30, సెప్టెంబర్ 2018, ఆదివారం

అయితే ఆదివారం .... సోమవారం

1. ఐశ్వర్యం అందలం ఎక్కించగానే - 
అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట. - [ హాస్య సామెత] 
2. ఐతంపూడి ఉద్యోగం - ఐతే గియ్తే ఆరు ఆవుల పాడి, 
చేస్తే  గీస్తే పెరుగు, వెన్న - ;;
3. అయితే ఆదివారం, కాకుంటే సోమవారం ;
=================================
;
1. aiSwaryam amdalam ekkistE -
ardharaatri goDuugTTamannaaDaTa. [ comedy proverb
2. aitampUDi udyOgam - aitE giytE aaru aawula pADi, 
cEstE gIstE perugu, wennaa - ;;
3. ayitE aadiwaaram, kaakumTE sOmawaaram ; 
nandanajaya- oct 2018 - 19 kusuma paints

అక్కన్న, మాదన్నలు పల్లకీ ఎక్కితే .....

1. అక్కన్న, మాదన్న గార్లు అందలం ఎక్కితే, 
సాటి సరప్ప చెరువుకట్ట ఎక్కి కూర్చున్నాడంట.

akkanna, maadanna gaarlu amdalam ekkitE, 
saaTi sarappa ceruwukaTTa ekki kuurcunnADamTa.
;
2. అచ్చంగా తిరుమణిధారి ఐతే - 
పుల్ల పట్టడం లోనే పద్ధతి తెలుస్తుంది
=
accamgaa tirumaNidhaari aitE - pulla paTTaDam lOnE 
paddhati telustumdi.
;
3. అన్నం పెడితే అరిగిపోతుంది
చీర ఇస్తే చిరిగిపోతుంది ; 
వాత పెడితే కలకాలం ఉంటుంది - హాస్య సామెత ; 
=
annam peDitE arigipOtumdi
ceera istE cirigipOtumdi ; 

waata peDitE kalakaalam umTumdi - haasya saameta ; 
;

nandanajaya- 2018 - 16 kusuma paints 

28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

కడుపు నిండిన వాడికి గారెలు చేదు

1] లేడికి లేచిందే పరుగు ;
= lEDiki lEcimdE parugu.
2. కడుపు నిండిన వాడికి గారెలు చేదు - సామెత  . ;
= 2. kaDupu nimDina wADiki gaarelu cEdu. ;
3. పిట్ట కొంచెం ; కూత ఘనం ; - సామెత ;
= piTTa komcem, kuuta ghanam ;
;
nandanajaya- సెప్టెంబర్ 2018 - 13 kusuma paints





24, సెప్టెంబర్ 2018, సోమవారం

ఇంట్లో పిల్లి, వీధిలో పులి

డబ్బుకు లోకం దాసోహం. 
కాసు ఉంటే లోకమంతా దాసుడన్నది  
ధనమూల మిదం జగత్ ; 
ధన మూలం ఇదం జగత్ ; 
ధనమేరా అన్నిటికీ మూలం ; 
&
ఇంట్లో పిల్లి, వీధిలో పులి ;
విద్యా పర దేవతా ;
=======================; ;
;
kaasu umTE lOkamamtaa daasuDannadi ; 
imTlO pilli, weedhiIO puli ; 
widyaa para dEwataa ;
Nandanajaya kusuma paints - 12 

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

తిక్కలవాళ్ళు తిరణాళ్ళకు వెళితే, ఎక్కనూ దిగనూ సరిపోయిందట

1. డబ్బుకు లోకం దాసోహం ;
2. A. తెగువ దేవేంద్ర పదవి &
B. మొండివాడు రాజు కన్నా బలవంతుడు ;
3. తిక్కలవాళ్ళు తిరణాళ్ళకు వెళితే, 
ఎక్కనూ దిగనూ సరిపోయిందట ; 

1. Dabbuku lOkam daasOham ;
2. A. teguwa dEwEmdra padawi &
B. momDiwADu raaju kannaa balawamtuDu ;
3. tikkalawALLu tiraNALLaku weLitE, 
ekkanuu diganuu saripOyimdaTa ;
;
  kusuma ART - nandanajaya 10 

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

పిపీలికం - చీమ

పిపీలికాది బ్రహ్మ పర్యంతం ;- 
పిపీలికం - చీమ ; पिपीलिक/ पिपीलिका ;
చీమ మొదలుకొని బ్రహ్మాడం వరకూ ;
అణువు మొదలు దాకా - అని పలుకుబబడి ; 
ఈ వాక్యాలు వేదాంతపరమైనవి, 
భక్తిపూర్వకంగా కూడా వాడుకలో ఉన్నవి.
1] ఆబాలగోపాలం ;
2] ఆమూలాగ్రం నిశితంగా పరిశీలించుట ;
3] నఖ శిఖ పర్యంతమూ చూస్తూ ;
3] భూ - నభోగోళాలు ;-
భూ - నభో పర్యంతం దద్దరిల్లేలా ...... ;-
మున్నగునవి - [ఇదే అర్ధంలో కాకున్నా ..... ]
ఈ పంధాలోని నుడువులు - అని చెప్పవచ్చును. 
;
============================; ;
pipeelikaadi brahma paryamtam ;- pipeelikam - ceema ;
ceema modalukoni brahmADam warakuu ;
aNuwu modalu daakaa - ani palukubabaDi ; 
ee waakyaalu wEdaamtaparamainawi, 
bhaktipuurwakamgaa kUDA waaDukalO unnawi.
1] aabaalagOpaalam ;
2] aamuulaagram niSitamgaa pariSeelimcuTa ;
3] nakha Sikha paryamtamuu cuustuu ;
4] bhuu - nabhOgOLAlu ;
bhuu - nabhO paryamtam daddarillElaa ;munnagunawi - 
[idE ardhamlO kaakunnaa .... ] ;
ee pamdhaalOni nuDuwulu - ani ceppawaccunu. 
;
nandanajaya- 9 sept  2018ksm paints  

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

పని లేక పటేలింటికి పోతే, పాతగోడకు పూత పెట్టమన్నాడట

1. పని లేక పటేలింటికి పోతే ; 
పాత గోడకు పూత పెట్టమన్నాడట ; [హాస్య సామెత ] ;
2. కోటి విద్యలు కూటి కొరకే ;
3.  అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న ;
============================== ;
1. pani lEka paTElimTiki pOtE ; 
paata gODaku pUta peTTamannADaTa ; 
[haasya saameta ] ; lOkOkti ; lOkam pOkaDa ;
2. kOTi widyalu kUTi korakE ;
3. atani kanTe ghanuDu, aacamTa mallanna ;
;
nandanajaya- 8 sept  2018ksm paints