5, జూన్ 2020, శుక్రవారం

ద్వాదశి - 28 - పన్నెండు తెలుగు సామెతలు

1] జొన్న పెరిగితే జాడు, వరి పెరిగితే వడ్లు ; [జాడు = చీపురు] - కర్షక సామెత ; 
2] ఆకాశంలో గొర్రె తొక్కుడు, అతి సమీపంలో వానధారలు ; రైతు సామెత
3] నిజం నిద్ర లేచి నడక మొదలెట్టేటప్పటికి - 
        అబద్ధం అంతరిక్షం దాకా చుట్టబెడుతుంది 
4] అగ్రహారాలు పోతేపోయాయి గానీ, 
       ఆక్ట్* బాగా తెలిసింది ; [*చట్టం ] ; 
5] గిద్దెడు నూనెకైనా, గానుగ కట్టాల్సిందే కదా ;
6] జముకులోడు వచ్చాక జాతర ఆగుతుందా!? 
7] పళ్ళు లేని పులి నోట్లో ఇరుక్కున్నట్లు ; 
8] అర కాసు పనికి - ముప్పాతిక బాడుగ  ; 
9] శేరు దొరగారికి, మణుగు బంటు ;
10] గుడ్డు వచ్చి, పెట్టను గోరడాలాడిందట ;
11] తిమ్మిని బ్రహ్మి, బ్రమ్మిని తిమ్మిగా చేసే రకం వీడు ;
12] నా కూతురికి మొగుడు ఈ అల్లుడు, 
          నాకు మొగుడు ఈ తోడిపెళ్ళికొడుకు,  
            ఆరు నెలల నుండీ ఇక్కడే తిష్ఠ వేసాడు, అన్నాట్ట ;
====================, ;
1] jonna perigitE jADu, wari perigitE waDlu ;
[jADu = ceepuru ;; karshaka sAmeta ] ; 
2] aakaaSamlO gorre tokkuDu ; ati sameepamlO waanadhaaralu ;
 - raitu saameta ; [= cumulonimbus clouds ] ;
3] nijam nidra lEci naDaka modaleTTETappaTiki ;   abaddham amtariksham dAkA cuTTabeDutumdi ;
4]  agrahArAlu pOtEpOyAyi gAnI, 
       *ACT bAgA telisindi ; 
[= *caTTam ] ; [haasya saameta] ;
5] giddeDu nUnekainaa, 
      gAnuga kaTTAlsimdE kadA ; 
6] jamukulODu waccaaka jAtara aagutumdaa!? 
7] paLLu lEni puli nOTlO irukkunnaTlu ;
 - cinema proverb [brahmanamdam :) ] ; 
8] ara kaasu paniki - muppaatika bADuga ; 
9] SEru doragAriki, maNugu bamTu ; 
10] guDDu wacci, peTTanu gOraDAlaaDimdaTa ;  
11] timmini brahmi, 
    brammini timmigaa cEsE rakam wIDu ; 
12] alluNNi cUpistuu "nA kUturiki moguDu, 
ee tODi peLLi koDuku nAku moguDu, 
Aru nelala numDI ikkaDE tishTha wEsADu" annATTa ;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 27 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ఇగురం* ఉంటే ఇరవైమందినైనా సాకవచ్చు ; [ =* వివరం ] ; 
2] అబ్బి అంత పొడుగు, దాక్షారామం భీమన్నలాగా ;  [*Notes] ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి