6, జూన్ 2020, శనివారం

ద్వాదశి - 31 - పన్నెండు తెలుగు సామెతలు

1] విదూషకుణ్ణి కోతి ఉరిమినట్లు, 
           హాస్యగాణ్ణి తేలు కుట్టినట్లు ;
2] చెరువులోని నీళ్ళు వాలు గుమ్మిన పోయె ; 
          నోటిలో మాటలు గాలికి పాయె ;
3] రొట్టె తగవు కోతి తీర్చిందట  ;
4] దుడ్డే దొడ్డప్ప ;
 కన్నడ పదం - దుడ్డు = * డబ్బు ];
5] పెద్దల మాట పెరుగన్నం మూట ;  
6] పెన్నలో మాన్యాన్ని కాశీలో దానం చేసినట్లు  ;
7]  ఇరుసున కందెన వేయక, 
          పరమేశుని బండియైన సాగదు సుమతీ ;
8] బలిమి లేని వేళల పంతములు వలదోయీ ;
9] తొడపాశం పెట్టి, నైవేద్యం పెట్టాడట ;
10] పుర్రెకొక బుద్ది, జిహ్వకొక రుచి ;
11] లోకాయికి మాట నష్టం, లోభికి మూట నష్టం ; 
12] ధరించేదే శాటి*, వరించేదే బోటి** ;
[ =  *శాలువా/ అంగీ ; & ** వధువు/ స్త్రీ ] ;
========================= ,
1] widuushakuNNi kOti uriminaTlu, 
          haasyagANNi tElu kuTTinaTlu ;  
2] ceruwulOni nILLu waalu gummina pOye ; 
          nOTilO mATalu gaaliki pAye ;
3] roTTe tagawu kOti teercimdaTa ;
4] duDDE doDDappa ;
     [ Kannada word - duDDu = * Dabbu ] ;
5] peddala mATa perugannam mUTa ;
6] pennalO maanyaanni kASIlO dAnam cEsinaTlu ; 
7] irusuna kamdena wEyaka, 
paramESuni bamDi yaina sAgadu sumatee ;
8] balimi lEni wELala pamtamulu waladOyee ;
9] toDapASam peTTi, naiwEdyam peTTADaTa ;
10] purrekoka buddi, jihwakoka ruci ;
11] lOkaayiki mATa nashTam, 
          lOBiki muuTa nashTam ;
12] dharimcEdE SATi*,  warimcEdE bOTi** - 
[ =* SAluwaa/ amgee ; & ** wadhuwu/ stree ] ; 
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 30 - పన్నెండు తెలుగు సామెతలు ;-
1] విడిపోయి విడివడితే - గుర్రం కాస్తా గాడిదతో సమానం ; 
2]  రాముని వంటి రాజు ఉంటే, హనుమాండ్లు లాంటి బంటు అప్పుడే ఉంటాడు  ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి