25, మే 2020, సోమవారం

ద్వాదశి - 20 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఇంటికొక పువ్వు, ఈశ్వరుని కొక దండ ; 
2] గడ ఎక్కు తిమ్మన్నా, 
          గంతులు వేయి తిమ్మన్నా ;
3] లంకలో హరి శబ్దం ;
 4] లగ్నంలో తుమ్మినట్లు ; 
5] ఆలి పంచాయతీ రామాయణం, 
               పాలి పంచాయితీ భారతం ;
6] నిజం నిద్ర లేచి నడక మొదలెట్టేటప్పటికి - 
           అబద్ధం అంతరిక్షం దాకా చుట్టబెడుతుంది  ;
7] కొన్నది వంకాయ, కొసరుతున్నది గుమ్మడి కాయ ;
8] కొర్రగింజంత కోడలిని చూడగానే -
   కొండంత అత్తకు చలిజ్వరం వచ్చిందంట 
9] కోతి చేతికి కొబ్బరికాయ దొరికినట్లు  ;
10] శేరు దొరగారికి, మణుగు బంటు ; 
11]  పిఠాపురం వెళ్ళి పిడికెడు నీళ్ళు తెచ్చినట్లు ;
12] గప్పాలపోతురెడ్డికి మూడు ఎడ్లు, ముప్ఫైమూడు *దొడ్లు [*గోశాల] ;
============.
1] imTikoka puwwu, ISwaruni koka damDa ; 
2] gaDa ekku timmannA, 
         gamtulu wEyi timmannA ; 
3] lamkalO hari Sabdam ;
4] lagnamlO tumminaTlu ;
5] aali pamcaayatee raamaayaNam,
     paali pamcaayitee bhaaratam ; 
6] nijam nidra lEci naDaka modaleTTETappaTiki -
           abaddham amtariksham daakaa cuTTabeDutumdi ;
7] konnadi wamkaaya kosarutunnadi gummaDi kAya ;
8] korragimjamta kODalini cUDagAnE -
       komDamta attaku calijwaram waccimdamTa ; ;
9] kOti cEtiki kobbarikaaya dorikinaTlu ; 
10] SEru doragAriki, maNugu bamTu ;
11] piThApuram weLLi piDikeDu nILLu teccinaTlu ; 
12] gappAla pOtureDDiki muuDu eDlu, 
mupphai mUDu *doDlu [*gOSAla] ;
&
ముందు పోస్టు ;-  ద్వాదశి - 19 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] ఆలు ఆత్మకూరులో , మొగుడు బోయిపల్లిలో, 
       కుండ చట్టి కుణుతూరులో, తలంబ్రాలు తాడిపత్రిలో ;     
2] పెన్న దాటితేనే కదా పెరుమాళ్ళ సేవ ;

ద్వాదశి - 19 - పన్నెండు తెలుగు సామెతలు ;

1] ఆలు ఆత్మకూరులో , మొగుడు బోయిపల్లిలో, 
       కుండ చట్టి కుణుతూరులో, తలంబ్రాలు తాడిపత్రిలో ;     
2] పెన్న దాటితేనే కదా పెరుమాళ్ళ సేవ ;
3] *లడాయిల - **శక్కర పంచినట్టు -
REF ;- [*పోట్లాట, **చక్కెర] ; 
4] గంత బొంత కలిపి, గాడిదమోత బరువైనట్లు ;
5] గుడి ముఖం ఎరగని దాసరి, 
గుడి వెనక్కి వెళ్ళి దండం పెట్టాడట ;
6] గిద్దెడు నూనెకైనా, 
         గానుగ కట్టాల్సిందే కదా ;
 7] పెద్దక్క ఓలి తెగితే* -
చిన్నక్క ఓలి తెగుతుంది.  [*నిర్ణయం ఐతే]  ;
8] ఆవో అంటే అర్ధం కాలేేదు మొర్రో / బాబో - అంటుంటే  -
           ఖడో అనేదాన్ని అంట గట్టాడట ;
9] దయ దండిది, గుణం మొండిది ;
10] కొత్తంత *పండగ లేదు, 
         అల్లుడంత చుట్టము లేడు ; 
[*ఉగాది పండుగ]  - తెలంగాణా prvb ;
11] పిడక పొగకి సిగమూగితే, గుగ్గిలం పొగకు ఎట్లాగౌతది!? 
12]  కూర మంచి, కుండ చేదు ;
==============;
1] aalu aatmakUrulO, moguDu bOyipallilO, 
kumDa caTTi kuNutUrulO, talambraalu tADipatrilO ; 
2] penna dATitEnE kadA perumALLa sEwa ;
3] laDAyila Sakkara pamcinaTTu ;
REF ;- [*  pOTlATa , **cakkera] ;
4] gamta bomta kalipi, gADida mOta baruwaina Tlu ; 
5] guDi muKam eragani daasari, 
       guDi wenakki weLLi damDam peTTADaTa ; 
6] giddeDu nuunekainaa, 
    gaanuga kaTTAlsimdE kadaa ;
7] peddakka Oli tegitE* cinnakka Oli 
tegutumdi. [*nirNayam aitE] ;
8] aawO amTE ardham kaaalEdu morrO/ 
baabO amTumTE ; 
KaDO anEdaanni amTa gaTTADaTa ;  
9] daya damDidi,  guNam momDidi ; 
10] = kottamta pamDaga* lEdu, 
alluDamta cuTTamu lEDu ; [*UGAADI ] ;
11] piDaka pogaki sigamuugitE, 
guggilam pogaku eTlaagautadi!? ; poTTa 
kUTiki jerripOtlanu ADistADu ; 
12]  kuura mamci, kumDa cEdu ;
;
ముందు పోస్టు ;-  ద్వాదశి - 18 - పన్నెండు తెలుగు సామెతలు ;
1] నమ్మితి రామన్నా అంటే - నా అంతటి వాణ్ణి చేస్తానన్నట్లు  ;
2] గుడి చిన్నదైనా, గుళ్ళో దేవుని మహిమ మిన్న ; 

ద్వాదశి - 18 - పన్నెండు తెలుగు సామెతలు ;

1] నమ్మితి రామన్నా అంటే -
నా అంతటి వాణ్ణి చేస్తానన్నట్లు  ;
2] గుడి చిన్నదైనా, గుళ్ళో దేవుని మహిమ మిన్న ; 
3] పదలం నూలుపాగా లేకుంటే -
                 పంతులుగారు అవరు ;
4] మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందంట  ;
5] ఇంటికో కడి తిని, 
      గుంటకో గుక్క నీళ్ళు తాగినట్టు
6] ఒక ఊరి పటేలు -
ఇంకో ఊరికి గాయిదోడు* [*సామాన్యుడు] ;
7] కొప్పు ఉన్నమ్మకి కోటి వయ్యారాలు ;
8] అంత నాడు లేదు, ఇంత నాడు లేదు -
        సంత నాడు పెట్టిందమ్మ ముంతంత కొప్పు ;
9] కానీకి టెంకాయ ఇస్తారని -
          కాశీపట్నానికి వెళ్ళినట్లు ; 
10] అంతా తెలిసిన వాడూ లేడు, 
          ఏమీ తెలియని వాడూ లేడు ;
11] అంపబోయిన అల్లీ సాహెబు .
పిలువబోయిన పీరుసాహెబు మాయ మయ్యారు
12] అబద్ధాలకోరు నోటికి అరవీసెడు సున్నం చాలునా ;
====================,
1] nammiti raamannaa amTE - 
nA amtaTi waaNNi cEstAnannaTlu ;
2] guDi cinnadainaa, 
guLLO dEwuni mahima minna
3] padalam nuulu paagaa lEkumTE -
                pamtulugAru awaru ; 
4] mettagaa umTE motta buddhi ayyimdamTa ; ;
5] imTikO kaDi tini, 
gumTakO gukka neeLLu taaginaTTu ;
6] oka uuri paTElu -
    - ImkO Uriki gaayidODu* [*saamaanyuDu] ;
7] koppu unnammaki kOTi wayyArAlu ;
8] amta nADu lEdu, imta nADu lEdu -
         samta nADu peTTimdamma mumtamta koppu ;
9] kAnIki TemkAya istaarani ; kASIpaTnaaniki weLLinaTlu ; 
10] amtaa telisina wADU lEDu, EmI teliyani wADU lEDu ;
11] ampabOyina allee saahebu .
      piluwa bOyina peeru saahebu maayamayyaaru ; 
12] abaddhAla kOru nOTiki araweeseDu sunnam caalunaa ; 
;
ముందు పోస్టు ;-  ద్వాదశి - 17 - పన్నెండు తెలుగు సామెతలు ;-
ఇల్లే ఇంద్రలోకం ; పందిరే గోవర్ధనం* ; [*పర్వతం ]  ; 
& పనుకుంటే పద్మావతి, కృషి ఉంటే గుణవతి, లేస్తే నీలావతి ;

ద్వాదశి - 17 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఇల్లే ఇంద్రలోకం ; పందిరే గోవర్ధనం* ; [*పర్వతం ]  ;
2] పనుకుంటే పద్మావతి, కృషి ఉంటే గుణవతి, లేస్తే నీలావతి ;
3]  అప్పులున్న వారితో, చెప్పులున్న వారితో పోగూడదు ;
5]  *అల్లికాయల సందడిని పెళ్ళి మరిచాడట ; 
6] ఊపిరి ఉంటే - ఉప్పుకల్లు అమ్ముకునైనా బతుకవచ్చు ; 
7] తాడు చాలదని, బావి పూడ్చ మన్నాడట ;
8] సంద్రాన్ని చంకనెట్టుకుని, 
       చెలమకు చెయ్యి సాచినట్లు  ;
98] వెన్న తిన్నవాడు వెళ్ళిపోగా, 
చల్ల తాగిన వాడిని చప్పగా కొట్టేసిందట ;
11] ఆడాలి పాడాలి మద్దెల కూడా కొట్టాలి ;
12] ఆడబోయిన తీర్ధం ఎదురైనట్లు ;
&
REF ;- *అల్లికాయల సందడిని పెళ్ళి మరిచాడట ; 
[eg ;-  అల్లువారిలా అల్లికాయ చేష్టలు పోయినా ఒక్క బాలుడి వల్లే సాధ్యం ;  
& marble, n. (1) పాలరాయి; చలువరాయి; సున్నపురాయి; సంగమల; 
గోలీకాయ; అల్లికాయ ; 
=========================, ;
1]  pamdirE parwatam, illE imdralOkam ;
2] panukumTE padmaawati, kRshi umTE guNawati, lEstE neelaawati ; 
3] appulunna waaritO, ceppulunna wAritO pOgUDadu ;
5] allikaayala samdaDini peLLi maricADaTa ; [ *REF ;- allikaayalu ] ; 
6] upiri umTE uppukallu ammukunainaa batukawaccu ;
7] tADu caaladani, baawi pUDcamannADaTa ;
8] samdrAnni camka neTTukuni, 
           celamaku ceyyi sAcinaTlu ; 
9] wenna tinnawaaDu weLLipOgA, 
calla taagina waaDini cappagaa koTTEsimdaTa ; 
11] ADAli ,pADAli maddelA koTTAli ; 
12] ADabOyina tIrdham edurainaTlu ; 
;
ముందు పోస్టు ;- ద్వాదశి - 16 - పన్నెండు తెలుగు సామెతలు
ఒక చిత్రం, ఒక బొమ్మ ;  వెయ్యి మాటలతో సమానం ;
& అప్పులెందుకు మిగిలాయిరా అంటే, 
ఎగ్గొట్టడం చేతకాక అన్నాడట  ;

ద్వాదశి - 16 - పన్నెండు తెలుగు సామెతలు

1] ఒక చిత్రం, ఒక బొమ్మ ; 
          - వెయ్యి మాటలతో సమానం ;
2]  అప్పులెందుకు మిగిలాయిరా అంటే, 
ఎగ్గొట్టడం చేతకాక అన్నాడట  ;
3] అప్పు ఇచ్చి చూడు, పిల్లను ఇచ్చి చూడు ;
4] సత్రం భోజనం మఠం నిద్ర - అన్నట్లు ఉన్నది  ;
5] ఉబిసో ఉబ్బేసో పని చేపించుకోవాల ;
6] నూటికి వస్తాదు, బహు పోటుగాడు  ; 
7] విత్తు కొద్దీ విభవం, విద్య కొద్దీ వినయం  ; 
8] కష్ట సంపాదన ఇష్ట భోజనం ;
9] పగటి నిద్ర పనికి చేటు ; రాత్రి మాటలు నిద్రకు చేటు ;
10] అంకపొంకాలు* లేనిదమ్మ, శివలింగం, వందే - ;
[వందే =నమస్కారం, * అంకం - సంఖ్య ; పొంకం = గర్వం ] ;
11] పుణ్యానికి పుట్టిందే సాక్షి, బావికి నీళ్ళే సాక్షి  ;
12] ఆడబోయిన తీర్ధం ఎదురైనట్లు ; 
=================================;
1] oka citram, oka bomma ; weyyi mATalatO samAnam ; 
2] appulemduku migilAyirA amTE, 
eggoTTaDam cEtakaaka annADaTa ; 
3] appu icci CUDu, pillanu icii cUDu ;
4] satram BOjanam maTham nidra - annaTlu unnadi ; 
5] ubisO ubbEsO pani cEpimcukOwaala ;;
6] nUTiki wastAdu, bahu pOTugADu ; 
7] wittu koddI waiBawam, aidya koddI winayam ; 
8] kashTa sampaadana, ishTa BOjanam ; 
9] pagaTi nidra paniki cETu, raati mATalu nidaraku cETu ; 
10] amka pomkAlu lEnidamma Siwalimgam, wamdE ; 
11]  puNyAniki puTTimdE sAkshi, bAwiki nILLE sAkshi ; 
12] ADabOyina tIrdham edurainaTlu 
;
ముందు పోస్టు ;-  ద్వాదశి - 15 - పన్నెండు తెలుగు సామెతలు ;
విక్రమార్కుని వంటి ప్రభువు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు ; 
;

ద్వాదశి - 15 - పన్నెండు తెలుగు సామెతలు

1] విక్రమార్కుని వంటి ప్రభువు ఉంటే, భట్టి వంటి మంత్రి అప్పుడే ఉంటాడు ; 
2] తామరాకు నీట ముంచి ఎత్తినట్లు [from సారంగపాణి పదములు - prb ] ;
3] ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉన్నది -
*మాయాబజార్ ;- Film సామెత ] ; 
4] నెత్తిన ' *తిరుమల కొప్పు' :) పెట్టించినట్లు ; 
[*గుండు ] ; - [అన్నమాచార్య సామెత] ;  
5] చెవి మీద పేను పారనీయడు వీడు  ;]
6] చీమ చిటుక్కుమననీయడు ; 
[ Same Meaning - above 6 proverb ] 
7] చిక్కి చికిలించే కన్నా, వెళ్ళి వెక్కిరించేది మేలు ;
 8]  అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరిచిపోరు ;
9] అన్నం పెడితే అరిగిపోతుంది, 
వాత పెడితే కలకాలం ఉంటుంది ;
10] అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు ; 
అక్కచెల్లెళ్ళ పొత్తు పెద్దప్పుడు ;
11]  వెనుకటికి ఎవడో బహు జాగ్రత్తమంతుడు ,
నీళ్ళలో ఉప్పు దాచిపెట్టాడట ;
12] ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుంది ;
=======================,
1] wikramaarkuni wamTi prabhuwu umTE, 
BaTTi wamTi mamtri appuDE umTADu ;
2] taamaraaku neeTa mumci ettinaTlu - 
from - SARANGAPANI Padamulu - prb ;
3] mukkOpaaniki wiruguDu mukhastuti umDanE unnadi ;
4] nettina tirumala koppu peTTimcinaTlu ; 
[annamaacaarya saameta] ; 
5] cewi meeda pEnu pAra nIyaDu weeDu  ;
6] cIma ciTukkumananIyaDu] ; 
 [ Same Meaning - above 6 proverb ] 
7] cikki cikilimcE kannaa, weLLi wekkirimcEdi mElu ;
8] annam tinnawADu, tannulu tinnawADu maricipOru ; 
9] annam peDitE arigipOtumdi, waata peDitE kalakaalam umTumdi ; 
10] annadammula pottu cinnappuDu ; 
akkacelleLLa pottu peddappuDu ;
11] wenukaTiki ewaDO bahu jaagrattamamtuDu nILLalO uppu daacipeTTADaTa ;  
12] E gUTi ciluka A gUTi palukulu palukutumdi ; 
;
& REF ;- 4] *గుండు = * gumDu ; 
ముందు పోస్టు ;- ద్వాదశి - 14 - పన్నెండు తెలుగు సామెతలు ;
హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేస్తాడు ;
;

ద్వాదశి - 14 - పన్నెండు తెలుగు సామెతలు

1] హనుమంతుడి ఎదుట కుప్పిగంతులు వేస్తాడు ;
2]  సత్యం చెప్పుల్లో కాళ్ళు పెడుతుంటే, అసత్యం ప్రపంచం చుట్టి వస్తుంది
3] సుఖం మరిగిన దాసరి, పదం మరిచాడట ;
4] కల్లుకుండ వద్ద కయ్యం ; జుట్టు లాక్కుపోయే దయ్యం ;
5] కట్టె వంకర పొయ్యి తీర్చింది ; 
6] పాతిక కోతి, ముప్పాతిక బెల్లం తిన్నదట ;;
7] ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం, తక్కువ తెలివి తన్నుల కారణం ;
8] నూరు కీడులు ఓరిస్తేనే, ఒక్క మంచి దక్కుతుంది ;
9] ఇంటి వంట ఐతే పచ్చడి మెతుకులు ఐనా మెరుగే ;
10] పెద్దలు లేని ఇల్లు, సిద్ధులు లేని మఠము ;
11] పిల్లితోకని ఎద్దు తొక్కితే ; ఎలుక మీసాలు దువ్విందంట  ;
12] వంక పెట్టనిదే వెన్నపూస కూడా కొనరు ;
==================,
1] hanumamtuDi eduTa kuppigamtulu wEstADu ;
2] satyam ceppullO kALLu peDutumTE, 
asatyam prapamcam cuTTi wastumdi ;
3] sukham marigina daasari, padam maricADaTa ; 
4] kallukumDa wadda kayyam ; juTTu laakkupOyE dayyam ;
5]  kaTTe wamkara poyyi teercimdi ; 
6] pAtika kOti, muppaatika bellam tinnadaTa ;
7] ekkuwa teliwi EDpula kaaraNam, 
takkuwa teliwi tannula kaaraNam ;
8] nuuru keeDulu OristEnE, okka mamci dakkutumdi ; 
9] imTi wamTa aitE paccaDi metukulu ainA merugE ;
10] peddalu lEni illu, siddhulu lEni maThamu ;
11] pillitOkani eddu tokkitE ; 
eluka meesaalu duwwimdamTa ;  
12] wamka peTTanidE wennapuusa kUDA konaru ;
;
ముందు పోస్టు ;-  ద్వాదశి - 13 [12 సామెతలు Telugu proverbs] 
1]  మక్కువ పడి ముక్కాలి పీట చేయించుకుంటే 
డోరియా కోక కాస్తా కత్తిరించుకు పోయిందంట ;