25, మే 2020, సోమవారం

ద్వాదశి - 20 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఇంటికొక పువ్వు, ఈశ్వరుని కొక దండ ; 
2] గడ ఎక్కు తిమ్మన్నా, 
          గంతులు వేయి తిమ్మన్నా ;
3] లంకలో హరి శబ్దం ;
 4] లగ్నంలో తుమ్మినట్లు ; 
5] ఆలి పంచాయతీ రామాయణం, 
               పాలి పంచాయితీ భారతం ;
6] నిజం నిద్ర లేచి నడక మొదలెట్టేటప్పటికి - 
           అబద్ధం అంతరిక్షం దాకా చుట్టబెడుతుంది  ;
7] కొన్నది వంకాయ, కొసరుతున్నది గుమ్మడి కాయ ;
8] కొర్రగింజంత కోడలిని చూడగానే -
   కొండంత అత్తకు చలిజ్వరం వచ్చిందంట 
9] కోతి చేతికి కొబ్బరికాయ దొరికినట్లు  ;
10] శేరు దొరగారికి, మణుగు బంటు ; 
11]  పిఠాపురం వెళ్ళి పిడికెడు నీళ్ళు తెచ్చినట్లు ;
12] గప్పాలపోతురెడ్డికి మూడు ఎడ్లు, ముప్ఫైమూడు *దొడ్లు [*గోశాల] ;
============.
1] imTikoka puwwu, ISwaruni koka damDa ; 
2] gaDa ekku timmannA, 
         gamtulu wEyi timmannA ; 
3] lamkalO hari Sabdam ;
4] lagnamlO tumminaTlu ;
5] aali pamcaayatee raamaayaNam,
     paali pamcaayitee bhaaratam ; 
6] nijam nidra lEci naDaka modaleTTETappaTiki -
           abaddham amtariksham daakaa cuTTabeDutumdi ;
7] konnadi wamkaaya kosarutunnadi gummaDi kAya ;
8] korragimjamta kODalini cUDagAnE -
       komDamta attaku calijwaram waccimdamTa ; ;
9] kOti cEtiki kobbarikaaya dorikinaTlu ; 
10] SEru doragAriki, maNugu bamTu ;
11] piThApuram weLLi piDikeDu nILLu teccinaTlu ; 
12] gappAla pOtureDDiki muuDu eDlu, 
mupphai mUDu *doDlu [*gOSAla] ;
&
ముందు పోస్టు ;-  ద్వాదశి - 19 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ఆలు ఆత్మకూరులో , మొగుడు బోయిపల్లిలో, 
       కుండ చట్టి కుణుతూరులో, తలంబ్రాలు తాడిపత్రిలో ;     
2] పెన్న దాటితేనే కదా పెరుమాళ్ళ సేవ ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి