2, మార్చి 2019, శనివారం

ద్వాదశి - 8 [12 Telugu proverbs]

1. `ఏమండీ కరణం గారూ, పాతరలో పడ్డారే` అంటే `కాదు, సర్వే చేస్తున్నాను` అన్నాడట ;
2. వచ్చిన నాడు వరాల చుట్టం , 
మర్నాడు మాడా చుట్టం , మూడవనాడు మురికి చుట్టం ;
3. *ఇవతల చేర, అవతల సార, నడుమన రామన్న రాజ్యం ; [ = శ్రీరామరాజ్యం ] ; 
4. అచ్చం తిరుమణిధారి ఐతే పుల్లను పట్టడంలోనే తెలుస్తుంది - వాడి వాటం ;
5. ఉడుముకు రెండు నాలుకలు ; 
6. నరం లేని నాలిక వాడిది ;
7. సూక్ష్మంలో మోక్షం ;
8. అందరికీ నేను లోకువ నాకు నంబి రామాయి లోకువ ;
9. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు వచ్చింది రోషం ;
10. మొగుడు మొట్టినా ముద్దే - కానీ అత్తమ్మ అడిగినందుకు అవమానం.
11. చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు 
12. గుఱ్ఱం పారిపోతూ పోతూ .....
గూటం కూడా గుంజుకు పోయింది ; 
ఉంగరం చెడిపి బొంగరం ; బొంగరం చెడిపి ఉంగరం
కట్టిన ఇంటికి - వంకలు చెప్పే వాళ్ళు, వేయి లక్ష మంది  ;
================================, ;
;
1. EmamDI karaNamagArU, paataralO paDDaarE amTE - kaadu sarwE cEstunaanu annADaTa 
2. waccina nADu waraala cuTTam, marnaaDu mADA cuTTam ; mUDawanADu muriki cuTTam ;
3. *iwatala cEra [raajya] awatala saara [raajyam] madhyana Sreeraamaraajyam ; 
4. accam tirumaNidhaari aitE pullanu paTTaDamlOnE telustumdi - wADi wATam ;
5. uDumuku remDu naalukalu ; 
6. naram lEni naalika wADidi ;
7. suukshmamlO mOksham ; 
8. amdarikee nEnu lOkuwa naaku nambi raamaayi lOkuwa ;
9. moguDu koTTinamduku kaadu, tODikODalu nawwinamduku waccimdi rOsham ;
10. moguDu moTTinaa muddE - kaanee attamma aDiginamduku awamaanam.
11. caadastapu moguDu cebitE winaDu, gillitE EDustADu ; 
9. moguDu koTTinamduku kaadu, tODikODalu nawwinamduku waccimdi rOsham ;
10. moguDu moTTinaa muddE - kaanee attamma aDiginamduku awamaanam.
12. gu~r~ram paaripOtU pOtU, 
gUTam kUDA gumjuku pOyimdi 
;
&
 *iwatala cEra raajya- saara raajyam - madhyana Sreeraamaraajyam ; 
;
ద్వాదశి - 8 [ = 12 సామెతల గుత్తి , flowers of Telugu praverbs ]
చేర, అవతల సార, నడుమన మన రామన్న రాజ్యం ; 
;
colors KSM - 6 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి