24, అక్టోబర్ 2019, గురువారం

ద్వాదశి - 12 [12 Telugu proverbs]

1] చెప్పులు తేరా మగడా, 
నిప్పులపై నడుస్తాను, అన్నదట ; 
[or] / చెప్పులు తెచ్చావు, 
మరి నిప్పులేవిరా* మగడా - అన్నదట ;
[ నిప్పులపై *నడవడానికి
2] లోకో భిన్న రుచిః ;
3] కోడలికి బుద్ధి చెప్పి, అత్త తెడ్డు నాకినట్లు  ;
4] అడ్డ జామీనులకు పోతే -
         తెడ్డు దెబ్బలు తప్పవు ; 
5] కోల ఆడితేనే  ..... ,
       కోతి ఆడుతుందన్నట్లు ;  
       [ = *కర్ర/ కఱ్ఱ ] ; 
6] తలగడ మంత్రం చదవొద్దు ;
        ఒద్దిక కలిగి మసలాలి ;
7] రోలు తీసుకురా, రోకలి తీసుకురా,
         రోటి దగ్గరికి నన్ను తీసుకు పోరా  ;
8] తల ఊపినందుకు, 
     తంబురా బుర్ర ఇచ్చి పొమ్మన్నట్లు ;
9] కాకరబీ కాకు జాతారే అంటే ;
దూబగుంటకు దూదేకను జాతారే - 
బదులు చెప్పాడట - దూదేకుల సాయిబు ;
10] పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలు ఆడుతుంది  ;
11] దారం లేని సూదిని దయ్యం ఎత్తుకుపోతాది . 
12] కట్టె లేదు, కంప లేదు ; కాచి పోయను నీళ్ళు లేవు ; 
......... పదవోయి అల్లుడా చెరువు గట్టుకు ;
==============, ;
;
1] ceppulu tErata magaDA, 
nippulapai naDustAnu - annadaTa ; 
[ or ] ceppulu teccaawu, 
mari nippulEwiraa, magaDA - annadaTa ;[*naDawaDAniki ] 
2] lOkO Binna ruci@h ;
3] kODaliki buddhi ceppi, 
atta teDDu naakinaTlu  ; 
4] aDDa jaameenulaku pOtE -
teDDu debbalu tappawu ;
5] kOla* ADitEnE  ..... ,
kOti ADutundannaTlu ;
[ = *karra/ ka~r~ra ] ;
6] talagaDa mamtram cadawoddu ;
oddika kaligi masalaali ; 
7] rOlu teesukuraa, 
rOkali teesukuraa,
rOTi daggariki 
nannu teesuku pOraa ; 
8] tala uupinamduku, 
tamburaa burra icci pommannaTlu ;
9] kaakarabee kaaku jaataarE amTE ;
duubagumTaku duudEkanu jaataarE - 
badulu ceppaaDaTa - duudEkula saayibu ; 
10] pilli guDDidaitE -
eluka ekasekkaalu ADutumdi.
11] daaram lEni suudini -
dayyam ettukupOtaadi ; 
12] kaTTe lEdu kampa  lEdu , 
kaaci pOyanu neeLLu lEwu , 
padawOyi alluDaa ceruwu gaTTuku ;
;
&
ముందు పోస్టు ;- ద్వాదశి - 11 [12 Telugu proverbs] ;
9]  గబ్బిలం గగనాన్ని పడకుండా 
పట్టుకుని ఉన్నాను - అన్నదట ;
10] గొరిగించి గోపి నామం పెట్టినట్లు ;

ద్వాదశి - 11 [12 Telugu proverbs]

1] అంగరక్షలెన్ని ఉన్నా శ్రీరామ రక్ష ఉండాలి  ;
2]  చిన్ని నా బొజ్జకు  శ్రీరామ రక్ష ;
3] అండదండలు ఉంటే, కొండలు దాటవచ్చు ; 
4] ఎక్కడా పనికి - ఒళ్ళు వంగని వాడికి, 
             రంగమెళ్తే వంగుతుంది ;
5] పిఠాపురం వెళ్ళి, పిడత నీళ్ళు తెచ్చాడట  ;
6] గంగిరెద్దును బండికి కడితే వాడ వాడ, 
గంగిరావును కడితే ఇల్లిల్లూ - ఆగేను ; 
7] గడియ తీరిక/ పురసత్తు లేదు ; [ or ] -
దమ్మిడీ/ గవ్వ ఆదాయము లేదు ; 
8] గానుగలో చెయ్యి పెట్టి,
పెరుమాళ్ళూ, నీ దయ - అన్నాడట ;
9]  గబ్బిలం గగనాన్ని పడకుండా 
పట్టుకుని ఉన్నాను - అన్నదట ;
10] గొరిగించి గోపి నామం పెట్టినట్లు ;
11] నాలుక పైన బూరెలు వండి ఇస్తాడట ;
12] వచ్చిన కాడికే వాసు దేవ ; 
;
===================, ;
;
1] amgarakshalenni unnaa -
        Sreeraama raksha umDAli ;
2] cinni naa bojjaku  Sreeraama raksha ;
3] amDadamDalu umTE, komDalu dATawaccu ; 
4] ekkaDA paniki - oLLu wamgani wADiki, 
ramgameLtE wamgutumdi ;
5] piThaapuram weLLi, piData neeLLu teccaaDaTa ;
6] gamgireddunu bamDiki kaDitE wADa wADa, 
gmgiraawunu kaDitE illilluu - aagEnu ; 
7] gaDiya teerika/ purasattu lEdu ; [ or ] ;-
dammiDee/ gawwa aadaayamu lEdu ; 
8] gaanugalO ceyyi peTTi, 
perumALLU, nee daya - annADaTa ;
9] gabbilam gaganaanni paDakumDA 
paTTukuni unnAnu - annadaTa. 
10] gorigimci gOpi naamam peTTinaTlu ;  
11] naaluka paina buurelu wamDi istaaDaTa ;
12] waccina kADikE wAsu dEwa ; 
;
♣ ఽ  © ♫  ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - ▼ ► ఌౡ © ఽ ఽ ♣♣ ;
ముందు పోస్టు ;- ద్వాదశి - 10 [12 Telugu proverbs] ;- 
9] అరవై ఏళ్ళు నిండని వానిని ఆలోచన అడగకు, 
ఇరవై ఏళ్ళు నిండని  వానికి పెత్తనం ఇవ్వకు  ;
10] ఆఁ అంటే అపరాధం ; కోఁ అంటే బూతు మాటే  ;

ద్వాదశి - 10 [12 Telugu proverbs]

1] అరిశెల పాకం - అత్త పాకం తెలుసుకు మసలాలి ;
2] పెళ్ళికి చేసిన పప్పు, పేరంటాళ్ళు -
 చవిచూడడానికే సరిపోయింది ; 
3] పెదవికి మించిన పన్ను ; 
ప్రమిదకు మించిన వత్తి -
4] పిండిబొమ్మను చేసి ; పీట మీద కూర్చుంబెడితే - 
ఆడబిడ్డతనాన ఎగిరెగిరి పడిందట ;
5] నిత్య కళ్యాణం, పచ్చ తోరణం ;
6] నాదం ఉంటే గంట, వాదం ఉంటే తంటా ; 
7] అల్లుడు అని పేరు పెట్టి ; 
పుల్ల విరిచివేస్తే ఎగిరెగిరి పడుతుంది ;
8] అమ్మకు నోటి వాడి, అయ్యకు చెయ్యి వాడి ; 
9] అరవై ఏళ్ళు నిండని వానిని ఆలోచన అడగకు, 

ఇరవై ఏళ్ళు నిండని  వానికి పెత్తనం ఇవ్వకు  ;
10] ఆఁ అంటే అపరాధం ; కోఁ అంటే బూతు మాటే  ;
11] కాశీకి వెళ్ళి కొబ్బరికాయకి లోభించాడట ;
12] కాళిదాసు కవిత్వం కొంత ఐతే, నా పైత్యం ముంతంత ;
========================, ;
1] arisela paakam - atta paakam 
telusuku masalaali ;
2] peLLiki cEsina pappu, pEramTALLu 

cawicuuDaDAnikE sari pOyimdi ;
3] pedawiki mimcina pannu ; 
pramidaku mimcina watti ;
4] pimDibommanu cEsi, pITa mIda kuurcumDa beDitE 
- ADabiDDatanAna egiregiri paDimdaTa ;
5] nitya kaLyANam, pacca tOraNam ; 

6] naadam umTE gamTa, waadam umTE tamTA ;
7] alluDu ani pEru peTTi ; pulla wiriciwEstE egiregiri paDutumdi ;

8] ammaku nOTi wADi, ayyaku ceyyi wADi ;
9] arawai ELLu nimDani waanini AlOcana aDagaku, 
irawai ELLu nimDini  waaniki pettanam iwwaku ;

10] ఆఁ amTE aparaadham ; కోఁ amTE buutu maaTE ;
11] kASIki weLLi kobbarikaayaki lOBimcADaTa ; 
12] kALidaasu kawitwam komta aitE, 

naa paityam amdulO mumtamta ;
;
ముందు పోస్టు ;- 2, మార్చి 2019, శనివారం ; 
ద్వాదశి - 9 [12 Telugu proverbs] ;
1] పుట్టిన ఇన్నాళ్ళకు పురుషుడు యజ్ఞము చేసెను ; ;

ద్వాదశి - 9 [12 Telugu proverbs] ;

1] పుట్టిన ఇన్నాళ్ళకు పురుషుడు యజ్ఞము చేసెను ;
2] కన్నవస్థా పడి, కంచిలో చెయ్యి కడిగి, 
ఎట్లాగైతేనేమి - పట్నం చేరుకున్నాను ;
3] మూడుంటే ముచ్చట్లు ; చిరాకుంటే చీవాట్లు ;
- politicians సామెత ;  
4] పుట్టని వానికి అన్న ; పుట్టే వానికి తమ్ముడు ; 
5] నా దుక్కి ఒక్కటి, మా రెడ్డి గారివి కలిసి - నూటొక్క ఎద్దులు - అన్నట్లు ;                        [ ఇతనిది ఒక్కటే - అని భావం];
6] నంబి సాంబయ్య, జంగం రంగయ్య ఉండరు ; [ or ]
-            నంబి లింగయ్య, జంగం రంగయ్య ఉండరు.
7] నా దుక్కి ఒక్కటి, మా రెడ్డి గారివి కలిసి - 
నూటొక్క ఎద్దులు - అన్నట్లు ;  
[ = ఇతనిది ఒక్కటే - అని భావం] ;
8]  కాశీకి వెళ్ళినా కావడి బరువు తప్పలేదు ;    
9] కూడలి కాపురం కుతకుతలు ; 
వేరడి కాపురం వెతవెతలు ;
10] నోరు పెట్టుకుని గెలవవే ఊర గంగానమ్మ! ;
11] తిండికి ముందు - దండుకు వెనుక ; 
12] మరిచిపోయి ..... ,
"మజ్జిగలో చల్ల పోసాను" అన్నదట ; 
==================, ;
;
1]  puTTina innALLaku purushuDu yajnamu cEsenu  ;; 
2] kannawasthaa paDi, kamcilO ceyyi kaDigi, 
eTlaagaitEnEmi - paTnam cErukunnaanu  
3] mUDumTE muccaTlu ; ciraakumTE cIwATlu ;; 
4] puTTani wAniki anna ; puTTE wAniki tammuDu ; 
5] naadukki okkaTi, maa reDDi gaariwi kalisi - 
nuuTokka eddulu - annaTlu - [itanidi okkaTE - ani bhaawam ; 
6] nambi saambayya, jamgam ramgayya umDaru ; / [or] -
nambi limgayya, jamgam ramgayya umDaru ;
7] naadukki okkaTi, maa reDDi gaariwi kalisi - 
nuuTokka eddulu - annaTlu ;
 [= itanidi okkaTE - ani bhaawam ] ; 
8] kASIki weLLinA kAwaDi baruwu tappalEdu ;
9] kUDali kApuram kutakutalu ; wEraDi kApuram wetawetalu ; 
10] nOru peTTukuni gelawawE Ura gamgaanamma! ;
11] timDiki mumdu ; damDuku wenuka ; 
12] maricipOyi, majjigalO calla pOsAnu annadaTa ;
;
ముందు పోస్టు ;- 2, మార్చి 2019, శనివారం ;
 ద్వాదశి - 8 [12 Telugu proverbs] ;-

1. `ఏమండీ కరణం గారూ, పాతరలో పడ్డారే` అంటే `కాదు, సర్వే చేస్తున్నాను` అన్నాడట ;