4, జనవరి 2019, శుక్రవారం

ద్వాదశి - 6 [ = 12 సామెతల గుత్తి ]

1. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు ;
2. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి ;
3. కర్ణుడు లేని భారతం, శొంఠి లేని కషాయం ;
4. అదిగో ద్వారక, ఆలమంద లవిగో ; 
5. ఆవులను మళ్ళించిన వాడే అర్జునుడు ; 
6. వచ్చిన వాడు ఫల్గుణుడు - అవశ్యము గెలుతు మనంగ రాదు ; 
7. అర్జున ఫల్గుణ కిరీటి - మంత్రం *
8. భీష్మ ప్రతిజ్ఞ ;
9.  ద్రౌపదీ వస్త్రాలు
[= అనేక దుస్తులు ]
10. ఈ వ్యవహారం అంతా పద్మవ్యూహంలాగా ఉన్నది, అర్ధం కాదు ;
11. ఉత్తర కుమారుని ప్రజ్ఞలు/ 
ఉత్తరుని ప్రగల్భాలు ;
12. యక్ష ప్రశ్నలు వేస్తూ విసిగించకు ; 
;
*********************************************, ,

+ *2 రధ కారస్య [ సంస్కృత 2* జాతీయ] ;
&
*పిడుగు మంత్రం - అర్జునుని పది పేర్లు వల్లిస్తారు ;-
1. అర్జున ; 2.ఫల్గుణ ; 3. పార్ధ ; 5. కిరీటి ; 
6. సవ్యసాచి ; 7. శేతవాహన ; 8. బీభత్స ;
9. విజయ ; 10. ధనుంజయ ;
&
శ్లోకం ;-
ఆనుకూల్యేన కార్యాణా మస్తరం సంధీయతే |
భారస్య హి రధకారస్య న వ్యవస్యల్లి పజ్జితాః||
;
తాత్పర్య ;- దేశ, కాలములు కలిసివస్తే 
యుద్ధాది కార్యాలు విజయవంతం ఔతాయి ;
వివేకవంతులు - అనాలోచితంగా పోరుకు సిద్ధపడరు - 
రధములను తయారు చేసే వానిపైన భారం ఉంచి, యుద్ధానికి దిగరు. 
==================,
;
1. kaagala kaaryam gandharwulE teerustaaru ;
2. wimTE BAratam winaali, tinTE gaarelE tinaali ;
3. karNuDu lEni BAratam, SomThi lEni kashAyam ; 
4. adigO dwaaraka, aalamamda lawigO ; 
5. aawulanu maLLimcina wADE arjunuDu ; 
6. waccina wADu phalguNuDu - awaSyamu gelutu manamga raadu ;
8. BIshma pratijna cEsADu ;
8.
9. draupadee wastraalu
[= anEka dustulu ]
10. ee wyawahaaram amtaa padmawyuuhamlaagaa unnadi, 
ardham kaadu ; 
11. uttara kumaaruni prajnalu/ 
uttaruni pragalbhaalu ;
;

pamca paamDawulu emdaru? amTE -
aa maatram naaku telusu, mamcam kOLLalaagaa mugguru - ani
remDu wELLu cuupi, palakapai okka geeta raasaaDu [= moddu, SumTha]
&
*radha kaarasya [ samskRta* jaateeya] ;

1. arjuna ; 2.phalguNa ; 3. paardha ; 5. kireeTi ; 
6. sawyasaaci ; 7. SEtawaahana ; 8. beebhatsa ;
9. wijaya ; 10. dhanumjaya ;
;
*********************************************, 
& SlOkam ;-
aanukuulyEna kaaryANA mastaram samdhIyatE |
BArasya hi radhakArasya na wyawasyalli pajjitA@h||
;
taatparya ;- dESa, kaalamulu kalisiwastE
 
yuddhaadi kaaryaalu wijayawamtam autaayi ;
wiwEkawamtulu - anaalOcitamgaa  pOruku siddhapaDaru,
radhamulanu tayaaru cEsE waanipaina bhaaram umci, 
yuddhaaniki digaru. 

ద్వాదశి - 5 [ = 12 సామెతల గుత్తి ]

1. కాయలో పత్తి[=దూది], కాయలో ఉండగానే -
- సోమన్నకు మూడు మూరలు, నాకు ఆరు మూరలు అన్నట్లు ;
2. చేలో ప్రత్తి చేలో ఉండగానే, పోలికి మూడు పోగులు,
నాకు మూడు పోగులూ అన్నట్లు ;- రైతు సామెత ;
3. కొయ్యరా కొయ్యరా పోలిగా - అంటే - 
టంగుటూరి మిరియాలు - తాటికాయలంత - అన్నట్లు ;
4. చెవిటి చెన్నప్పా అంటే = సెనగల మల్లప్పా అన్నట్లు ;
5. పని మంతుడు పందిరి వేస్తే -
కుక్క తోక తగిలి కూలి పోయిందట 
6. చెల్లని కాసు, ఒల్లని మొగుడు ఒకటే ;
7. ఊగే పంటి కింద - - రాయి పడినట్లు ;
8.  గురువుకే పంగనామాలు పెట్టేవాడు / చెవిలో పువ్వు పెట్టేవాడు ; 
9. *1తా దూర కంత లేదు, మెడకో*2 డోలు - నానుడి ; / 
*1తాను దూర కంత లేదు గానీ,*2 మెడకు ఒక డోలు ; 
10. గడ్డి కుప్పలో - సూది మాదిరి ; - సామెత ;
11. దబ్బనంలో దారం లాగా ;
12. సూది మొన అంత చోటిస్తే, ఇల్లంతా ఆక్రమించె  ;
;
=================================,
;
2. cElO pratti cElO umDagAnE, 
pOliki mUDu pOgulu, naaku mUDu pOguluu annaTlu ;
3. koyyaraa koyyaraa pOligA amTE,
TamguTUri miriyAlu tATi kaayalamta - annaaDaTa ;
4. cewiTi cennappA amTE = senagala mallappA annaTlu ;
 5. panimamtuDu pamdiri wEstE kukka tOka tagili kuulipOyimdaTa ;;
6. cellani kaasu, ollani moguDu okaTE ;
7. uugE pamTi kimda raayi paDDaTTu ;
8. guruwukE pamganaamaalu peTTEwADu ;
cewilO puwwu peTTEwADu ;
9. taa duura kamta lEdu, meDakO DOlu - naanuDi ; / 
taanu duura kamta lEdu gaanee, meDaku oka DOlu ; 
10. gaDDi kuppalO sUdi mAdiri ;
11. dabbanamlO daaram laagaa ;
12. suudi mona amta cOTistE, illamtaa aakramimce  ;
;
- dwaadaSi - 5 [ = 12 saametala gutti ] ;   + 
caption ;- colors KSM - 4+ ; paintings blog ;;

 caption ;- colors KSM - 4 

ద్వాదశి - 4 [ = 12 సామెతల గుత్తి ]

1. కనుమకు కాకర, భోగికి పొట్ల ;
2. సూరీడొచ్చాడు ఏడో రోజు*, 
చిక్కుడాకులు తేరా అభ్యంగన స్నానాలకి ;;
3. కనుమ మీద మొయిలు, కళ్ళెదుట సిరి వాన ;
4. కనుమ రోజున మినుము కొరకాలి ;
5. కాకి నైనా, ఇల్లు కదలనీయొద్దు ;
6. కన్నె నిచ్చిన వారిని కడదాకా మరవొద్దు ;
7. నందనమ్మలు బాగా పూస్తే నారాయణుని చూచినట్లే ;
8.  కుడుము చేతికొస్తే పండుగే ;
9. ఇస్తే హిరణ్య1* దానం, ఇవ్వకుంటే కన్యాదానం ;;
10. నిత్య కళ్యాణం పచ్చ తోరణం ; 
11. మూడు నూర్లు పోయె, మూతి మీసాలు పోయె, 
నంబి సోమయాజులు నామధేయం -- తప్పకపోయె ; - సామెత ;
12. ఆరాటపు పెళ్ళికొడుకు పేరంటాలు వెంట పడ్డాడట ;  
;
- సంక్రాంతి proverbs, పండగ సామెతలు ;
=======================, ; 
1. kanumaku kaakara, BOgiki poTla ; 
2. suureeDoccADu EDO rOju*, 
cikkuDaakulu tEraa abhymgana snaanaalaki ;;
3. kanuma meeda moyilu, kaLLeduTa siri waana ;
4. kanuma rOjuna minumu korakaali ;
5. kaaki nainaa, illu kadalaneeyoddu ;
6. kanne niccina waarini kaDadaakaa marawoddu ;
7. nandanammali baagaa pUstE naarAyaNuni cUsinaTlE ;
8. kuDumu cEtikostE pamDugE ; 
9. istE hiraNya*2 daanam, iwwakumTE kanyaadaanam ;
muuDu nuurlu pOye, muuti meesaalu pOye, nambi 
sOmayaajulu naamadhEyam tappakapOye ; saameta ;
AraaTapu peLLikoDuku pEramTAlu wemTa paDDADaTa ; 
;
= *రధ సప్తమికి ; 1 ;; *2 gold] ;
colors KSM - 3 ; paintings blog 

;

2, జనవరి 2019, బుధవారం

ద్వాదశి - 3 [ = 12 సామెతల గుత్తి ]

1] నా పనికి అడ్డం రాకుండా ఉంటే చాలు, అదే పది వేలు ; 
2] పట్టుకుంటే పది వేలు ;; 
3] ధన మూల మిదం జగత్ ; 
4] పైసాలో పరమాత్మ ;; 
5] కాసులుంటే దేవుడైన దాసుడన్నది ;
6] అప్పు చేసి పప్పు కూడు ;
7]  సొమ్మొకడిది సోకొక్స్డిది ;
8] నడమంత్రపు సిరి, కళ్ళు నెత్తికెక్కాయి ;
9] డబ్బుకు లోకం దాసోహం ;
10] చేతిలో చిల్లి గవ్వ లేదు ;
11] ఎర్ర ఏగాణీ లేదు ;;;
12] తన చేతిలో పచ్చనోట్లు కళకళలాడుతున్నాయి ;
;
ద్వాదశి - 3 [ = 12 సామెతల గుత్తి ] ; 
;
=================================, ;
1] naa paniki aDDam raakumDA umTE caalu, adE padi wElu ; 
2] paTTukumTE padi wElu ;
3] dhana muula midam jagat ; 
4] paisaalO paramaatma ;; 
5] kaasulumTE dEwuDaina daasuDannadi ;
6] appu cEsi pappu kUDu ;
7] sommokaDidi sOkoksDidi ;
8] naDamamtrapu siri, kaLLu nettikekkaayi ;
9] Dabbuku lOkam daasOham ;
10] cEtilO cilli gawwa lEdu ;
11] erra EgaaNI lEdu ;;;
12] tana cEtilO paccanOTlu kaLakaLalADutunnaayi ;
;
dwaadaSi - 3 [ = 12 saametala gutti ] ; 
;
 colors KSM - 2 ; paintings blog 
caption ;- colors KSM - 2 ; paintings blog ;

27, డిసెంబర్ 2018, గురువారం

ద్వాదశి - 2 = 12 సామెతల గుత్తి

1. చిన్నక్క చిలక, పెద్దక్క గిలక, చూస్తే చుక్క, రేగితే కుక్క ; 
2. గుంటూరు పొగాకు గూట్లో ఉన్నా ఒకటే నోట్లో ఉన్నా ఒకటే ; 
3. గుండ్లకమ్మ నిండి దరి చేరనీదు, గంపకమ్మ కలిగి తిననీదు.
4. గానుగ రోట్లో చేతులు పెట్టి, పెరుమాళ్ళు కృప అన్నట్లు.
 5. గారాబం గుర్రాని కేడిస్తే, వీపు దెబ్బల 
6. కోర్టుకెక్కిన వారు - ఆవు కొమ్ము దగ్గర ఒకరు - తోక దగ్గర ఒకరు - 
పొదుగు దగ్గర మాత్రం నల్ల కోటు వకీలున్నూ. కూర్చుంటారు. 
7. గంగాస్నానం - తుంగా పానం ;
8. గంత కట్టేదా బసవన్నా అంటే ఊహూ అన్నదట, గుగ్గిళ్ళు తింటావా బసవన్నా అంటే, ఆహా అన్నదట. 
9. గంప సిడి [ సిరి ] కాదు, గాలం సిడి [ = బాధ ] ;
10. గడీలెక్కు తిమ్మన్నా, గంతులు వేయి తిమ్మన్నా ;; 
11. గట్టు మీదున్న వానికి, గప్పాలు ఎక్కువ. 
12. గవ్వ ఆదాయమూ లేదు, గడియ పురసత్తు [ = తీరిక ] లేదు. 
;
ద్వాదశి - 2  [ = 12 సామెతల గుత్తి ] ;
=================, ;
;
1. cinnakka cilaka, peddakka gilaka, cuustE cukka, rEgitE kukka ; 
2. gunTUru pogaaku guuTlO unnA okaTE nOTlO unnaa okaTE ; ;;
3. gumDlakamma nimDi dari cEraneedu, gampakamma kaligi tinaneedu.
4. gaanuga rOTlO cEtulu peTTi, perumALLu kRpa annaTlu.
5.  gaaraabam gurraani kEDistE, weepu debbala 
6. kOrTukekkina waaru - aawu kommu daggara okaru - tOka daggara okaru - podugu daggara maatram nalla kOTu wakeelunnuu. kuurcumTAru. 
7. gamgaasnaanam - tumgaa paanam ;; 
8. gamta kaTTEdA basawannaa amTE UhU annadaTa, guggiLLu timTAwA basawannaa amTE, aahaa annadaTa. 
9. gampa siDi [ siri ] kaadu, gaalam siDi [ = baadha ] ;;
10. gaDeelekku timmannaa, gamtulu wEyi timmannaa ;; 
11. gaTTu meedunna waaniki, gappaalu ekkuwa. 
12. gawwa aadaayamuu lEdu, gaDiya purasattu [ = teerika ] lEdu. 
= dwaadaSi - 2 [ = 12 saametala gutti ] ;

22, డిసెంబర్ 2018, శనివారం

ద్వాదశి - 1

1. చెక్కక పోతే దిమ్మ, చెక్కితే బొమ్మ - గుళ్ళో ఉంటే అమ్మ ;
2. గోచీ విప్పి, తలపాగా చుట్టినట్లు
3. మా అమ్మాయి బంగారు బొమ్మ / కుందనపు బొమ్మ ;;
4. కలసి ఉంటే కలదు సుఖం ;
5. కలిసి వచ్చిన అదృష్టం ;
6. అభ్యాసం కూసు విద్య ;
7. నవ్వితే నవరత్నాలు  ; 
8. పట్టిందల్లా బంగారం ; 
9.  చదువు రాకముందు కాకర కాయ, చదువుకున్నాక కీకరకాయ ;
10. చెన్నంపల్లి పంచాయతీ - చెరి సగం ; 
11.  చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు ; 
12. చెవిటివాని ముందు శంఖం ఊదితే - దాన్ని కొరకను నీ తాతలు దిగిరావాలి అన్నాడట.
;
ద్వాదశి - 1  [ = 12 సామెతల గుత్తి ] ;
=================, ;
;
1. cekkaka pOtE dimma, cekkitE bomma - guLLO umTE amma ;
2.  gOcee teesi talapaaga cuTTinaTlu ;
3. maa ammaayi bamgaaru bomma / kumdanapu bomma ;
4. kalasi umTE kaladu sukham ;
5. kalisi waccina adRshTam ;
6. abhyaasam kuusu widya ; 
7. nawwitE nawaratnaalu  ; 
8. paTTimdallaa bamgaaram ; 
9. caduwu raakamumdu kaakara kaaya, caduwukunnaaka keekarakaaya ;
10. cennampalli pamcaayatee - ceri sagam ; 
11. cEsEwi naayakaalu, aDigEwi tiripaalu, peTTakumTE kOpaalu ;  
12. cewiTiwaani mumdu Samkham uuditE - daanni korakanu nee taatalu digi raawaali annADaTa.
;
= dwaadaSi - 1 [ = 12 saametala gutti ] ;
;
colors KSM - 1

20, డిసెంబర్ 2018, గురువారం

రామ్ టెక్ - టెక్ = ప్రతిజ్ఞ

రామ్ టెక్ ;- 1. మరాఠీ భాషలో "టెక్" ప్రతిజ్ఞ - అని అర్ధం. 
అగస్త్య ముని మున్నగువారు యజ్ఞ యాగాలు చేస్తుండే వారు. 
మహర్షుల సత్క్రియలను రాక్షసులు ధ్వంసం చేస్తుండే వాళ్ళు. 
అది తెలిసిన శ్రీరామచంద్రుడు - దుష్టులను దునుముటకు - 
వాగ్దానం చేసాడు. 
2. కనుక రామ్ టెక్ అనే పేరు - ఈ ప్రాంతానికి కలిగింది.
మరో చారిత్రక విశేషం ;- మహాకవి కాళిదాసు - 
ఈ రామగిరిశిఖరములకు చేరి, 
మేఘసందేశం - మహాకావ్యాన్ని రచించి - 
ప్రపంచానికి అమూల్య కావ్యాలను అందించాడు.
;
3. నాగపూర్ [మహారాష్ట్ర] చక్రవర్తి రఘుజీ భోన్స్ లే - 
ఛిన్ ద్వారా కోటను [Deoghar in Cindwara] గెలిచాడు. 
ఆ సందర్భాన్ని పురస్కరించుకుని - రాజు కట్టించిన గుడి రామ్ టెక్ కోవెల.; 
;
4. Atishayakshetra ;- జైన విగ్రహములు ఉన్న చారిత్రక ప్రాధాన్యతతో - 
అతిశయ క్షేత్రము - అని పేరొందిన సీమ ఇది.
5. తెలుగు వారైన కీర్తిశేషులు - నరసింహారావు - 
ప్రధానమంత్రి పదవికి - ఇక్కడి నుండి పోటీ చేసారు.
;
♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣ ♣♣♣

Architecture:
Ram Temple is renowned for its unique OM structure, located at the foot of Ramgiri hill. 
Measuring 350 feet long, 10.5 feet high and 11 feet wide, 
this structure is beautifully adorned with picturesque description of 
Ramayana, Krishna Leela and idols of Lord Hanuman, Sai Baba and Gajanan Maharaj. 
;
 SRI RAAMAA Raamamaa ;
;
kusuma screen paint - 1 

;