13, సెప్టెంబర్ 2023, బుధవారం

సున్నం నీళ్ళు use

 రాళ్ళను పగలగొట్టే విధానం ;-
"ఇంక ఇప్పుడు ఱాళ్ళను పగలగొట్టే  పద్ధతులను వివరిస్తాను." 
అంటూ, వరాహమిహిరుడు - నూతన విశేషాలను ఈ అధ్యాయాలలో విపులీకరిస్తున్నాడు.
భేదం యదా నైతి శిలా తదానీం పాలాశ కాష్ఠైః సహ తిందుకానామ్|
ప్రజ్వాలయిత్వాన్ అనలం అగ్ని వర్ణా సుధాంబు సిక్తా ప్రవిదారమేతి|| శ్లోకమ్ ;  ౧౧౩ = 113 ;; 
తా. వాపీ *కూపాదులు ఒనర్చు కాలమున - 
పగలగొట్టడానికి వీలుకానట్టి - అశక్యాలైన కఠిన పాషాణాలు ఉంటే - 
ఆ ఱాళ్ళ మీద -
మోదుగ కట్టెలు, తుమికికట్టెలు - 
వీటిని పేర్చి, అగ్నిని ఉంచాలి.
అగ్గి బాగా ఎర్రన అయ్యేటట్లు ప్రజ్వలింపజేయాలి. 
పిదప సున్నం నీళ్ళుపోసి, చల్లార్చినచో - 
ఆ గండుశిలలు పగులుతాయి.   ౧౧౩ = 113 ;; 
& *కూపం = బావి, well/ pit/ follicle/ cesspool ;
& = సున్నం నీళ్ళు = Lime water &  
సున్నం = Calcum/ Hydrated Lime ; 
================================ , 
sunnam nILLu `use` ;- 
         rALLanu pagalagoTTE widhaanam ;-
"imka ippuDu ~rALLanu pagalagoTTE  paddhatulanu wiwaristaanu."
amTU, waraahamihiruDu - nuutana wiSEshaalanu 
ee adhyaayaalalO wipuleekaristunnADu.
BEdam yadaa naiti Silaa tadaaneem paalASa kaashThai@h saha timdukaanaamm|
prajwaalayitwaan analam agni warNA sudhaambu siktaa prawidaaramEti|| శ్లోకమ్ ;  ౧౧౩ = 113 ;;  
taa. waapee kuupaadulu onarcu kaalamuna - 
pagalagoTTaDAniki weelukaanaTTi - 
aSakyaalaina kaThina paashANAlu umTE - 
aa ~raaLLa meeda -mOduga kaTTelu, tumikikaTTelu - 
weeTini pErci, agnini umcaali.
aggi baagaa errana ayyETaTlu prajwalimpajEyaali. 
pidapa sunnam nILLupOsi, callArcinacO - Aa gamDuSilalu pagulutAyi.   ౧౧౩ = 113 ;; 
&
Link = Hindu జలశుద్ధి విధానములు ;- బావి = well, నీటి మడుగులు - 
అందు వచ్చిన నీరు - బురదగా/ వగరుగా/ దుర్గంధం ఉన్నచో -  
ఆ  water purification ;- 
                                జలశుద్ధి విధానములు ;- 
మద్దిచెట్టు పట్ట, తుంగగడ్డలు, వట్టివేళ్ళు,  శొంఠి, 
బీరవిత్తులు, ఉసిరిక పొట్టు, చిల్లగింజలు - 
అన్నిటినీ చూర్ణం చేసి, ఆ నీళ్ళలో కలిపివేయాలి.
అప్పుడు - ఆ ఉప్పునీళ్ళు -> మధురజలములు అగును. [శ్లో; ౧౦ ] 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి