25, మే 2020, సోమవారం

ద్వాదశి - 18 - పన్నెండు తెలుగు సామెతలు ;

1] నమ్మితి రామన్నా అంటే -
నా అంతటి వాణ్ణి చేస్తానన్నట్లు  ;
2] గుడి చిన్నదైనా, గుళ్ళో దేవుని మహిమ మిన్న ; 
3] పదలం నూలుపాగా లేకుంటే -
                 పంతులుగారు అవరు ;
4] మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందంట  ;
5] ఇంటికో కడి తిని, 
      గుంటకో గుక్క నీళ్ళు తాగినట్టు
6] ఒక ఊరి పటేలు -
ఇంకో ఊరికి గాయిదోడు* [*సామాన్యుడు] ;
7] కొప్పు ఉన్నమ్మకి కోటి వయ్యారాలు ;
8] అంత నాడు లేదు, ఇంత నాడు లేదు -
        సంత నాడు పెట్టిందమ్మ ముంతంత కొప్పు ;
9] కానీకి టెంకాయ ఇస్తారని -
          కాశీపట్నానికి వెళ్ళినట్లు ; 
10] అంతా తెలిసిన వాడూ లేడు, 
          ఏమీ తెలియని వాడూ లేడు ;
11] అంపబోయిన అల్లీ సాహెబు .
పిలువబోయిన పీరుసాహెబు మాయ మయ్యారు
12] అబద్ధాలకోరు నోటికి అరవీసెడు సున్నం చాలునా ;
====================,
1] nammiti raamannaa amTE - 
nA amtaTi waaNNi cEstAnannaTlu ;
2] guDi cinnadainaa, 
guLLO dEwuni mahima minna
3] padalam nuulu paagaa lEkumTE -
                pamtulugAru awaru ; 
4] mettagaa umTE motta buddhi ayyimdamTa ; ;
5] imTikO kaDi tini, 
gumTakO gukka neeLLu taaginaTTu ;
6] oka uuri paTElu -
    - ImkO Uriki gaayidODu* [*saamaanyuDu] ;
7] koppu unnammaki kOTi wayyArAlu ;
8] amta nADu lEdu, imta nADu lEdu -
         samta nADu peTTimdamma mumtamta koppu ;
9] kAnIki TemkAya istaarani ; kASIpaTnaaniki weLLinaTlu ; 
10] amtaa telisina wADU lEDu, EmI teliyani wADU lEDu ;
11] ampabOyina allee saahebu .
      piluwa bOyina peeru saahebu maayamayyaaru ; 
12] abaddhAla kOru nOTiki araweeseDu sunnam caalunaa ; 
;
ముందు పోస్టు ;-  ద్వాదశి - 17 - పన్నెండు తెలుగు సామెతలు ;-
ఇల్లే ఇంద్రలోకం ; పందిరే గోవర్ధనం* ; [*పర్వతం ]  ; 
& పనుకుంటే పద్మావతి, కృషి ఉంటే గుణవతి, లేస్తే నీలావతి ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి