25, మే 2020, సోమవారం

ద్వాదశి - 14 - పన్నెండు తెలుగు సామెతలు

1] హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేస్తాడు ;
2]  సత్యం చెప్పుల్లో కాళ్ళు పెడుతుంటే, అసత్యం ప్రపంచం చుట్టి వస్తుంది
3] సుఖం మరిగిన దాసరి, పదం మరిచాడట ;
4] కల్లుకుండ వద్ద కయ్యం ; జుట్టు లాక్కుపోయే దయ్యం ;
5] కట్టె వంకర పొయ్యి తీర్చింది ; 
6] పాతిక కోతి, ముప్పాతిక బెల్లం తిన్నదట ;;
7] ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం, తక్కువ తెలివి తన్నుల కారణం ;
8] నూరు కీడులు ఓరిస్తేనే, ఒక్క మంచి దక్కుతుంది ;
9] ఇంటి వంట ఐతే పచ్చడి మెతుకులు ఐనా మెరుగే ;
10] పెద్దలు లేని ఇల్లు, సిద్ధులు లేని మఠము ;
11] పిల్లితోకని ఎద్దు తొక్కితే ; ఎలుక మీసాలు దువ్విందంట  ;
12] వంక పెట్టనిదే వెన్నపూస కూడా కొనరు ;
==================,
1] hanumamtuDi eduTa kuppigamtulu wEstADu ;
2] satyam ceppullO kALLu peDutumTE, 
asatyam prapamcam cuTTi wastumdi ;
3] sukham marigina daasari, padam maricADaTa ; 
4] kallukumDa wadda kayyam ; juTTu laakkupOyE dayyam ;
5]  kaTTe wamkara poyyi teercimdi ; 
6] pAtika kOti, muppaatika bellam tinnadaTa ;
7] ekkuwa teliwi EDpula kaaraNam, 
takkuwa teliwi tannula kaaraNam ;
8] nuuru keeDulu OristEnE, okka mamci dakkutumdi ; 
9] imTi wamTa aitE paccaDi metukulu ainA merugE ;
10] peddalu lEni illu, siddhulu lEni maThamu ;
11] pillitOkani eddu tokkitE ; 
eluka meesaalu duwwimdamTa ;  
12] wamka peTTanidE wennapuusa kUDA konaru ;
;
ముందు పోస్టు ;-  ద్వాదశి - 13 [12 సామెతలు Telugu proverbs] 
1]  మక్కువ పడి ముక్కాలి పీట చేయించుకుంటే 
డోరియా కోక కాస్తా కత్తిరించుకు పోయిందంట ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి