6, జూన్ 2020, శనివారం

ద్వాదశి - 30 - పన్నెండు తెలుగు సామెతలు

1] విడిపోయి విడివడితే - గుర్రం కాస్తా గాడిదతో సమానం ;
2]  రాముని వంటి రాజు ఉంటే, 
         హనుమాండ్లు లాంటి బంటు అప్పుడే ఉంటాడు  ;
3] తిమ్మన్నా నీకు నమస్కారం - అంటే నా పేరెట్లాగ తెలిసె - 
      నీ ముఖం చూడగానే ఎరుకాయె  ;
4] తిన్న ఇంటిని మోసం చేస్తి వేమిరా, అంటే ; 
           తినని ఇంట్లోకి రానిస్తారా, ఏంటి అన్నాడట ; 
5]  ఇల్లు ఇచ్చినవాడికి, పోసిన వాడికీ మంచి లేదు ; 
6] ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకున్నమ్మ పులి -
7] పరిగెత్తే వాణ్ణి చూస్తే, తరిమే వాడికి లోకువ  ; 
8]  లగ్నంలో తుమ్మినట్లు ;
9] తమలం వేయని నోరు, కమలం లేని కోనేరు ;
10] చదువ నేర్తువా, వ్రాయనేర్తువా, అంటే -
        చదువ నేర్వను, వ్రాయనేరను చించ నేర్తును అన్నాడట ;
11] ఈకలు లేవు గానీ, వింజమూరి పుంజు కదండీ ; 
12] గుమ్మడికాయంత తెలివికి, గురిగింజంత అదృష్టం గొడుగు ; 
;
=====================, ;
;
1] wiDiwaDitE - gurram kaastaa gADidatO samAnam ; 
2] raamuni wamTi raaju umTE, hanumAmDlu laamTi bamTu appuDE umTADu ; 
3] timmannA neeku namaskAram - amTE nA pEreTlaaga telise - 
         nI mukham cUDagAnE erukAye ; 
4] tinna imTini mOsam cEstiwEmirA amTE ; 
tinani imTlOki raanistaaraa EmTi? annADaTa ;
5] illu iccinawADiki, 
       majjiga pOsina waaDikI mamci lEdu ; 
6] iccinamma eega, puccukunnamma puli ;;
7] parigettE wANNi cUstE, 
           tarimE wADiki lOkuwa ;
8] lagnamlO tumminaTlu ;
9] tamalam wEyani nOru, kamalam lEni kOnEru ;
10] caduwa nErtuwaa, wraaya nErtuwaa amTE,
          caduwa nErwanu, 
           wraaya nEranu cimca nErtunu annaaDaTa ; 
11] eekalu lEwu gaanee, wimjamuuri pumju kadamDI  ; 
12] gummaDikAyamta teliwiki, gurigimjamta  ;
;
ముందు పోస్టు ;- ద్వాదశి - 29 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] గాడిద తంతే ఎవరికీ చెప్పకు  = When an ass kicks you, never tell  :)
2] స్వాతి కొంగల` మీదికి .... సాళువం వెళ్ళినట్లు ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి