6, జూన్ 2020, శనివారం

ద్వాదశి - 33 - పన్నెండు తెలుగు సామెతలు

1] పని లేని పాపరాజు ఏమి చేస్తున్నాడురా అంటే, 
        కుందేటి కొమ్ముకు రేఖలు తీస్తున్నాడు అన్నట్లు ; 
2] అవ్వ వడికిన నూలు, తాత మొలతాటికే సరిపోయె ; 
3] అవ్వ తీసిన గంధం అంతా తాత తలనొప్పికే సరి ;
4] గడప లోపల సుఖం, కాశీకి వెళ్ళినా దొరికేనా !? 
 -   [ఇంట్లో ఉన్న స్వేచ్ఛ ] ;
5] చెట్టు ఎక్కనిచ్చి, నిచ్చెన తీసినట్లు ; 
6] కలిమిలేములు కావడి కుండలు ;
 & [need notes - కావడి యాత్ర ] ; 
7] కొత్త ఒక వింత, పాత ఒక రోత ;
8] చంక దుడ్డు శరణార్ధి ; 
9] వేటగాడు వల వేస్తే, సగం పిట్టలు అటూ, 
         సగం పిట్టలు ఇటూ ఎగిరిపోయాయిట ; 
10] ఆనందవృష్టి కోసం పెళ్ళి చేసుకుంటే ; 
       అవస్థల సృష్టి వోలె బండెడు సంసారం ;
11] ఏమోయి శెట్టీ, ఏట్లో కొట్టుకుపోతున్నావు, 
అంటే గడ్డి మోపు అమ్మడానికి అన్నాడట ; 
12] అమావాస్య రోజున కయ్యానికి ఎందుకెళ్ళావంటే - 
             ఎదిరి వాడికి అచ్చి రాకుండా - అన్నాడట ;
==============================,
1] pani lEni paaparaaju Emi cEstunnADurA amTE 
       kumdETi kommuku rEKalu teestunnaaDu annaTlu ; 
2] awwa waDikina nuulu, taata molatATikE saripOye ; 
3] awwa teesina gamdham amtA taata talanoppikE sari ;
4] gaDapa* lOpala sukham, 
       kASeeki weLLinaa dorikEnaa !? ;
 [=* imTlO unna swEcCa ] ; 
5] ceTTu ekkanicci, niccena teesinaTlu ; 
6] kalimilEmulu kaawaDi kumDalu ;
[need notes - [ kaawaDi yaatra ]
7] kotta oka wimta, paata oka rOta ; 
8] camka duDDu SaraNArdhi ;
9] wETagADu wala wEstE, 
sagam piTTalu aTuu, sagam piTTalu iTuu egiripOyaayiTa ;
10] AnamdawRshTi kOsam peLLi cEsukumTE ; 
          awasthala sRshTi wOle bamDeDu samsaaram ; 
11] EmOyi SeTTI, ETlO koTTukupOtunnAwu, amTE 
       gaDDi mOpu ammaDAniki annADaTa ; 
12] amaawaasya rOjuna kayyaaniki emdukeLLAwamTE - 
           ediri wADiki acci raakumDA - annaaDaTa 
;
& ముందు పోస్టు ; ద్వాదశి - 32 - పన్నెండు తెలుగు సామెతలు
1] ఓమ్ కారము లేని మంత్రము - అధికారము లేని ప్రజ్ఞ ; 
2] దండమయ్యా బాపనయ్యా అంటే, .............. ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి