తెలుగు proverb - Telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు proverb - Telugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, అక్టోబర్ 2019, గురువారం

ద్వాదశి - 10 [12 Telugu proverbs]

1] అరిశెల పాకం - అత్త పాకం తెలుసుకు మసలాలి ;
2] పెళ్ళికి చేసిన పప్పు, పేరంటాళ్ళు -
 చవిచూడడానికే సరిపోయింది ; 
3] పెదవికి మించిన పన్ను ; 
ప్రమిదకు మించిన వత్తి -
4] పిండిబొమ్మను చేసి ; పీట మీద కూర్చుంబెడితే - 
ఆడబిడ్డతనాన ఎగిరెగిరి పడిందట ;
5] నిత్య కళ్యాణం, పచ్చ తోరణం ;
6] నాదం ఉంటే గంట, వాదం ఉంటే తంటా ; 
7] అల్లుడు అని పేరు పెట్టి ; 
పుల్ల విరిచివేస్తే ఎగిరెగిరి పడుతుంది ;
8] అమ్మకు నోటి వాడి, అయ్యకు చెయ్యి వాడి ; 
9] అరవై ఏళ్ళు నిండని వానిని ఆలోచన అడగకు, 

ఇరవై ఏళ్ళు నిండని  వానికి పెత్తనం ఇవ్వకు  ;
10] ఆఁ అంటే అపరాధం ; కోఁ అంటే బూతు మాటే  ;
11] కాశీకి వెళ్ళి కొబ్బరికాయకి లోభించాడట ;
12] కాళిదాసు కవిత్వం కొంత ఐతే, నా పైత్యం ముంతంత ;
========================, ;
1] arisela paakam - atta paakam 
telusuku masalaali ;
2] peLLiki cEsina pappu, pEramTALLu 

cawicuuDaDAnikE sari pOyimdi ;
3] pedawiki mimcina pannu ; 
pramidaku mimcina watti ;
4] pimDibommanu cEsi, pITa mIda kuurcumDa beDitE 
- ADabiDDatanAna egiregiri paDimdaTa ;
5] nitya kaLyANam, pacca tOraNam ; 

6] naadam umTE gamTa, waadam umTE tamTA ;
7] alluDu ani pEru peTTi ; pulla wiriciwEstE egiregiri paDutumdi ;

8] ammaku nOTi wADi, ayyaku ceyyi wADi ;
9] arawai ELLu nimDani waanini AlOcana aDagaku, 
irawai ELLu nimDini  waaniki pettanam iwwaku ;

10] ఆఁ amTE aparaadham ; కోఁ amTE buutu maaTE ;
11] kASIki weLLi kobbarikaayaki lOBimcADaTa ; 
12] kALidaasu kawitwam komta aitE, 

naa paityam amdulO mumtamta ;
;
ముందు పోస్టు ;- 2, మార్చి 2019, శనివారం ; 
ద్వాదశి - 9 [12 Telugu proverbs] ;
1] పుట్టిన ఇన్నాళ్ళకు పురుషుడు యజ్ఞము చేసెను ; ;

22, డిసెంబర్ 2018, శనివారం

ద్వాదశి - 1

1. చెక్కక పోతే దిమ్మ, చెక్కితే బొమ్మ - గుళ్ళో ఉంటే అమ్మ ;
2. గోచీ విప్పి, తలపాగా చుట్టినట్లు
3. మా అమ్మాయి బంగారు బొమ్మ / కుందనపు బొమ్మ ;;
4. కలసి ఉంటే కలదు సుఖం ;
5. కలిసి వచ్చిన అదృష్టం ;
6. అభ్యాసం కూసు విద్య ;
7. నవ్వితే నవరత్నాలు  ; 
8. పట్టిందల్లా బంగారం ; 
9.  చదువు రాకముందు కాకర కాయ, చదువుకున్నాక కీకరకాయ ;
10. చెన్నంపల్లి పంచాయతీ - చెరి సగం ; 
11.  చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు ; 
12. చెవిటివాని ముందు శంఖం ఊదితే - దాన్ని కొరకను నీ తాతలు దిగిరావాలి అన్నాడట.
;
ద్వాదశి - 1  [ = 12 సామెతల గుత్తి ] ;
=================, ;
;
1. cekkaka pOtE dimma, cekkitE bomma - guLLO umTE amma ;
2.  gOcee teesi talapaaga cuTTinaTlu ;
3. maa ammaayi bamgaaru bomma / kumdanapu bomma ;
4. kalasi umTE kaladu sukham ;
5. kalisi waccina adRshTam ;
6. abhyaasam kuusu widya ; 
7. nawwitE nawaratnaalu  ; 
8. paTTimdallaa bamgaaram ; 
9. caduwu raakamumdu kaakara kaaya, caduwukunnaaka keekarakaaya ;
10. cennampalli pamcaayatee - ceri sagam ; 
11. cEsEwi naayakaalu, aDigEwi tiripaalu, peTTakumTE kOpaalu ;  
12. cewiTiwaani mumdu Samkham uuditE - daanni korakanu nee taatalu digi raawaali annADaTa.
;
= dwaadaSi - 1 [ = 12 saametala gutti ] ;
;
colors KSM - 1

6, అక్టోబర్ 2018, శనివారం

అవ్వ తీసిన గంధం, తాత తలనొప్పికే సరి

1. అవ్వ తీసిన గంధం అంతా ; తాత తలనొప్పికే సరి  ;
2. తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే నాకు పిల్లను ఎవడు ఇస్తాడే అన్నాడట.
3. మూడు నెలలు కుస్తీపట్లు నేర్చి, మూలనున్న ముసలమ్మని కొట్టాడట.
;
====================================;
;
1. awwa teesina gamdham amtaa - taata talanoppikE sari.
2. taataa, peLLi cEsukumTAwA amTE naaku pillanu ewaDu istaaDE annADaTa.
3. mUDu nelalu kusteepaTlu nErci, muulanunna musalammani koTTADaTa.
;
prvbs pain blag - 1 ksm paints 

తంతే గారెల బుట్టలో పడ్డట్టు

1. తంతే గారెల బుట్టలో పడ్డట్టు ; 
2. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు -> 
నీ రొట్టె విరిగి నేతిలో పడ్డది ;
3. చెరుకా, చెరుకా బెల్లం ఇవ్వు - అంటే చటుక్కున ఇస్తుందా 
= [ గానుగలో ఆడించి కాచి ఇగరబెట్టి ఎండ బెట్టి - 
అనేక ప్రక్రియల తర్వాత గుడ్ లభిస్తుంది.]
=============================; ;
;
1. tamtE gaarela buTTalO paDDaTTu ;
2. roTTe wirigi nEtilO paDDaTTu -> 
eg. -nee roTTe wirigi nEtilO paDDadi ;
3. cerukaa, cerukaa bellam iwwu - amTE
caTukkuna istumdaa 
= gaanugalO ADimci kaaci igarabeTTi emDa beTTi -
 anEka prakriyala tarwaata guD labhistumdi. ]
;
nandana akTObar - 2  2018 kusuma paints  

4, అక్టోబర్ 2018, గురువారం

ఏనుగుల పోట్లాట, ఎర్రచీమ రాయబారం

1. ఏనుగుల పోట్లాటకు ఎర్ర చీమ రాయబారమన్నట్లు ;
2. చీమ ఒళ్ళు చీమకు బరువు - ఏనుగు  ఒళ్ళు ఏనుగుకు బరువు -
3. దగ్గరికి పిలిచి నీ కన్ను గుడ్డి అన్నట్లు ; 
================================, ;
 తెలుగు సామెతలు ;-
1. Enugula pOTATaku erra ceema raayabaaramannaTlu ;
2. ceema oLLu ceemaku baruwu - Enugu  oLLu Enuguku baruwu  ;
3. daggariki pilici nee kannu guDDi annaTlu ; telugu proverb ;
;
nandanajaya 22, 2018 kusuma paints 


1, అక్టోబర్ 2018, సోమవారం

గుంపులో గోవిందా

1. గుంపులో  గోవిందా ;  - సామెత ;
2. మందలో గోవిందా ;  - సామెత ;
3. లోకంతో లొట లొట ;  - సామెత ;
;
1. gumpulO  gOwimdA ;  - saameta ;
2. mamdalO gOwimdA ;  - saameta ;
3. lOkamtO loTa loTa ;  - saameta ;
;
nandanajaya- 2018 - 21 kusuma paints  



30, సెప్టెంబర్ 2018, ఆదివారం

అయితే ఆదివారం .... సోమవారం

1. ఐశ్వర్యం అందలం ఎక్కించగానే - 
అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట. - [ హాస్య సామెత] 
2. ఐతంపూడి ఉద్యోగం - ఐతే గియ్తే ఆరు ఆవుల పాడి, 
చేస్తే  గీస్తే పెరుగు, వెన్న - ;;
3. అయితే ఆదివారం, కాకుంటే సోమవారం ;
=================================
;
1. aiSwaryam amdalam ekkistE -
ardharaatri goDuugTTamannaaDaTa. [ comedy proverb
2. aitampUDi udyOgam - aitE giytE aaru aawula pADi, 
cEstE gIstE perugu, wennaa - ;;
3. ayitE aadiwaaram, kaakumTE sOmawaaram ; 
nandanajaya- oct 2018 - 19 kusuma paints

అక్కన్న, మాదన్నలు పల్లకీ ఎక్కితే .....

1. అక్కన్న, మాదన్న గార్లు అందలం ఎక్కితే, 
సాటి సరప్ప చెరువుకట్ట ఎక్కి కూర్చున్నాడంట.

akkanna, maadanna gaarlu amdalam ekkitE, 
saaTi sarappa ceruwukaTTa ekki kuurcunnADamTa.
;
2. అచ్చంగా తిరుమణిధారి ఐతే - 
పుల్ల పట్టడం లోనే పద్ధతి తెలుస్తుంది
=
accamgaa tirumaNidhaari aitE - pulla paTTaDam lOnE 
paddhati telustumdi.
;
3. అన్నం పెడితే అరిగిపోతుంది
చీర ఇస్తే చిరిగిపోతుంది ; 
వాత పెడితే కలకాలం ఉంటుంది - హాస్య సామెత ; 
=
annam peDitE arigipOtumdi
ceera istE cirigipOtumdi ; 

waata peDitE kalakaalam umTumdi - haasya saameta ; 
;

nandanajaya- 2018 - 16 kusuma paints 

28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

కడుపు నిండిన వాడికి గారెలు చేదు

1] లేడికి లేచిందే పరుగు ;
= lEDiki lEcimdE parugu.
2. కడుపు నిండిన వాడికి గారెలు చేదు - సామెత  . ;
= 2. kaDupu nimDina wADiki gaarelu cEdu. ;
3. పిట్ట కొంచెం ; కూత ఘనం ; - సామెత ;
= piTTa komcem, kuuta ghanam ;
;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 13 kusuma paints





24, సెప్టెంబర్ 2018, సోమవారం

ఇంట్లో పిల్లి, వీధిలో పులి

డబ్బుకు లోకం దాసోహం. 
కాసు ఉంటే లోకమంతా దాసుడన్నది  
ధనమూల మిదం జగత్ ; 
ధన మూలం ఇదం జగత్ ; 
ధనమేరా అన్నిటికీ మూలం ; 
&
ఇంట్లో పిల్లి, వీధిలో పులి ;
విద్యా పర దేవతా ;
=======================; ;
;
kaasu umTE lOkamamtaa daasuDannadi ; 
imTlO pilli, weedhiIO puli ; 
widyaa para dEwataa ;
Nandanajaya kusuma paints - 12 

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

తిక్కలవాళ్ళు తిరణాళ్ళకు వెళితే, ఎక్కనూ దిగనూ సరిపోయిందట

1. డబ్బుకు లోకం దాసోహం ;
2. A. తెగువ దేవేంద్ర పదవి &
B. మొండివాడు రాజు కన్నా బలవంతుడు ;
3. తిక్కలవాళ్ళు తిరణాళ్ళకు వెళితే, 
ఎక్కనూ దిగనూ సరిపోయిందట ; 

1. Dabbuku lOkam daasOham ;
2. A. teguwa dEwEmdra padawi &
B. momDiwADu raaju kannaa balawamtuDu ;
3. tikkalawALLu tiraNALLaku weLitE, 
ekkanuu diganuu saripOyimdaTa ;
;
  kusuma ART - nandanajaya 10 

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

పిపీలికం - చీమ

పిపీలికాది బ్రహ్మ పర్యంతం ;- 
పిపీలికం - చీమ ; पिपीलिक/ पिपीलिका ;
చీమ మొదలుకొని బ్రహ్మాడం వరకూ ;
అణువు మొదలు దాకా - అని పలుకుబబడి ; 
ఈ వాక్యాలు వేదాంతపరమైనవి, 
భక్తిపూర్వకంగా కూడా వాడుకలో ఉన్నవి.
1] ఆబాలగోపాలం ;
2] ఆమూలాగ్రం నిశితంగా పరిశీలించుట ;
3] నఖ శిఖ పర్యంతమూ చూస్తూ ;
3] భూ - నభోగోళాలు ;-
భూ - నభో పర్యంతం దద్దరిల్లేలా ...... ;-
మున్నగునవి - [ఇదే అర్ధంలో కాకున్నా ..... ]
ఈ పంధాలోని నుడువులు - అని చెప్పవచ్చును. 
;
============================; ;
pipeelikaadi brahma paryamtam ;- pipeelikam - ceema ;
ceema modalukoni brahmADam warakuu ;
aNuwu modalu daakaa - ani palukubabaDi ; 
ee waakyaalu wEdaamtaparamainawi, 
bhaktipuurwakamgaa kUDA waaDukalO unnawi.
1] aabaalagOpaalam ;
2] aamuulaagram niSitamgaa pariSeelimcuTa ;
3] nakha Sikha paryamtamuu cuustuu ;
4] bhuu - nabhOgOLAlu ;
bhuu - nabhO paryamtam daddarillElaa ;munnagunawi - 
[idE ardhamlO kaakunnaa .... ] ;
ee pamdhaalOni nuDuwulu - ani ceppawaccunu. 
;
nandanajaya- 9 sept  2018ksm paints  

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

పని లేక పటేలింటికి పోతే, పాతగోడకు పూత పెట్టమన్నాడట

1. పని లేక పటేలింటికి పోతే ; 
పాత గోడకు పూత పెట్టమన్నాడట ; [హాస్య సామెత ] ;
2. కోటి విద్యలు కూటి కొరకే ;
3.  అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న ;
============================== ;
1. pani lEka paTElimTiki pOtE ; 
paata gODaku pUta peTTamannADaTa ; 
[haasya saameta ] ; lOkOkti ; lOkam pOkaDa ;
2. kOTi widyalu kUTi korakE ;
3. atani kanTe ghanuDu, aacamTa mallanna ;
;
nandanajaya- 8 sept  2018ksm paints   

అట్లకు ఆదివారం

1. పొట్టకు పుట్టెడు తిని - 
అట్లకు ఆదివారం అన్నట్లు ; హాస్య సామెత ;
2. పందుం తిన్నా పరగడుపే ; 
ఏదుం తిన్నా ఏకాశే* ;- హాస్య సామెత ;                                                *[ఏకాశే = ఏకాదశే ] ; 
3. అక్కర ఉన్నంత వరకు ఆదినారాయణ ; 
అక్కర తీరాక బోడి నారాయణ ;
-  లోక సామెత ; 
=============================; ;
1. poTTaku puTTeDu tini - 
aTlaku aadiwaaram annaTlu ;
haasya saameta ;
2. pamdum tinnaa paragaDupE ; Edum tinnaa EkaaSE - ;
;;- haasya saameta ; [  * EkaaSE = EkaadaSE ] ; 
3. akkara unnamta waraku aadi naaraayaNa, akkara teeraaka bODi naaraayaNa ;
;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 7 kusuma paints.png - proverb 7 

6, సెప్టెంబర్ 2018, గురువారం

జ్ఞాతి గుర్రు, అరటి కర్రు

1. జ్ఞాతి గుర్రు, అరటి కర్రు వదలవు ;
2. ఎక్కమంటే ఎద్దుకు కోపం ; 
దిగమంటే కుంటికి కోపం ;  - హాస్యం - లోకం పోకడ ;
3. తేర గుర్రానికి - తంగేటి బరికె [ = బెత్తం ] ;- 
- రైతు సామెత ;  
=
1. jnaati gurru, araTi karru wadalawu ;
2.  ekkamamTE edduku kOpam ; 
digamanTE kunTiki kOpam ;
3. tEra gurraaniki - tamgETi barike [ = bettam = whip ] 

;- raitu saameta ; 
;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 6 kusuma paints.png జ్ఞాతి గుర్రు, అరటి కర్రు 

సింగడు - అద్దంకి

1. చేలో ప్రత్తి చేలో ఉండగానే, 
పోలికి మూడు పోగులు, 
నాకు మూడు పోగులూ అన్నట్లు ;- రైతు సామెత ;
2. సింగడు అద్దంకి పోనూపొయ్యాడు, రానూ వచ్చాడు ; సామెత  ;
3. అతని కంటె ఘనుడు - ఆచంట మల్లన్న ;- సామెత ;

1. cElO pratti cElO umDagAnE, pOliki mUDu pOgulu, naaku  

mUDu pOguluu annaTlu ; - saameta  ;
2. simgaDu addamki pOnuupoyyaaDu, raanU waccADu ; 
saameta  ; 
3. atani kamTe ghanuDu - aacamTa mallanna ; Telugu proverb ;
;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 5 kusuma paints.png  

శంఖంలో తీర్ధం, పెంకులో నీళ్ళు

1. దున్నే రోజుల్లో దేశం మీదికి వెళ్ళి, కోతల కాలంలో కొడవలి పట్టాడంట;  రైతు సామెత ;
2. శంకులో పోస్తే తీర్ధం ; పెంకులో పోస్తే నీళ్ళు ;
3. ఊగే పంటి కింద - - రాయి పడినట్లు ; - సామెత ; 
================; -
1. dunnE rOjullO dESam meediki weLLi,
kOtala kaalamlO koDawali paTTaaDamTa - raitu saameta 
2. SamkulO pOstE teerdham ; pemkulO pOstE neeLLu ;
3. uugE pamTi kimda raayi paDDaTTu ;- proverb Telugu ;
;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 4 kusuma paints.png  

గడ్డి కుప్పలో - సూది మాదిరి

1. వస్తే కొండ ; పోతే వెంట్రుక - సామెత ;  
2. గడ్డి కుప్పలో - సూది మాదిరి ; - సామెత ;
3. తా దూర కంత లేదు, మెడకో డోలు - నానుడి ; / 
తాను దూర కంత లేదు గానీ, మెడకు ఒక డోలు ; 
===========================; ;  
1. wastE komDa ; pOtE wemTruka ;- saameta ;
2. gaDDi kuppalO sUdi mAdiri ;
3. taa duura kamta lEdu, meDakO DOlu - naanuDi ; / 
taanu duura kamta lEdu gaanee, meDaku oka DOlu ; 
;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 3 kusuma paints 










;
శుభ ఉషస్సు ; शुभोदयम ; సుప్రభాతం ; Good Morning ;

చెవిలో పువ్వు

గురువుకే పంగనామాలు పెట్టేవాడు /
చెవిలో పువ్వు పెట్టేవాడు ; - సామెత ;
=================;
guruwukE pamganaamaalu peTTEwADu ;
cewilO puwwu peTTEwADu ; - saameta ;
&
nandanajaya- సెప్టెంబర్ 2018 - 2 kusuma paints.png 

అసలు కన్న కన్న కొసరు ముద్దు

అసలు కన్న కన్న కొసరు ముద్దు ;  
- proverb - Telugu ;
పులుసు కన్నా ముక్క తీపి ;
మనుమలు అంటే ప్రేమ ఎక్కువ ; 
&
nandanajaya- సెప్టెంబర్ 2018 -1 kusuma paints - 1