే వైకుంఠం, 
కడుపే కైలాసం జాలారే కోనేరు ; 
7] పొరుగింటి కలహం విన వేడుక, 
పొరుగింటి జగడం చూడ వేడుక ;   
8] అలిగే బిడ్డతో, చెలిగే గొడ్డుతో వేగడం కష్టం ; 
9] డబ్బుకు లేనివాడు దుబ్బు*కు కొరగాడు  ;
= [usage*దుబ్బు తల = చింపిరి జుట్టు ]  ;
10] పైసకు పైసకు ముడి వేస్తే ; 
అవ్వే పిల్లల్ని చేస్తయి - 
11] ధనం దాసినోనికే తెలుస్తది ; 
లెక్క రాసినోనికే తెలుస్తది ; 
12] సోలానకు సోలాన నమ్మదగినవాడే ;
===============================, 
1] Emi appAjI amTE,  
kaalam koddee raayaajee annADanTa ;- 
SreekRshNadEwaraayalu - 16wa Sataabdam] ; 
2] lOkam elaa umdiraa siddhA aMTE, 
ewari lOkam waaridE gurU anEse ; 
[pOtuluuri weerabrahmam nATi saameta] ;
3] alakaapuriki raajaitE mAtram, 
amitamgaa kharcu cEstADA!? ;
4] nyaayam ceppu naagireDDI aMTE - 
naakkUDA iddaru peLLAlE annADaTa ;
5] gaDapa lOpala unna sukham, 
kASiiki pOyinA dorakadu ;
6] illE waikumTham,
 kaDupE kailAsam jAlArE kOnEru ; 
7] porugimTi kalaham wina wEDuka, 
porugimTi jagaDam cUDa wEDuka ; 
8] aligE biDDatO, 
celagE goDDutO wEgaDam kashTam ;
9] Dabbuku lEniwADu ; 
dubbu*ku koragADu - 
[*dubbu tala = cimpiri juTTu ] ; 
10] paisaku paisaku muDi wEstE ; 
          awwE pillalni cEstayi ;
11] dhanam daasinOnikE telustadi ; 
lekka raasinOnikE telustadi ;
12] sOlaanaku sOlaana -
        nammadaginawADE ;
& ;-
ముందు పోస్టు ;- ద్వాదశి - 21 - పన్నెండు తెలుగు సామెతలు ;
ఎక్కడా ఒళ్ళు వంగని వాడికి ; రంగమెళ్తే  ఒళ్ళొంగుతుంది ; &
ఛీ ఛీ అనేదీ, ఈ నోరే ; - శివ శివా  అనేదీ, ఈ  నోరే ;
;

ద్వాదశి - 21 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఎక్కడా ఒళ్ళు వంగని వాడికి ;   
*రంగమెళ్తే  ఒళ్ళొంగుతుంది ;
REF;- రంగూన్ - Burma/ Myanmar } ;
 2] ఛీ ఛీ అనేదీ, ఈ నోరే ; 
శివ శివా  అనేదీ, ఈ  నోరే ;   
3] ఆట మొదలయ్యే సరికి, మద్దెల తూటు పడిందట ;
4] గలగలలాడే గాజుల చెయ్యి, కళకళలాడే లోగిలి, ముంగిలి ;
5] గాజుల చెయ్యి గలగలలాడితే ; ఇల్లు కళకళలాడుతుంది ; 
6] లచ్చి గాజులకు ; సంతకు చీటీ రాసాడంట ;
7]  వరుసలెల్ల ఆవల పెట్టి, వదిన పిన్నమ్మా, ఈ గంపను ఎత్తు ;
8] చోద్యం సొరకాయ గుడ్డు పెట్టిందంట ; 
9] శభాష్ మద్దెలవాడా అంటే, 
- ఐదు వేళ్ళు విరగగొట్టుకున్నాడట ;
10] సీతా రామాభ్యాం నమః అంటే ; 
మా ఇంటాయన ఎదురు అయ్యాడా? అన్నదట ; [బిచ్చగానితో] ;
11] గుడ్డు వచ్చి, పెట్టను గోరడాలాడిందట ; 
12] చోద్యాల సోమిదేవమ్మకు *వాద్యారి మొగుడు ; & + ;- ;
REF ;- *వాద్యార్ = ఇతరుల కర్మ ఫలితాలను - 
తన తపోబలంతో జ్ఞాన శక్తితో తీర్చగల వ్యక్తి ;
========================,
 1] ekkaDA oLLu  wamgani wADiki ; ramgameLtE oLLomgutumdi ;  
 2]  CI CI anEdI, I nOrE ; Siwa Siwaa  anEdI, I   nOrE ; 
 3] atATodalayyE sariki,  maddela tUTu paDimda Ta ; 
4] galagalalADE gaajula ceyyi,
kaLalADE lOgili, mumgili ; 
5] gaajula ceyyi galagalalADitE ; illu kaLakaLalADutumdi ;
6]  lacci gaajulaku ; samtaku cITI rAsi iccaaDamTa ; 
7] warusalella aawala peTTi, wadina pinnammaa, ee gampanu ettu ;
8] cOdyam sorakaaya guDDu peTTimdamTa  ; 
 9]-SaBAsh maddela wADA amTE ; 
aidu wELLu wiragagoTTukunnADaTa ;
10] sItArA maabhyAM nama@h amTE ; 
maa imTAyana eduru ayyADA? anndaTa ; 
[biccagAnitO] ; 
11] guDDu wacci, peTTanu gOraDAlaaDimdaTa ;
12] cOdyaala sOmidEwammaku -
waadyaari moguDu ;
REF ;- *wAdyAr = itarula karma phalitaalanu - 
tana tapO balamtO jnAna SaktitO 
tIrcagala wyakti ;
;
ముందు పోస్టు ;- ద్వాదశి - 20 - పన్నెండు తెలుగు సామెతలు  
ఇంటికొక పువ్వు, ఈశ్వరుని కొక దండ ;  &
గడ ఎక్కు తిమ్మన్నా, గంతులు వేయి తిమ్మన్నా ;