10, జూన్ 2020, బుధవారం

ద్వాదశి - 37 - పన్నెండు తెలుగు సామెతలు

1] గాడిద కొడకా అంటే, 
         తమరు తండ్రులు, మేము బిడ్డలము అన్నాడట ; 
2] దుడ్డు కర్రా దుడ్డుకఱ్రా ఎవరి మాట వింటావే,  
         అంటే ఎవరి చేతిలో ఉంటే వారి మాటని - అన్నదిట ; 
3] అప్పణంగా వస్తే ఆనపకాయ తొక్కను కూడా తింటారు ;
4] ఇసుకతో తాడు పేనుతాడంట - భలే వీడి వాలకం ; 
5] ఆకాశానికి  గాటు పెడ్టాడట, అసాధ్యం మనిషి  ;
6] సుఖం వస్తే, ముఖం కడుక్కోవడానికి కూడా తీరిక లేనట్లు ;
7] దున్నపోతు మీద వాన కురిసినట్లు ; 
8] ఏనుగు మీద దోమ వాలినట్లు ;
9] అద్దంలోని ముడుపు ;
10] అంగడి అమ్మి, గొంగడి కొన్నాడట ; 
11] ఏటిఈతకు, లంక మేతకు సరి ;
12] కళ్ళకు గంతలు కట్టి అడవిలో వదిలేసినట్లు ; 
===============================,
1] gADida koDakA amTE, 
      tamaru tamDrulu, mEmu biDDalamu annADaTa ; 
2] duDDu karraa duDDuka~rraa ewari mATa wiMTAwE,  
          amTE ewari cEtilO uMTE waari mATani - annadiTa ; 
3] appaNamgaa wastE -
           AnapakAya tokkanu kUDA timTAru ;
4] isukatO tADu pEnutA DamTa - 
          bhalE wIDi waalakam ;
5] AkASAniki gATu peDTADaTa, asaadhyam manishi ;
6] sukham wastE, mukham -
                - kaDukkOwaDAniki kUDA teerika lEnaTlu ;
7] dunnapOtu meeda waana kurisinaTlu ; 
8] Enugu mIda dOma wAlinaTlu ;
9] addamlOni muDupu ;
10] amgaDi ammi, gomgaDi konnADaTa ;
11] ETi Itaku, lamka mEtaku sari ;
12] kaLLaku gamtalu kaTTi aDawilO wadilEsinaTlu ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 36 - పన్నెండు తెలుగు సామెతలు ;- 
1] వజ్రం వంటి బిడ్డకు, వైఢూర్యాల అల్లుడు ; 2] లక్క లాంటి తల్లి ; రత్నాల  వంటి పిల్లలు ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి