25, మే 2020, సోమవారం

ద్వాదశి - 22 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఏమి అప్పాజీ అంటే,  కాలం కొద్దీ రాయాజీ అన్నాడంట ; 
[శ్రీకృష్ణదేవరాయలు - 16వ శతాబ్దం]  ;
2] లోకం ఎలా ఉందిరా సిద్ధా అంటే, 
ఎవరి లోకం వారిదే గురూ అనేసె *; 
*[పోతులూరి వీరబ్రహ్మం నాటి సామెత ]
3] కుబేరుడు, ధనపతి - అలకాపురికి రాజైతే మాత్రం, 
అమితంగా ఖర్చు చేస్తాడా!? 
4] న్యాయం చెప్పు నాగిరెడ్డీ అంటే - 
నాక్కూడా ఇద్దరు పెళ్ళాలే అన్నాడట ;
5] గడప లోపల ఉన్న సుఖం, 
కాశీకి పోయినా దొరకదు ;
6] ఇల్లే వైకుంఠం, 
కడుపే కైలాసం జాలారే కోనేరు ; 
7] పొరుగింటి కలహం విన వేడుక, 
పొరుగింటి జగడం చూడ వేడుక ;   
8] అలిగే బిడ్డతో, చెలిగే గొడ్డుతో వేగడం కష్టం ; 
9] డబ్బుకు లేనివాడు దుబ్బు*కు కొరగాడు  ;
= [usage*దుబ్బు తల = చింపిరి జుట్టు ]  ;
10] పైసకు పైసకు ముడి వేస్తే ; 
అవ్వే పిల్లల్ని చేస్తయి - 
11] ధనం దాసినోనికే తెలుస్తది ; 
లెక్క రాసినోనికే తెలుస్తది ; 
12] సోలానకు సోలాన నమ్మదగినవాడే ;
===============================, 
1] Emi appAjI amTE,  
kaalam koddee raayaajee annADanTa ;- 
SreekRshNadEwaraayalu - 16wa Sataabdam] ; 
2] lOkam elaa umdiraa siddhA aMTE, 
ewari lOkam waaridE gurU anEse ; 
[pOtuluuri weerabrahmam nATi saameta] ;
3] alakaapuriki raajaitE mAtram, 
amitamgaa kharcu cEstADA!? ;
4] nyaayam ceppu naagireDDI aMTE - 
naakkUDA iddaru peLLAlE annADaTa ;
5] gaDapa lOpala unna sukham, 
kASiiki pOyinA dorakadu ;
6] illE waikumTham,
 kaDupE kailAsam jAlArE kOnEru ; 
7] porugimTi kalaham wina wEDuka, 
porugimTi jagaDam cUDa wEDuka ; 
8] aligE biDDatO, 
celagE goDDutO wEgaDam kashTam ;
9] Dabbuku lEniwADu ; 
dubbu*ku koragADu - 
[*dubbu tala = cimpiri juTTu ] ; 
10] paisaku paisaku muDi wEstE ; 
          awwE pillalni cEstayi ;
11] dhanam daasinOnikE telustadi ; 
lekka raasinOnikE telustadi ;
12] sOlaanaku sOlaana -
        nammadaginawADE ;
& ;-
ముందు పోస్టు ;- ద్వాదశి - 21 - పన్నెండు తెలుగు సామెతలు ;
ఎక్కడా ఒళ్ళు వంగని వాడికి ; రంగమెళ్తే  ఒళ్ళొంగుతుంది ; &
ఛీ ఛీ అనేదీ, ఈ నోరే ; - శివ శివా  అనేదీ, ఈ  నోరే ;
;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి