26, మే 2020, మంగళవారం

ద్వాదశి - 26 - పన్నెండు తెలుగు సామెతలు

1]  కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డలు ;  
 2] కలిసి వచ్చే కాలానికి నట్టింటికే కుందేలు వస్తుంది ;
3] పగలంతా బారెడు నేసాను, దీపం తేరా - 
         దిగనేస్తాను అన్నాడట ;
4] కళ్ళం దగ్గర కరణీకం, 
          కంచం దగ్గిర రెడ్డిరికం ;
5] కరువుకు దాసరులు ఐతే ; 
         పదాలు ఎక్కణ్ణుండి వస్తాయి!?
6] కుంచం వడ్లు ఉంటే కుడికొప్పు ; 
               అడ్డెడు ఉంటే ఎడమ కొప్పు ; 
7] వరుగులతో పాటు దాగర కుండ కూడా ఎండాల్సిందే కదా  ;
 8] సన్యాసికి బెత్తెడు గోచీ ; సంసారికి దుస్తుల పేచీ  ;
9] దున్నపోతు ఈనిందంటే, చెంబు తేరా - 
పాలు పితుకుదాం అన్నాడట  ;
10] దున్నే వాడు లెక్క చూస్తే - నాగలి కూడా మిగలదు  ;
11] తాడు సరిపోకపోతే, నుయ్యిని పూడ్చినట్లు ; 
12] తనువులు నిత్యం కాదు గానీ, 
*ఓలి పైకం మూట కట్టు - అన్నాడట ; [ = *కన్యాశుల్కం] ;
==================, ;
1] kalisi waccE kaalaaniki naDci waccE biDDalu ;
2] kalisi waccE kaalaaniki naTTimTikE kumdElu wastumdi 
3] pagalamtaa baareDu nEsAnu, deepam 
          tEraa - diganEstaanu annaaDaTa ; 
4] kaLLam daggara karaNIkam, 
           kamcam daggira reDDirikam ;
5] karuwuku daasarulu aitE ;  
          padaalu ekkaNNumDi wastaayi!? 
6] kumcam waDlu umTE kuDikoppu ; 
          aDDeDu uMTE eDama koppu ;  
7] warugalatO pATu daagara kumDa emDAlsimE ; 
8] sanyaasiki betteDu gOcI, samsaariki dustula pEcI ; 
9] dunnapOtu InimdamTE, cembu tErA, 
         pAlu pitukudaam annADaTa ;
10] dunnE wADu lekka cuustE naagali kUDA migaladu ;
11] tADu saripOkapOtE, nuyyini pUDcinaTlu ; 
12] tanuwulu nityam kaadu gaanee, 
*Oli paikam mUTa kaTTu - annADaTa; 
[ = *kanyASulkam] ; 
;
& ముందు పోస్టు ;- ద్వాదశి - 25 - పన్నెండు తెలుగు సామెతలు ; 
ఆవగింజంత అబద్ధం ముందర - ఐరావతం అంత నిజం కూడా నిలబడదు ; 
ఆచారం - ఆచారం అన్నంభొట్లా అంటే, పెద్ద చెరువులో కుక్క ఈదింది అన్నాడట ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి