25, మే 2020, సోమవారం

ద్వాదశి - 19 - పన్నెండు తెలుగు సామెతలు ;

1] ఆలు ఆత్మకూరులో , మొగుడు బోయిపల్లిలో, 
       కుండ చట్టి కుణుతూరులో, తలంబ్రాలు తాడిపత్రిలో ;     
2] పెన్న దాటితేనే కదా పెరుమాళ్ళ సేవ ;
3] *లడాయిల - **శక్కర పంచినట్టు -
REF ;- [*పోట్లాట, **చక్కెర] ; 
4] గంత బొంత కలిపి, గాడిదమోత బరువైనట్లు ;
5] గుడి ముఖం ఎరగని దాసరి, 
గుడి వెనక్కి వెళ్ళి దండం పెట్టాడట ;
6] గిద్దెడు నూనెకైనా, 
         గానుగ కట్టాల్సిందే కదా ;
 7] పెద్దక్క ఓలి తెగితే* -
చిన్నక్క ఓలి తెగుతుంది.  [*నిర్ణయం ఐతే]  ;
8] ఆవో అంటే అర్ధం కాలేేదు మొర్రో / బాబో - అంటుంటే  -
           ఖడో అనేదాన్ని అంట గట్టాడట ;
9] దయ దండిది, గుణం మొండిది ;
10] కొత్తంత *పండగ లేదు, 
         అల్లుడంత చుట్టము లేడు ; 
[*ఉగాది పండుగ]  - తెలంగాణా prvb ;
11] పిడక పొగకి సిగమూగితే, గుగ్గిలం పొగకు ఎట్లాగౌతది!? 
12]  కూర మంచి, కుండ చేదు ;
==============;
1] aalu aatmakUrulO, moguDu bOyipallilO, 
kumDa caTTi kuNutUrulO, talambraalu tADipatrilO ; 
2] penna dATitEnE kadA perumALLa sEwa ;
3] laDAyila Sakkara pamcinaTTu ;
REF ;- [*  pOTlATa , **cakkera] ;
4] gamta bomta kalipi, gADida mOta baruwaina Tlu ; 
5] guDi muKam eragani daasari, 
       guDi wenakki weLLi damDam peTTADaTa ; 
6] giddeDu nuunekainaa, 
    gaanuga kaTTAlsimdE kadaa ;
7] peddakka Oli tegitE* cinnakka Oli 
tegutumdi. [*nirNayam aitE] ;
8] aawO amTE ardham kaaalEdu morrO/ 
baabO amTumTE ; 
KaDO anEdaanni amTa gaTTADaTa ;  
9] daya damDidi,  guNam momDidi ; 
10] = kottamta pamDaga* lEdu, 
alluDamta cuTTamu lEDu ; [*UGAADI ] ;
11] piDaka pogaki sigamuugitE, 
guggilam pogaku eTlaagautadi!? ; poTTa 
kUTiki jerripOtlanu ADistADu ; 
12]  kuura mamci, kumDa cEdu ;
;
ముందు పోస్టు ;-  ద్వాదశి - 18 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] నమ్మితి రామన్నా అంటే - నా అంతటి వాణ్ణి చేస్తానన్నట్లు  ;
2] గుడి చిన్నదైనా, గుళ్ళో దేవుని మహిమ మిన్న ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి